Budget 2024-25: బడ్జెట్ 2024-25లో చంద్రబాబు, నితీష్‌లకు లక్ష కోట్ల ప్యాకేజీ?
ABN, Publish Date - Jul 07 , 2024 | 01:20 PM
కేంద్ర బడ్జెట్ 2024-25ను జూలై 23న సమర్పించనున్నారు. అయితే ఈ బడ్జెట్లో పలు ప్రాజెక్టుల కోసం కేంద్రం నుంచి చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu), నితీష్ కుమార్(Nitish Kumar) లక్షకోట్లకుపైగా అడిగినట్లు తెలుస్తోంది.
కేంద్ర బడ్జెట్ 2024-25ను జూలై 23న సమర్పించనున్నారు. అయితే ఈ బడ్జెట్లో పలు ప్రాజెక్టుల కోసం కేంద్రం నుంచి చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu), నితీష్ కుమార్(Nitish Kumar) లక్షకోట్లకుపైగా అడిగినట్లు తెలుస్తోంది. ఇది కాకుండా మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు రుణ పరిమితిని కూడా పెంచాలని కోరారని తెలిసింది. ఈ క్రమంలో చంద్రబాబు నాయుడు ఒక్కరే లక్ష కోట్ల రూపాయల (12 బిలియన్ డాలర్లు) ఆర్థిక సహాయం కోరినట్లు బ్లూమ్‌బెర్గ్ నివేదిక ఇటివల తెలిపింది. టీడీపీ అధినేత ఇటివల ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిశారు. ఆ క్రమంలో ఆయన డిమాండ్ల కోసం ఒత్తిడి తెచ్చినట్లు తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి, పోలవరం నీటిపారుదల ప్రాజెక్టు అభివృద్ధి, విజయవాడ, విశాఖపట్నం, అమరావతిలో మెట్రో ప్రాజెక్టులు, లైట్ రైల్ ప్రాజెక్ట్, విజయవాడ నుంచి ముంబై, న్యూఢిల్లీకి వందే భారత్ రైలు కోసం నాయుడు నిధులు కోరినట్లు తెలిసింది. దీంతో పాటు వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి, రామాయపట్నం పోర్టు, ఇన్‌ఫ్రా ఉత్పత్తులు, కడపలో ఉక్కు కర్మాగారానికి ఆర్థిక సహకారం అందించాలని కోరారు. మరోవైపు బీహార్లో 9 కొత్త విమానాశ్రయాలు, రెండు పవర్ ప్రాజెక్టులు, రెండు నదీ జలాల కార్యక్రమాలు, ఏడు వైద్య కళాశాలలను తెరిచేందుకు నిధులను నితీష్ కోరినట్లు తెలిసింది.
ఇటివల లోక్‌సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ 240 సీట్లు సాధించింది. మెజారిటీ 272 సీట్లకు తగ్గింది. ఆ క్రమంలో ప్రధాన మిత్రులైన చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్‌ల సహకారంతో ఎన్‌డీఏ ప్రభుత్వం ఏర్పడింది. జూన్ 4న ఫలితాలు ప్రకటించిన లోక్‌సభ ఎన్నికల్లో నాయుడు తెలుగుదేశం పార్టీ, నితీష్ కుమార్‌కి చెందిన జనతాదళ్ (యునైటెడ్) 28 స్థానాలను గెలుచుకున్నాయి. ఈ నేపథ్యంలో కీలకంగా మారిన చంద్రబాబు, నితీష్ ప్రత్యేక ప్యాకేజీ డిమాండ్ చేశారని అంటున్నారు. అయితే వీరి డిమాండ్ మేరకు కేంద్రం ఆ నిధులను ఇస్తుందని పలువురు చెబుతుండగా, మరికొంత మంది మాత్రం ఇచ్చే అవకాశం లేదంటున్నారు.
ఇది కూడా చదవండి:
Upcoming IPOs: మళ్లీ వచ్చిన ఐపీఓల వారం.. వచ్చే వారం రానున్నవివే..
Tomato: భగ్గుమంటున్న టమాటా ధర.. కిలోకు రూ.130, ఎక్కడంటే..
For Latest News and Business News click here
Updated Date - Jul 07 , 2024 | 01:23 PM