ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

BSNL: జియో, ఎయిర్‌టెల్‌ కట్టడికి బీఎస్ఎన్ఎల్ పెద్ద ప్లాన్.. టాటా సపోర్ట్‌తో ఇక..

ABN, Publish Date - Sep 04 , 2024 | 09:48 PM

మీరు రిలయన్స్ జియో లేదా ఎయిర్‌టెల్ నుంచి BSNLకి మారాలని చుస్తున్నారా. అయితే మీకు గుడ్ న్యూస్. ఎందుకంటే BSNL 4G నెట్‌వర్క్‌ మరింత వేగంగా విస్తరించడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. అందుకోసం అగ్రసంస్థ టాటా కూడా సహరించడం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.

4G network BSNL

మీరు కూడా ఎయిర్ టెల్, జియో వంటి నెట్‌వర్క్‌ల రేట్లతో విసిగిపోయి పోన్నారా. అయితే మీకు గుడ్ న్యూస్. ఈ నెట్‌వర్క్‌ల కట్టడి కోసం బీఎస్ఎన్ఎల్ పెద్ద ప్లాన్ వేసింది. ఇకపై మరికొన్ని రోజుల్లో BSNLకి పోర్ట్ అవ్వాలనుకుంటే ఎంచక్కా మారొచ్చు. ఎందుకంటే BSNL ఇకపై దేశవ్యాప్తంగా 4G నెట్‌వర్క్ విస్తరణపై ఎక్కువగా దృష్టి సారిస్తోంది. ఈ క్రమంలో డిసెంబరు నాటికే దేశవ్యాప్తంగా 75000 బీఎస్‌ఎల్‌ఎల్‌ టవర్‌లను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు. ముందు వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తి చేయాలనుకున్నారు. కానీ ఇప్పుడు ఈ ప్రక్రియను మరింత వేగవంతం చేశారు.


మరికొన్ని రోజుల్లో కేబినెట్‌

ఈ క్రమంలో 4G నెట్‌వర్క్‌ను వేగవంతం చేసేందుకు BSNLకి అదనంగా రూ. 6,000 కోట్లు కేటాయించాలని కేంద్రం యోచిస్తోంది. BSNL 4G నెట్‌వర్క్ కవరేజీ తక్కువగా ఉన్న క్రమంలో కంపెనీ తన కస్టమర్ బేస్‌లో భారీ నష్టాన్ని ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో చర్యలను వేగవంతం చేశారు. 4G నెట్‌వర్క్‌ను వేగవంతం చేయడానికి, కాపెక్స్‌లో తగ్గింపును తీర్చడానికి డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (DoT) మూలధన పెట్టుబడి ప్రణాళికను సిద్ధం చేస్తోంది. స్థానికంగా అభివృద్ధి చేసిన స్టాక్ ద్వారా దీని రోల్ అవుట్ జరుగుతోందని సంబంధిత అధికారులు చెబుతున్నారు. ఇందుకోసం త్వరలో డీఓటీ కేబినెట్‌ను సంప్రదిస్తుందని అధికారులు తెలిపారు.


పర్చేస్ ఆర్డర్

ఈ నేపథ్యంలో 4G సేవలో వెనుకబడి ఉన్నందున BSNL వినియోగదారులను పెంచుకునేందుకు సిద్ధమవుతోంది. BSNL ప్లాన్ బహిర్గతం అయిన తర్వాత BSNL యూజర్ బేస్ పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు. గతేడాది లక్ష 4జీ సైట్‌ల రోల్‌అవుట్ కోసం రూ.19,000 కోట్ల అడ్వాన్స్ పర్చేస్ ఆర్డర్ ఇచ్చారు. అయితే నెట్‌వర్క్ విస్తరణకు సంబంధించిన వాస్తవ కొనుగోలు ఆర్డర్‌ను TCS, ప్రభుత్వ రంగ టెలికాం పరికరాల తయారీ సంస్థకు ఇచ్చింది. వాటి విలువ దాదాపు 13,000 కోట్ల రూపాయలు. మిగిలిన మొత్తం కూడా రూ.6000 కోట్లకుపైగా ఉంటుందని ఓ అధికారి తెలిపారు. 2019 నుంచి 4G సేవలను ప్రారంభించడంతో సహా మూడు పునరుద్ధరణ ప్యాకేజీలలో భాగంగా ప్రభుత్వం BSNL, MTNLలో సుమారు రూ. 3.22 లక్షల కోట్లు పెట్టుబడి పెట్టింది.


త్వరలోనే..

ప్రభుత్వం ప్రకారం ఈ ప్యాకేజీల తర్వాత BSNL-MTNL 2021 ఆర్థిక సంవత్సరం నుంచి నిర్వహణ లాభాలను ఆర్జించడం ప్రారంభించింది. ప్రైవేట్ ఆపరేటర్లతో పోలిస్తే BSNL 22,000 బేస్ స్టేషన్ల ద్వారా చాలా తక్కువ మంది వినియోగదారులకు 4G అందించగలిగింది. 2024 దీపావళి, 2025 మధ్యకాలంలో లక్ష బేస్ సైట్ల నుంచి 4G రోల్ అవుట్ లక్ష్యం పూర్తవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఇక TRAI డేటా ప్రకారం BSNL మార్కెట్ వాటా డిసెంబర్ 2020లో 10.72% నుంచి జూన్ 2024 నాటికి 7.33%కి తగ్గింది. ఈ కాలంలో జియో మార్కెట్ వాటా 35.06% నుంచి 40.71%కి పెరిగింది. రెండో స్థానంలో ఉన్న భారతీ ఎయిర్‌టెల్ వాటా 29.24% నుంచి 33.23%కి పెరిగింది. కానీ BSNL సేవలు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే అనేక మంది యూజర్లు దీనివైపే మొగ్గు చూపే ఛాన్స్ ఉంది.


ఇవి కూడా చదవండి:

Property Alert: భూమి కొనుగోలు చేస్తున్నారా.. ఈ డాక్యుమెంట్ల తనిఖీ తప్పనిసరి..


Money Saving Tips: రోజు రూ.250 సేవ్ చేయండి.. ఇలా రూ.2 కోట్లు సంపాదించండి..


Money Savings: ఈ FDలలో పెట్టుబడి పెట్టేందుకు కొన్ని రోజులే ఛాన్స్.. 8% వరకు వడ్డీ రేటు


Read More Business News and Latest Telugu News

Updated Date - Sep 04 , 2024 | 09:49 PM

Advertising
Advertising