Fixed Deposit: ఫిక్స్‌డ్ డిపాజిట్‌పై అధిక వడ్డీ ఇస్తున్న 3 ప్రధాన బ్యాంకులివే..
ABN, Publish Date - Oct 05 , 2024 | 03:06 PM
మీరు సురక్షితమైన పెట్టుబడుల కోసం చూస్తున్నారా. అయితే మీకు గుడ్ న్యూస్. ఎందుకంటే మూడు ప్రధాన బ్యాంకులు అత్యధిక FD వడ్డీ రేట్లను అందిస్తున్నాయి. ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
సురక్షితమైన పెట్టుబడికి ఫిక్స్‌డ్ డిపాజిట్(fixed deposit) బెస్ట్ అని చెప్పవచ్చు. ఎందుకంటే దీనిలో ఎలాంటి రిస్క్ ఉండదు. ప్రతి నెల చేసిన పెట్టుబడికి వడ్డీ రూపంలో ఎంతో కొంత జమ అవుతూనే ఉంటుంది. ఈ పెట్టుబడులకు బ్యాంకులు లేదా ఫైనాన్స్ సంస్థలు కూడా 100 శాతం హామీ ఇస్తాయి. ఈ కారణంగా చాలా మంది భారతీయులు వీటిలో పెట్టుబడులు చేసేందుకు ఇష్టపడుతున్నారు. అయితే ఇటివల కొన్ని ప్రభుత్వ బ్యాంకులు ఎఫ్‌డీ వడ్డీ రేట్లను సవరించాయి. ఈ సవరణతో వార్షిక వడ్డీ రేటు దాదాపు 8 శాతానికి పెరిగింది. ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
మీరు అధిక వడ్డీ రేటు FDల కోసం చూస్తున్నట్లయితే ఓసారి ఈ రేట్లను పరిశీలించండి మరి. వీటిలో మూడు కీలక బ్యాంకులైన బ్యాంక్ ఆఫ్ బరోడా, SBI, పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఉన్నాయి. మీరు ఎటువంటి ఆర్థిక రిస్క్ లేకుండా పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తున్నట్లయితే మీరు ప్రత్యేక ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీంలను ఎంపిక చేసుకోవడం బెస్ట్ అని చెప్పవచ్చు.
బ్యాంక్ ఆఫ్ బరోడా ఫిక్స్‌డ్ డిపాజిట్ రేట్లు
బ్యాంక్ ఆఫ్ బరోడా దేశంలోని అతిపెద్ద బ్యాంకుల్లో ఒకటి. ఈ బ్యాంక్ ఇటీవల తన ప్రత్యేక మాన్‌సూన్ ధమాకా FD పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకంలో 333 రోజుల FDపై 7.50 శాతం వరకు వడ్డీ లభిస్తుంది. అదే సమయంలో BOB సాధారణ కస్టమర్లకు 360 రోజుల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 7.10 శాతం వరకు వడ్డీని ఇస్తున్నారు. సీనియర్ సిటిజన్లకు అయితే 7.60 శాతం వరకు వడ్డీ ఇవ్వనున్నారు.
SBI అమృత్ వృష్టి పథకం
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. దేశంలోని అతిపెద్ద, అత్యంత విశ్వసనీయ ప్రభుత్వ బ్యాంకు. దీనిలో వివిధ రోజుల FDలపై ప్రత్యేక వడ్డీ రేట్లను అందిస్తున్నారు. వీటిలో మీరు 444 రోజుల FD చేయాలనుకుంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అమృత్ వృష్టి పథకంలో మీకు 7.75 శాతం వరకు వడ్డీ రేటు లభిస్తుంది.
పంజాబ్ నేషనల్ బ్యాంక్ FD రేట్లు
ఇక పంజాబ్ నేషనల్ బ్యాంక్ ప్రస్తుతం 3.50 నుంచి 7.25 శాతం వరకు వడ్డీ రేట్లను అందిస్తుంది. ఈ క్రమంలో మీరు 7 రోజుల నుంచి 10 సంవత్సరాల వరకు FDలను డిపాజిట్ చేసుకోవచ్చు. ఈ క్రమంలో 400 రోజుల FDలో సీనియర్ సిటిజన్లు అయితే 4.30% నుంచి 8.05% వరకు వడ్డీని పొందుతారు.
ఇవి కూడా చదవండి:
IRCTC: నవరాత్రుల సందర్భంగా స్పెషల్ టూర్ ప్యాకేజీ.. తక్కువ ధరల్లో సందర్శించండి
Online Shopping Tips: పండుగల సీజన్‌లో ఆన్‌లైన్ షాపింగ్ చేస్తున్నారా.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి
SIP Investment: చిరు ఉద్యోగస్తులకు గుడ్ న్యూస్.. రూ.99 నుంచే మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు
IRCTC: పండుగల సందర్భంగా స్పెషల్ టూర్ ప్యాకేజీ.. తక్కువ ధరకే ప్రసిద్ధ ఆలయాల సందర్శన
Read More Business News and Latest Telugu News
Updated Date - Oct 05 , 2024 | 03:08 PM