AP Politics: మరోసారి విచారణకు రాని వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు.. కారణమిదే!
ABN, Publish Date - Feb 15 , 2024 | 01:03 PM
Andhrapradesh: అనర్హత పిటిషన్లపై ఏపీ అసెంబ్లీ స్పీకర్ వద్ద విచారణకు మరోసారి వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారు. తాము విచారణకు హాజరుకావడం లేదంటూ స్పీకర్ తమ్మినేని సీతారాంకు ఎమ్మెల్యేలు లేఖ రాశారు.
అమరావతి, ఫిబ్రవరి 15: అనర్హత పిటిషన్లపై ఏపీ అసెంబ్లీ స్పీకర్ వద్ద విచారణకు మరోసారి వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు (YCP Rebel MLAs) గైర్హాజరయ్యారు. తాము విచారణకు హాజరుకావడం లేదంటూ స్పీకర్ తమ్మినేని సీతారాంకు (AP Assembly Speaker Tammineni Seetharam) ఎమ్మెల్యేలు లేఖ రాశారు. నేడు విచారణ సందర్భంగా స్పీకర్ తమ్మినేని సీతారాం, చీఫ్ విప్ ప్రసాద్ రాజు ఇప్పటికే ఏపీ అసెంబ్లీ ప్రాంగణానికి చేరుకున్నారు. సమయం గడిచిపోయినప్పటికీ వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు విచారణకు హాజరుకాని పరిస్థితి. అయితే విచారణకు హాజరుకాలేమంటూ స్పీకర్‌కు వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు లేఖ రాశారు.
చీఫ్ విప్ ప్రసాద్ రాజు తమకు వ్యతిరేకంగా సమర్పించిన ఆధారాలు ఇండియన్ ఎవిడెన్స్ ఆక్ట్ ప్రకారం చెల్లవని సమాధానం ఇచ్చారు. ప్రసాద్ రాజు సమర్పించిన వీడియోలు ఒరిజినల్ అని ఆయా సంస్థలు నుండి సర్టిఫై కాపీ లను తెప్పించాలనీ స్పీకర్‌కు వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు లేఖ రాశారు. ఇప్పటికే రెబల్ ఎమ్మెల్యేలు మూడు సార్లు విచారణకు గైర్హాజరైన విషయం తెలిసిందే. ఈరోజు తన ముందు హాజరుకావాలని స్పీకర్ ఆదేశించారు. అయితే తాము విచారణకు హాజరుకావడం లేదంటూ స్పీకర్‌కు వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు లేఖ పంపారు. ఎమ్మెల్యేల లేఖపై స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...
Updated Date - Feb 15 , 2024 | 01:45 PM