ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

AP Budget 2024-25: అసెంబ్లీలో ఇంట్రస్టింగ్ సీన్.. అబాసుపాలైన వైసీపీ..

ABN, Publish Date - Nov 11 , 2024 | 12:14 PM

AP Assembly Budget Session 20224-25: ఏ పార్టీ అయినా ఒక నిర్ణయం తీసుకుంటుంది. ఆ నిర్ణయానికి కట్టుబడి.. దాని ప్రకారం ఆ పార్టీ నాయకులు నడుచుకుంటారు. కానీ ఒక ఆలోచనా.. ఒక నిర్ణయం.. ఒక ప్లాన్.. సమాజంపై గౌరవం, చట్టాలంటే భయం లేని వైసీపీ నేతలు..

AP Budget 2024-25

AP Assembly Budget Session 20224-25: ఏ పార్టీ అయినా ఒక నిర్ణయం తీసుకుంటుంది. ఆ నిర్ణయానికి కట్టుబడి.. దాని ప్రకారం ఆ పార్టీ నాయకులు నడుచుకుంటారు. కానీ ఒక ఆలోచనా.. ఒక నిర్ణయం.. ఒక ప్లాన్.. సమాజంపై గౌరవం, చట్టాలంటే భయం లేని వైసీపీ నేతలు.. అడ్డదిగ్గంగానే ప్రవర్తిస్తారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా వైసీపీ నేతలు మరోసారి తమ వెకిలితనాన్ని నిరూపించుకున్నారు. తమకీ వ్యూహం ఉందంటూ.. ఏదో చేయబోయి.. మరేదో చేశారు. ఇదే అంశంపై అసెంబ్లీలో అధికారపక్షం నేతలు.. వైసీపీ తీరుపై జోకుల మీద జోకులు వేసుకుంటున్నారు. ఇంతకీ వైసీపీ నాయకులు ఏం చేశారు. ఉన్నదే 11 మంది ఎమ్మెల్యేలు.. అసెంబ్లీలో వారేం చేశారబ్బా? అని సందేహం వ్యక్తం చేస్తున్నారా? మరెందుకు ఆలస్యం.. వివరాలేంటో కథనంలో చదివేయండి..


ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తరువాత పూర్తిస్థాయి వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు. సోమవారం నాడు అసెంబ్లీ సమావేశాలను ఏర్పాటు చేసిన ప్రభుత్వం.. రాష్ట్ర బడ్జెట్ 2024-25ని ప్రవేశపెట్టింది. ఈ సమావేశాలకు అధికార కూటమికి చెందిన ఎమ్మెల్యేలంతా హాజరయ్యారు. అయితే, 11 మంది సభ్యులున్న వైసీపీ ఎమ్మెల్యేలు మాత్రం శాసనసభకు హాజరవలేదు. వైసీపీ అధినేత, పులివెందుల ఎమ్మెల్యే జగన్.. తనకు విపక్ష నేత హోదా ఇస్తేనే సభలో అడుగుపెడతానంటూ అలిగిన విషయం తెలిసిందే. ఆ కారణంతోనే.. ఆ పార్టీ ఎమ్మెల్యేలంతా శాసనసభకు డుమ్మా కొట్టారు. ఇంత వరకు బాగానే ఉంది. కానీ.. ఇక్కడే ట్విస్ట్ చోటు చేసుకుంది. శాసనసభకు ఎమ్మెల్యేలు బంక్ కొడితే.. శాసనమండలికి మాత్రం ఫుల్‌గా అటెండ్ అయ్యారు ఆ పార్టీ సభ్యులు.


అవును, బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో శాసనమండలికి వైసీపీ ఎమ్మెల్సీలు హాజరయ్యారు. ప్రస్తుతం మండలిలో ప్రతిపక్ష నేతగా మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఉన్నారు. శాసనమండలిలో ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా ఉండటంతోనే.. ఆ పార్టీ సభ్యులు సభకు హాజరయ్యారు. శాసనసభలో ప్రతిపక్ష నేత హోదా లేకపోవడం.. అధికారపక్షం సభ్యులు ఎక్కడ తమను ఆడుకుంటారో అనే భయంతో వైసీపీ ఎమ్మెల్యేలు సభకు హాజరవలేదు. ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ టీడీపీ సభ్యులు వైసీపీపై సెటైర్లు వేస్తున్నారు. ఇదేం వ్యూహం జగనా అంటూ చురకలంటిస్తున్నారు. అసెంబ్లీకి డుమ్మా కొట్టడం.. మండలికి హాజరవడం ఏంటోనంటూ వైసీపీ నేతల తీరుపై జోకులు వేస్తున్నారు.


Also Read:

స్వర్ణాంధ్ర-2047 లక్ష్యంగా దూసుకెళ్తున్నాం: మంత్రి అచ్చెన్న

అలా అనడానికి సిగ్గు లేదా జగన్..

పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హతపై కీలక విచారణ

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - Nov 11 , 2024 | 12:14 PM