Fine: యాక్సిస్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీకి గట్టి షాక్ ఇచ్చిన ఆర్బీఐ
ABN, Publish Date - Sep 11 , 2024 | 08:04 AM
దేశంలో ప్రముఖ ప్రైవేటు బ్యాంకులైన యాక్సిస్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీలపై RBI కొరడా ఝులిపించింది. ఈ నేపథ్యంలో యాక్సిస్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లపై ఆర్‌బీఐ రూ.2.91 కోట్ల జరిమానా విధించింది. అయితే ఆర్బీఐ ఎందుకు చర్యలు తీసుకుందనే విషయాన్ని ఇప్పుడు చుద్దాం.
వినియోగదారులకు సేవల విషయంలో ఎవరు తప్పు చేసినా వదిలేది లేదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) చెప్పకనే చెబుతోంది. ఈ క్రమంలోనే దేశంలో ప్రముఖ ప్రైవేటు బ్యాంకులైన యాక్సిస్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీలపై RBI కొరడా ఝులిపించింది. ఈ నేపథ్యంలో యాక్సిస్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లపై ఆర్‌బీఐ రూ.2.91 కోట్ల జరిమానా విధించింది. ఇందులో యాక్సిస్ బ్యాంక్‌పై రూ.1.91 కోట్లు, హెచ్‌డీఎఫ్‌సీపై రూ.1 కోటి జరిమానా విధించారు. ఈ రెండు బ్యాంకులు వినియోగదారుల సేవలైన కేవైసీ, డిపాజిట్లపై వడ్డీ రేట్లు, వ్యవసాయ సంబంధిత రుణాల హామీ వంటి విషయాల్లో నిబంధనలను పాటించలేదని ఆర్‌బీఐ చర్యలు తీసుకుంది.
ప్రభావం ఉండదు
అయితే డిపాజిట్‌లపై వడ్డీ రేట్లు, బ్యాంకుల్లో రికవరీ ఏజెంట్లు, బ్యాంకుల్లో కస్టమర్ సేవలపై పలు సూచనలను పాటించనందుకు HDFC బ్యాంక్‌కు కోటి రూపాయల జరిమానా విధించినట్లు మరో ప్రకటనలో తెలిపింది. ఈ జరిమానాలు చట్టబద్ధమైన, నియంత్రణ సమ్మతిలో లోపాలకు సంబంధించినవని వెల్లడించింది. ఈ క్రమంలో బ్యాంకులు తమ ఖాతాదారులతో కుదుర్చుకున్న లావాదేవీలు లేదా ఒప్పందాల చెల్లుబాటుకు ఎలాంటి ప్రభావితం చేయవని కూడా RBI స్పష్టం చేసింది.
ఫిర్యాదు
ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం బ్యాంకులు రుణ సేకరణ విషయంలో ఖాతాదారులతో గౌరవం పాటించాలి. అంతేకానీ వసూళ్ల ముసుగులో మితిమీరిన బలవంతపు చర్యలు లేదా వేధింపులకు గురిచేసే సంభాషణ చేయకూడదు. రికవరీ ఏజెంట్లు తప్పనిసరిగా మార్గదర్శకాలు పాటించాలి. ఒకవేళ వారు పాటించని యెడల కస్టమర్లు RBIకి ఫిర్యాదు చేయవచ్చు. అలా చేస్తే ఆయా బ్యాంకులపై ఆర్బీఐ చర్యలు తీసుకుంటుంది. గతంలో కూడా లోన్స్ తీసుకున్న పలువురు కస్టమర్లు సమయానికి రుణం చెల్లించని క్రమంలో కొంత మంది బ్యాంకు రికవరీ ఏజెంట్లు కస్టమర్లతో అసభ్యంగా మాట్లాడిన సంఘటనలు వెలుగులోకి రావడం చుశాం. ఇలాంటి వాటికి కూడా ఫిర్యాదు చేయవచ్చు.
డిపాజిట్ల కంటే
బ్యాంకులు ఇచ్చే రుణాల వృద్ధి రేటు డిపాజిట్ల వృద్ధి కంటే ఎక్కువగా ఉంటే భవిష్యత్తులో బ్యాంకింగ్ వ్యవస్థ లిక్విడిటీ సవాళ్లను ఎదుర్కోవచ్చు. ఇండస్ట్రీ బాడీ FICCI, ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (IBA) సంయుక్త నివేదిక ప్రకారం డిపాజిట్లను పెంచడం, క్రెడిట్ ఖర్చులను తక్కువగా ఉంచడం అనేది బ్యాంకుల ఎజెండాలో అగ్రస్థానంలో ఉంది. నివేదిక ప్రకారం ప్రస్తుత రౌండ్‌లో మొత్తం డిపాజిట్లలో కరెంట్ అకౌంట్, సేవింగ్స్ అకౌంట్ డిపాజిట్ల వాటా తగ్గిందని 67 శాతం బ్యాంకులు తెలిపాయి.
ఇవి కూడా చదవండి
TRAI: కోటికిపైగా ఫేక్ మొబైల్ కనెక్షన్‌లు తొలగింపు.. కారణమిదే..
Personal Loans: లోన్ యాప్స్ నుంచి రుణం తీసుకుంటున్నారా.. ఈ 4 తప్పులు అస్సలు చేయోద్దు
Swiggy IPO: త్వరలో స్విగ్గీ ఐపీఓ.. ఎన్ని కోట్ల షేర్లు, ఎప్పటి నుంచంటే..
Read MoreBusiness News and Latest Telugu News
Updated Date - Sep 11 , 2024 | 08:48 AM