ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Anantapur : టీడీపీ కార్యకర్త దారుణహత్య

ABN, Publish Date - Jun 18 , 2024 | 05:55 AM

అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలోని నందలపాడుకు చెందిన టీడీపీ కార్యకర్త లాల్‌బాషా(23)ను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. డాబాపై నిద్రిస్తున్న అతనిని సోమవారం తెల్లవారుజామున కత్తులతో నరికేశారని డీఎస్పీ జనార్దన్‌నాయుడు తెలిపారు.

అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఘటన

తాడిపత్రి టౌన్‌, జూన్‌ 17: అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలోని నందలపాడుకు చెందిన టీడీపీ కార్యకర్త లాల్‌బాషా(23)ను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. డాబాపై నిద్రిస్తున్న అతనిని సోమవారం తెల్లవారుజామున కత్తులతో నరికేశారని డీఎస్పీ జనార్దన్‌నాయుడు తెలిపారు.

నందలపాడుకు చెందిన లాల్‌బాషా మెకానిక్‌గా పనిచేసుకుంటూ జీవనం సాగించేవాడు. స్నేహితులతో కలిసి ఆదివారం రాత్రి డిన్నర్‌కు వెళ్లొచ్చి డాబాపై నిద్రించాడు. తెల్లవారుజామున గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో విచక్షణారహితంగా దాడిచేయడంతో అక్కడికక్కడే మృతిచెందాడు.

ఉదయం ఎంతసేపటికీ కిందకు దిగిరాకపోవడంతో తల్లిదండ్రులు వెళ్లి చూశారు. రక్తపు మడుగులో ఉన్న కుమారున్ని చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. డీఎస్పీ జనార్దన్‌నాయుడు, సీఐ నాగేంద్రప్రసాద్‌ డాగ్‌స్క్వాడ్‌తో వెళ్లి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. లాల్‌బాషా తల్లిదండ్రులను విచారించి.. కేసు నమోదు చేసుకున్నారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉందని డీఎస్పీ అన్నారు. లాల్‌బాషా పలు కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. ఆ కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Jun 18 , 2024 | 05:55 AM

Advertising
Advertising