ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Veg Orders: దేశంలో వెజ్ ఫుడ్ ఆర్డర్స్ ఎక్కువగా ఇస్తున్న నగరాలివే.. స్విగ్గీ సర్వేలో కీలక విషయాలు

ABN, Publish Date - Jul 31 , 2024 | 09:25 PM

ఆన్‌లైన్ ఫుడ్ సర్వీస్ మొదలైనప్పటి నుంచి రెస్టారెంట్ల నుంచి ఫుడ్ ఆర్డర్(online food orders) చేసే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ క్రమంలోనే ప్రధానంగా ఉద్యోగులు, బ్యాచులర్స్ ఈ సేవలను ఎక్కువగా ఉపయోగించుకుంటున్నారు. అయితే దేశంలో వెజ్ ఆర్డర్లు ఎక్కువగా వచ్చే నగరాల గురించి స్విగ్గీ కీలక విషయాలను తెలిపింది. ఆవేంటో ఇక్కడ తెలుసుకుందాం.

1 out of every 3 vegetarian orders

ఆన్‌లైన్ ఫుడ్ సర్వీస్ మొదలైనప్పటి నుంచి రెస్టారెంట్ల నుంచి ఫుడ్ ఆర్డర్(online food orders) చేసే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ క్రమంలోనే ప్రధానంగా ఉద్యోగులు, బ్యాచులర్స్ ఈ సేవలను ఎక్కువగా ఉపయోగించుకుంటున్నారు. దీంతోపాటు పలు ప్రాంతాల్లో వీకెండ్‍‌లలో కూడా కొన్ని ఫ్యామీలీలు ఆన్‌లైన్ ఫుడ్ ఆర్డర్లకు మొగ్గు చూపుతున్నాయి. అయితే ప్రజలు ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌ల నుంచి అనేక రకాల వంటకాలను ఆర్డర్ చేసినప్పటికీ, గత కొన్ని సంవత్సరాలుగా అనేక మందికి ఇష్టమైన వంటకంగా బిర్యానీ చోటు దక్కించుకుంది. కానీ ఇటివల మాత్రం భోజన ప్రియులు బిర్యానీకి బదులు దోసెను ఇష్టపడుతున్నారని ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ(swiggy) తెలిపింది. తన తాజా ఆర్డర్ విశ్లేషణ ఆధారంగా ఈ విషయాన్ని వెల్లడించింది.


అభిరుచులు మారుతున్నాయ్

ఈ క్రమంలోనే మరికొన్ని కీలక విషయాలను కూడా స్విగ్గీ తెలిపింది. దేశప్రజల అభిరుచులు క్రమంగా మారుతున్నాయని చెప్పింది. ఈ నేపథ్యంలో శాఖాహారం ఆర్డర్లు(veg orders) కూడా క్రమంగా పెరుగుతున్నాయంది. దేశవ్యాప్తంగా అత్యధికంగా ఆర్డర్ చేయబడిన పది వంటకాల్లో ఆరు శాఖాహారం ఉంటున్నాయని వెల్లడించింది. ఆ క్రమంలో 90 శాతం కంటే ఎక్కువ బ్రేక్‌ఫాస్ట్ ఆర్డర్‌లు శాఖాహారంలోనే ఉంటున్నాయని తెలిపింది. వాటిలో ప్రధానంగా మసాలా దోస, వడ, ఇడ్లీ, పొంగల్‌లను ఎక్కువగా ఆర్డర్ చేస్తున్నట్లు తెలిపింది. మార్గరీటా పిజ్జా అత్యంత ప్రజాదరణ పొందిన చిరుతిండిగా పేర్కొంది.


సౌత్ ఇండియా వంటకం

స్విగ్గీ నివేదిక ప్రకారం శాఖాహారంలో కూడా దక్షిణ భారత ఆహారాన్ని(south india food) ప్రజలు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. వీటిలో మసాలా దోస చాలా ఇష్టమైనదని చెప్పింది. ఇది అల్పాహారం, రాత్రి భోజనంలో కూడా చేర్చబడుతుందని తెలిపింది. కొంతమంది పనీర్ బటర్ మసాలా, ప్లెయిన్ దోసలను కూడా ఆర్డర్ చేస్తున్నారని పేర్కొంది. ఇది కాకుండా మార్గరీటా పిజ్జా, పావ్ భాజీ కూడా ఇష్టమైన ఎంపికలుగా ఉన్నాయని వెల్లడించింది.

ఇవి కూడా చదవండి:

Layoffs: మరో అగ్రసంస్థలో ఉద్యోగుల తొలగింపులు.. హైదరాబాద్‌, బెంగళూరులో కూడా..?


ఈ నగరమే టాప్

ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా(over all india) బెంగళూరు నుంచి శాఖాహార ఆహారం కోసం అత్యధిక ఆర్డర్లు వస్తున్నట్లు స్విగ్గీ తెలిపింది. ప్రతి మూడు శాఖాహార ఆర్డర్‌లలో దాదాపు ఒకటి బెంగళూరు(Bangalore) నుంచి ఉంటుందని చెప్పింది. మసాలా దోస, పనీర్ బిర్యానీ, పనీర్ బటర్ మసాలా ఇక్కడి స్థానిక ప్రజల మొదటి ఛాయిస్ అని గుర్తు చేసింది. ముంబైలో, దాల్ ఖిచ్డీ, మార్గరీటా పిజ్జా, పావ్ భాజీ ఎక్కువగా ఉన్నాయంది. మరోవైపు హైదరాబాద్ ప్రజలు మసాలా దోసె, ఇడ్లీలను ఎక్కువగా ఇష్టపడతారని ప్రస్తావించింది. ఇలాంటి పరిస్థితుల్లో శాఖాహార ఆహారానికి డిమాండ్ ఎక్కువగా ఉన్న మొదటి మూడు నగరాల్లో బెంగళూరు, హైదరాబాద్(hyderabad), ముంబై(mumbai) ఉన్నాయని స్పష్టం చేసింది.


ఇవి కూడా చదవండి:

No Tax: దేశంలో ఈ రాష్ట్ర వాసులకు నో ట్యాక్స్.. కారణమిదే..


Saving Scheme: రోజూ ఇలా రూ.200 సేవ్ చేయండి.. రూ.28 లక్షలు పొందండి..


ITR Filling: ఐటీఆర్ దాఖలుకు నేడే లాస్ట్ ఛాన్స్.. గడువు పెంచుతారా, క్లారిటీ

Read More Business News and Latest Telugu News

Updated Date - Jul 31 , 2024 | 09:29 PM

Advertising
Advertising
<