Rolls Royce: రూ. 13 లక్షలకే 9 కోట్ల రోల్స్ రాయిస్ కార్.. ఎలాగంటే..
ABN, Publish Date - Dec 02 , 2024 | 12:02 PM
మీరు విలాసవంతమైన రోల్స్ రాయిస్ కార్‌ను తక్కువ మొత్తంతో కొనుగోలు చేయాలని చూస్తున్నారా. అయితే ఈ వార్త మీ కోసమే. దీనిని తక్కువ రేటుతో కొనుగోలు చేయడం ఎలా అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
రోల్స్ రాయిస్ (Rolls Royce) కార్లు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. అంబానీ కుటుంబం నుంచి బాలీవుడ్ ప్రముఖుల వరకు భారతదేశంలోని చాలా మంది ధనవంతులు ఈ కారును (car) కలిగి ఉన్నారు. అయితే మీరు కూడా ఈ కారును కొనుగోలు చేయాలని చూస్తున్నారా. అయితే ఈ వార్త మీ కోసమే. ఎందుకంటే దీనిని మీరు తక్కువ మొత్తంతో కూడా కొనుగోలు చేయవచ్చు. 9 కోట్ల రూపాయల విలువైన రోల్స్ రాయిస్ ఫాంటమ్ కారును తక్కువ మొత్తంతో కొనుగోలు చేయడం ఎలా అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
డౌన్ పేమెంట్
ఈ కంపెనీకి చెందిన కార్ల ధర చాలా ఎక్కువగా ఉండటంతో అందరూ ఈ కార్లను కొనుగోలు చేయలేరు. అయితే ఇది కాకుండా మీరు బ్యాంక్ నుంచి రుణం తీసుకోవడం ద్వారా రోల్స్ రాయిస్‌ను కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఈ కంపెనీకి చెందిన నాలుగు కార్లు రోల్స్ రాయిస్ కల్లినాన్, ఫాంటమ్, ఘోస్ట్, స్పెక్టర్ భారత మార్కెట్‌లో అమ్ముడవుతున్నాయి. మీరు Rolls-Royce కారును కొనుగోలు చేయాలనుకుంటున్నట్లయితే, దీని ఫాంటమ్ వేరియంట్ డౌన్ పేమెంట్, EMI వివరాల గురించి ఇక్కడ చుద్దాం.
ఢిల్లీలో రోల్స్ రాయిస్ ఫాంటమ్ ఎక్స్ షోరూమ్ ధర రూ.8 కోట్ల 99 లక్షలు. దీని టాప్ వేరియంట్ గురించి మాట్లాడినట్లయితే, ఇది రూ. 10.48 కోట్ల వరకు ఉంది. మీరు ఈ కారును లోన్‌పై కొనుగోలు చేయాలనుకుంటే, ఆన్-రోడ్ ధర రూ. 10.32 కోట్లుగా ఉంటుంది. ఎందుకంటే ఇందులో RTO, బీమా సహా ఇతర ఛార్జీలు ఉంటాయి.
ప్రతి నెలా
రోల్స్ రాయిస్ ఫాంటమ్ కొనుగోలు చేయడానికి, మీరు పూర్తి మొత్తాన్ని చెల్లించకుండానే ఎక్కడినుంచైనా మీరు లోన్ పొందవచ్చు. దీని డౌన్ పేమెంట్ కోసం 7 ఏళ్లపాటు 9.8 శాతం వడ్డీ రేటుతో రుణం తీసుకోవచ్చు. ఆ విధంగా మీరు బ్యాంకు నుంచి రూ.8.32 కోట్ల రుణం తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో మీరు ప్రతి నెలా మీ EMI రూ. 13.74 లక్షలు చెల్లిస్తే కారు మీ సొంతం అవుతుంది. కారును రుణంపై కొనుగోలు చేసిన తర్వాత మీరు రూ. 3.21 కోట్ల వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. ఈ విధంగా మీరు చెల్లించే మొత్తం రూ.11.54 కోట్లు అవుతుంది.
రోల్స్ రాయిస్ ఫీచర్లు
ఇన్ఫోటైన్‌మెంట్ యూనిట్, ఫ్రంట్ వెంటిలేటెడ్ సీట్లు, ఫ్రంట్ మసాజ్ సీట్లు, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్ వంటి ఫీచర్లు రోల్స్ రాయిస్ ఫాంటమ్‌లో అందుబాటులో ఉన్నాయి. పవర్‌ట్రెయిన్ గురించి మాట్లాడితే ఇందులో 6.75 లీటర్ ట్విన్ టర్బో V12 ఇంజన్ ఉంది. ఇది 570 PS శక్తిని, 900 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇక సేఫ్టీ ఫీచర్ల గురించి చెప్పాలంటే చైల్డ్ సేఫ్టీ లాక్, కీ లెస్ ఎంట్రీ, ఎయిర్‌బ్యాగ్, ABS, రియర్ పార్కింగ్ సెన్సార్, రియర్ పార్కింగ్ కెమెరా, USB సపోర్ట్ వంటి అనేక ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి.
ఇవి కూడా చదవండి:
Personal Finance: మీ అప్పులను ఈ 7 మార్గాల ద్వారా ఈజీగా తీర్చుకోండి..
Recharge Plans: 5 నెలల చౌక ప్లాన్ ప్రకటించిన BSNL.. మిగతా వాటితో పోలిస్తే ధర..
Bank Holidays: ఈ నెలలో 17 రోజులు బ్యాంకులు క్లోజ్.. ఎప్పుడెప్పుడంటే..
Personal Finance: నెలకు రూ. 5 వేలు సేవ్ చేస్తే.. రూ. 2 కోట్ల కోసం ఎన్నేళ్లు కట్టాలి..
Read More National News and Latest Telugu News
Updated Date - Dec 02 , 2024 | 12:04 PM