Adani Group: టైమ్ వరల్డ్స్ బెస్ట్ 2024 కంపెనీల జాబితాలో అదానీ గ్రూప్‌ రికార్డ్

ABN, Publish Date - Sep 14 , 2024 | 10:33 AM

దేశంలో ప్రముఖ సంస్థలైన అదానీ గ్రూప్, ఇన్ఫోసిస్‌తో సహా పలు భారతీయ కంపెనీలు సంచలనం సృష్టించాయి. ప్రపంచంలోని అత్యుత్తమ సంస్థల జాబితాలో పేరు దక్కించుకున్నాయి. TIME ప్రపంచంలోని అత్యుత్తమ కంపెనీల జాబితాలో వీటితోపాటు పలు కంపెనీలకు చోటు దక్కింది.

Adani Group: టైమ్ వరల్డ్స్ బెస్ట్ 2024 కంపెనీల జాబితాలో అదానీ గ్రూప్‌ రికార్డ్
Adani Group

ప్రముఖ మ్యాగజైన్ TIME ప్రపంచంలోని అత్యుత్తమ కంపెనీల 2024 జాబితాలో అదానీ గ్రూప్‌(Adani Group) అదరగొట్టింది. ఈ జాబితాలో అదానీ గ్రూప్‌లోని 11 లిస్టెడ్ కంపెనీలలో 8 నేరుగా ఈ జాబితాలో చోటు దక్కించుకున్నాయి. మిగిలిన 3 కంపెనీలు వాటి అనుబంధ సంస్థలుగా ఉన్నాయి. టైమ్స్ జాబితాలో 112వ స్థానంలో ఉన్న భారతీయ కంపెనీలలో HCL టెక్ అగ్రస్థానంలో ఉంది. దీని తర్వాత ఇన్ఫోసిస్ 119వ స్థానంలో, విప్రో 134వ స్థానంలో ఉన్నాయి.


ఈ జాబితాలో 8 కంపెనీలకు చోటు

  • అదానీ ఎంటర్‌ప్రైజెస్

  • అదానీ పోర్ట్స్

  • అదానీ గ్రీన్

  • అదానీ ఎనర్జీ సొల్యూషన్స్

  • అదానీ టోటల్ గ్యాస్

  • అంబుజా సిమెంట్స్

  • అదానీ పవర్

  • అదానీ విల్మార్

ఈ సందర్భంగా అదానీ గ్రూప్ సోషల్ మీడియా వేదికగా ఓ ప్రకటన విడుదల చేసింది. అదానీ గ్రూప్ తన వ్యాపారాలలో శ్రేష్ఠతను సాధించడానికి చేస్తున్న కృషి, నిరంతర ప్రయత్నాలను ఈ జాబితా పునరుద్ఘాటిస్తుందిని వెల్లడించింది.


జాబితాలో

టైమ్స్ వరల్డ్స్ బెస్ట్ కంపెనీస్ 2024లో చేర్చబడిన ఇతర భారతీయ కంపెనీలు మహీంద్రా గ్రూప్, యాక్సిస్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ICICI బ్యాంక్, లార్సెన్ & టూబ్రో, కోటక్ మహీంద్రా బ్యాంక్, ITC లిమిటెడ్, రిలయన్స్ ఇండస్ట్రీస్, అదానీ గ్రూప్, NTPC లిమిటెడ్, యెస్ బ్యాంక్, బ్యాంక్ బరోడా, గోద్రెజ్ & బోయ్స్, బజాజ్ గ్రూప్, సిప్లా, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, MRF ఉన్నాయి. ఈ టైమ్ లిస్ట్‌లో అదానీ గ్రూప్ 736వ స్థానంలో ఉంది.


అగ్రస్థానం

ఈ జాబితాలో అమెరికాకు చెందిన ప్రముఖ టెక్నాలజీ కంపెనీ యాపిల్ అగ్రస్థానంలో నిలిచింది. దీని తర్వాత ఐర్లాండ్‌లోని ప్రముఖ టెక్నాలజీ కంపెనీ యాక్సెంచర్ ఉంది. మైక్రోసాఫ్ట్, బీఎండబ్ల్యూ గ్రూప్, అమెజాన్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ర్యాంకింగ్‌లో మూడో స్థానంలో ఉన్న మైక్రోసాఫ్ట్, గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ తర్వాత ఉద్యోగుల సంతృప్తి పరంగా రెండవ అత్యధిక రేటింగ్ పొందిన కంపెనీ.


ఈ జాబితాను ప్రధానంగా 3 అంశాల ఆధారంగా రూపొందించారు.

ఉద్యోగుల సంతృప్తి: 50 దేశాల్లో నిర్వహించిన ఈ సర్వేలో 1,70,000 మంది ఉద్యోగులు పని పరిస్థితులు, జీతం, మొత్తం కంపెనీ ఇమేజ్ ఆధారంగా కంపెనీలను ఎంపిక చేశారు

ఆదాయ వృద్ధి: 2023లో $100 మిలియన్ కంటే ఎక్కువ ఆదాయం ఉన్న కంపెనీలు 2021 నుంచి 2023 మధ్య వృద్ధిని నమోదు చేసిన అంచనాలను బట్టి జాబితాను తయారు చేశారు.

సస్టైనబిలిటీ (ESG): స్టాటిస్టికా ESG డేటాబేస్, పరిశోధన నుంచి ESG KPIలు (ఎన్విరాన్‌మెంటల్ సోషల్ గవర్నెన్స్ కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్) ఆధారంగా కంపెనీలు అంచనా వేయబడ్డాయి.


ఇవి కూడా చదవండి

Narendra Modi: 45 ఏళ్ల తర్వాత తొలిసారి దోడాకు ప్రధాని.. కారణమిదే..


Aadhaar Free Update: మీ ఆధార్ కార్డ్ అప్‌డేట్ చేశారా లేదా లాస్ట్ ఛాన్స్.. మిస్సైతే మీకే నష్టం..


Personal Loans: లోన్ యాప్స్ నుంచి రుణం తీసుకుంటున్నారా.. ఈ 4 తప్పులు అస్సలు చేయోద్దు

Read MoreBusiness News and Latest Telugu News

Updated Date - Sep 14 , 2024 | 10:37 AM

Advertising
Advertising