ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

YSRCP Social Media: అశోక్ రెడ్డి అరెస్ట్.. రాజమండ్రికి బోరుగడ్డ అనిల్ తరలింపు

ABN, Publish Date - Nov 10 , 2024 | 09:06 PM

వైసీపీ సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టింగ్‌లు పెట్టిన అశోక్ రెడ్డిని మంగళగిరి పోలీసులు ఆదివారం నిజామాబాద్‌లో అరెస్ట్ చేశారు. అనంతరం అతడిని మంగళగిరి తరలించి.. కోర్టులో హాజరుపరిచారు. దీంతో కోర్టు అతడికి 14 రోజుల రిమాండ్ విధించింది.

అమరావతి, నవంబర్ 10: గత జగన్ ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష పార్టీలకు చెందిన పలువురు రాజకీయ ప్రముఖులను లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియా వేదికగా అసభ్యకర పోస్టింగులు పెట్టిన వారి అరెస్టుల పరంపర కొనసాగుతుంది. ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన అశోక్ రెడ్డిని తెలంగాణలోని నిజామాబాద్‌లో ఆదివారం మంగళగిరి పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం అతడిని కోర్టులో హాజరుపరచగా 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో అశోక్‌రెడ్డిని గుంటూరు జిల్లా జైలుకు పోలీసులు తరలించారు.

AP Assembly Sessions: అసెంబ్లీ సమావేశాలు ప్రారంభానికి రంగం సిద్దం

Also Read: Palla Srinivasa Rao: జగన్ ట్వీట్.. అబద్దాల పుట్ట..

Also Read: విమాన ప్రయాణికులకు శుభవార్త..!


రాజమండ్రికి బోరుగడ్డ అనిల్‌ తరలింపు..

మరోవైపు కర్నూలులో వైసీపీ నేత, రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ విచారణ ముగిసింది. ఎక్సైజ్ కోర్టులో న్యాయమూర్తి సరోజనమ్మ ఎదుట అనిల్‌‌ను పోలీసులు హాజరు పరిచారు. అనంతరం న్యాయమూర్తి ఆదేశాలతో బోరుగడ్డ అనిల్‌ను భారీ బందోబస్తు మధ్య రాజమండ్రి సెంట్రల్ జైలుకు పోలీసులు తరలించారు. పీటీ వారెంట్‌పై బోరుగడ్డ అనిల్‌ను గత రెండు రోజులుగా కర్నూలు త్రీ టౌన్ పోలీసులు విచారణ జరిపిన సంగతి తెలిసిందే.

Also Read: PM Modi: జార్ఖండ్‌ను దోచుకున్న సోరెన్ సర్కార్

Also Read: CM Revanth Reddy: పాలమూరుని అభివృద్ధి చేసుకోనివ్వండి

Also Read: జున్ను తినడం వల్ల ఇన్ని లాభాలున్నాయా..?


చంద్రబాబును చంపుతానంటూ బెదిరింపులు..

గతంలో టీడీపీ అధినేత, సీఎం నారా చంద్రబాబు నాయుడుని చంపుతానంటూ బోరుగడ్డ అనిల్ బెదిరించాడు. ఈ నేపథ్యంలో అతడిపై కర్నూలు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్‌లో టీడీపీ శ్రేణులు ఫిర్యాదు చేశాయి. ఈ నేపథ్యంలో బోరుగడ్డ అనిల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. అంతేకాదు.. గతేడాది బీజేపీ సీనియర్ నేత వై సత్యకుమార్.. రాజధాని అమరావతి ప్రాంతంలోని తూళ్లురులో రాజధాని రైతులకు మద్దతు ప్రకటించారు. అనంతరం ఆయన తిరిగి వస్తుండగా.. వైసీపీకి చెందిన వారు దాడి చేశారు. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. దీంతో తూళ్లురు పోలీస్ స్టేషన్‌లో పోలీసులు కేసు నమోదు చేశారు.


వర్రా రవీందర్ రెడ్డి సైతం..

ఇక వైసీపీకి చెందిన సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెట్టిన వర్రా రవీందర్ రెడ్డిని సైతం పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఈ మొత్తం ఎపిసోడ్‌లో వైసీపీ వారు పలువురు వరుసగా అరెస్ట్ కావడంతో.. ఆ పార్టీ నేత, మాజీ సీఎం వైఎస్ జగన్ ఎక్స్ ఖాతా వేదికగా తీవ్రంగా స్పందించారు. ఈ సందర్బంగా చంద్రబాబు ప్రభుత్వం తమ వారిని ఎలా అరెస్ట్ చేస్తుందోనంటూ వైఎస్ జగన్ వివరించారు. అయితే ట్విట్టర్ వేదికగా జగన్ స్పందనపై టీడీపీ అగ్రనేతలు మండిపడుతున్న సంగతి తెలిసిందే.

For Andhrapradesh News And Telugu News

Updated Date - Nov 10 , 2024 | 09:27 PM