ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AP Elections: పోలింగ్ వేళ.. దొంగనాటకానికి తెర తీసిన వైసీపీ

ABN, Publish Date - May 13 , 2024 | 08:15 PM

రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో ఇతర రాష్ట్రాల్లోని ఓటర్లంతా ఆంధ్రప్రదేశ్‌కు పోటెత్తారు. అలా వచ్చిన వారంతా పోలింగ్ కేంద్రాలకు క్యూ కట్టారు.

అమరావతి/హైదరాబాద్, మే 13: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో ఇతర రాష్ట్రాల్లోని ఓటర్లంతా ఆంధ్రప్రదేశ్‌కు పోటెత్తారు. అలా వచ్చిన వారంతా పోలింగ్ కేంద్రాలకు క్యూ కట్టారు. దీంతో తమ అధికారానికి గండి పడుతుందనే ఓ విధమైన ఆందోళన వైసీపీ వర్గాల్లో సుస్పష్టంగా గోచరిస్తుంది. ఆ విషయాన్ని కప్పి పుచ్చి.. ప్రతిపక్ష టీడీపీపై బురద జల్లే కార్యక్రమానికి వైసీపీ శ్రీకారం చుట్టింది.

AP Elections: పోలింగ్ కేంద్రం వద్ద జోగి తనయుడు హల్‌‌చల్


అందులోభాగంగా కొత్త ప్రచారానికి తెర తీసింది. అదీ కూడా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి చానెల్‌లో ప్రచారమైనట్లు ఓ విష ప్రచారం చేస్తుంది. తమ మీడియా ద్వారా చెబితే ప్రజలు నమ్మరనే విషయం.. అధికార పార్టీ నేతలకు బాగా అర్థమైంది. అందుకే ఏబీఎన్ చానెల్ లోగోతోపాటు ఆ మ్యూజిక్‌ను వాడుకొని మరీ అధికార వైసీపీ పైశాచికానందం పొందుతుంది.

LoKSabha Elections: పోలింగ్‌ బహిష్కరించిన పలు గ్రామాల ప్రజలు


మే 13వ తేదీ ఏపీలో పోలింగ్ జరుగుతున్న వేళ.. ఈ ఎన్నికల్లో ఎన్డీయే కూటమికి మద్దతు కరువైందని చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని చోట్ల తెలుగుదేశం పార్టీకి గడ్డు పరిస్థితులు ఏర్పడ్డాయని వెల్లడించింది. దీంతో తన సన్నిహితులతో గెలుపోటములపై చంద్రబాబు చర్చించినట్లు పేర్కొంది. అనంతరం ప్రత్యేక విమానంలో చంద్రబాబు హైదరాబాద్ పయమైయ్యారంటూ వివరించింది.

High Tension in Gannavaram: యార్లగడ్డ వెంకట్రావు‌పై వంశీ అనుచరులు దాడి


ఇక అన్ని నియోజకవర్గాల్లో ఫ్యాన్ గాలీ విస్తుందని.. ఓటర్లంతా జగన్ సంక్షేమం, గ్రామపాలన వైపే మొగ్గు చూసారని స్పష్టం చేసింది. అలాగే మహిళా ఓటర్లంతా ప్యాన్ గుర్తుకే గంపగుత్తగా ఓట్లు వేశారంటూ పక్కా క్లారిటీ ఇచ్చింది.

అయితే జూన్ 4వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఏం ప్రచారం చేసినా.. ఏం విషం చిమ్మినా.. ఇంకా కొద్ది రోజుల్లో ఓటర్లు ఎవరికి పట్టం కట్టారనే విషయం అధికారికంగా సుస్ఫష్టమవుతుందని అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతుంది.

Read Latest National News And Telugu News

Updated Date - May 13 , 2024 | 08:17 PM

Advertising
Advertising