Jobs: వచ్చే 10 ఏళ్ల తర్వాత ఈ ఉద్యోగాలుండవు.. లింక్డ్‌ఇన్ సహ వ్యవస్థాపకుడి అంచనా
ABN, Publish Date - Jul 26 , 2024 | 01:45 PM
ఇటివల వచ్చిన AI పుణ్యామా అని అనేక కంపెనీల్లో ఉద్యోగులను(jobs) తొలగించారు. ఈ క్రమంలో సాఫ్ట్ వేర్ సంస్థల పని సంస్కృతిలో కూడా చాలా మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఏఐని పలు రకాల పనులకు ఉపయోగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వచ్చే 10 ఏళ్లలో పలు రకాల ఉద్యోగాలు కనుమరుగయ్యే అవకాశం ఉందని లింక్డ్‌ఇన్(LinkedIn) సహ వ్యవస్థాపకులు రీడ్ హాఫ్‌మన్(reid Hoffman) అంచనా వేశారు.
ఇటీవల వచ్చిన ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ) పుణ్యామా అని అనేక కంపెనీల్లో అనేక మంది ఉద్యోగాలు కోల్పోయారు. ఈ క్రమంలో సాఫ్ట్‌వేర్ సంస్థల పని సంస్కృతిలో కూడా చాలా మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఏఐని పలు రకాల పనులకు ఉపయోగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వచ్చే 10 ఏళ్లలో పలు రకాల ఉద్యోగాలు కనుమరుగయ్యే అవకాశం ఉందని లింక్డ్‌ఇన్ (LinkedIn) సహ వ్యవస్థాపకులు రీడ్ హాఫ్‌మన్ (Reid Hoffman) అంచనా వేశారు. అయితే రీడ్ గతంలో చెప్పిన అంచనాలు నిజమవ్వడంతో ఇప్పుడు ఆయన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. ఇది వరకు సోషల్ మీడియా ప్రాధాన్యత పెరుగుతుందని, గీగ్ ఎకానామీకి డిమాండ్ ఉంటుందని కొన్నేళ్ల క్రితమే రీడ్ హాఫ్‌మన్ అంచనా వేశారు.
పనిభారం తగ్గింపు
ఇక తాజాగా వచ్చే పదేళ్లలో 9 టూ 5 ఉద్యోగాలు(jobs) కనుమరుగయ్యే ప్రభావం ఉందని లింక్డ్‌ఇన్ సహ వ్యవస్థాపకులు రీడ్ హాఫ్‌మన్ అన్నారు. 2034 నాటికి AI మానవ జీవితాన్ని మరింత సులభతరం చేస్తుందని ఆయన చెప్పారు. ఆ క్రమంలో వర్క్‌ఫోర్స్ విధానంలో చాలా మార్పులు వస్తాయన్నారు. AI ఉపయోగంతో మానవులకు పనిభారం తగ్గవచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇలాంటి సమయంలో మరింత సృజనాత్మకతపై దృష్టి పెట్టాలన్నారు. వాటిలో ప్రధానంగా AI పద్ధతులు, మెషిన్ లెర్నింగ్, డేటా అనలిటిక్స్, ఆటోమేషన్ వంటి అనేక అంశాలను నేర్చుకుని మానవ వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవాలన్నారు. అలా చేయడం ద్వారా ఒకే సమయంలో అనేక చోట్ల పని చేసుకునే వెసులుబాటు వస్తుందన్నారు. ఇదే సమయంలో డేటా గోప్యత వంటి సమస్యలు కూడా ఆందోళన కలిగించే అవకాశం ఉందన్నారు.
27 ఏళ్ల క్రితమే
హాఫ్‌మన్ 1997లో సోషల్ మీడియా(social media), షేరింగ్ ఎకానమీ, AI విప్లవం పెరుగుదలను కూడా అంచనా వేశారు. ఆ సమయంలో చాట్‌జీపీటీ జాడ కూడా లేదు. దాదాపు రెండున్నర దశాబ్దాల తర్వాత ఆయన అంచనా తర్వాత ChatGPT ప్రవేశించింది. ఈ క్రమంలోనే AI అభివృద్ధి కొంత భయానకంగా అలాగే ఆశ్చర్యకరంగా ఉందన్నారు హాఫ్‌మన్. ChatGPT ప్రారంభించినప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా వేలాది ఉద్యోగాలు కోల్పోయాయని గుర్తు చేశారు. చాలా కంపెనీలు తమ ఉద్యోగులకు ఏఐ టెక్నాలజీలో శిక్షణ ఇస్తున్నాయి.
అయినప్పటికీ ఉద్యోగ కార్మికులకు AI ఎంత పెద్ద ముప్పు అనే దానిపై అనేక చర్చలు, వాదనలు జరుగుతున్నాయి. ఇది మనుషుల సంభాషణలను విని మనిషిలా స్పందించగలదు. ఇది చాలా మంచి పరిణామం. ఎందుకంటే మానవులు, AI రోబోట్‌ల మధ్య ఉన్న ఈ కనెక్షన్ ఒంటరితనాన్ని తొలగించడంలో చాలా సహాయకారిగా ఉంటాయి. రాబోయే రోజుల్లో ఏఐ వినియోగం రెస్టారెంట్లు, హాస్పిటాలిటీ సహా అనేక రంగాల్లో ఉంటుందని హాఫ్‌మన్ అన్నారు. ఇటీవల ఇచ్చిన ఓ పాడ్ క్యాస్ట్ ఇంటర్వ్యూలో ఈ విషయాలను ఆయన వెల్లడించారు.
ఇవి కూడా చదవండి:
Saving Schemes: ఈ పోస్టాఫీస్ స్కీం ద్వారా ఐదేళ్లలో లక్షాధికారులు కావచ్చు..ఎలాగంటే
Stock Markets: భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు.. టాప్ 5 లాభాల స్టాక్స్!
Gold and Silver Rates Today: మళ్లీ తగ్గిన బంగారం, వెండి ధరలు.. కొనుగోళ్ల కోసం క్యూ కడుతున్న జనాలు
Bank Holidays: ఆగస్టులో దాదాపు సగం రోజులు బ్యాంకులు బంద్.. కారణాలివే
Read More Business News and Latest Telugu News
Updated Date - Jul 26 , 2024 | 01:56 PM