Air India Express: 70కిపైగా విమానాలు రద్దు చేసిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్.. కారణం తెలిస్తే షాక్
ABN, Publish Date - May 08 , 2024 | 11:37 AM
మీరు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్(Air India Express) ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నారా. అయితే ఈ వార్త మీకోసమే. ఎందుకంటే ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ నిన్న రాత్రి నుంచి ఇప్పటివరకు 70 కంటే ఎక్కువ అంతర్జాతీయ, దేశీయ విమానాల సర్వీసులను రద్దు చేసింది. విమానాల రద్దుకు కారణం పెద్ద సంఖ్యలో సిబ్బంది అనారోగ్య సెలవుపై వెళ్లడమేనని తెలుస్తోంది.
మీరు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్(Air India Express) ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నారా. అయితే ఈ వార్త మీకోసమే. ఎందుకంటే ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ నిన్న రాత్రి నుంచి ఇప్పటివరకు 70 కంటే ఎక్కువ అంతర్జాతీయ, దేశీయ విమానాల సర్వీసులను రద్దు చేసింది. విమానాల రద్దుకు కారణం పెద్ద సంఖ్యలో సిబ్బంది అనారోగ్య సెలవుపై వెళ్లడమేనని తెలుస్తోంది.
అంతేకాదు కొంత కాలంగా ఈ సిబ్బంది సంస్థలో విధానాలపై అసంతృప్తిగా ఉన్నారని, ఈ క్రమంలోనే దాదాపు 300 మంది ఆకస్మాత్తుగా సిక్ లీవ్ పెట్టారని తెలిసింది. దీంతో ఈ సంస్థకు చెందిన అనేక విమానాలు మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు రద్దు చేయబడ్డాయి. దీనిపై సివిల్ ఏవియేషన్ అథారిటీ విచారణ చేస్తోందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.
గత రాత్రి నుంచి కొంతమంది క్యాబిన్ సిబ్బంది అకస్మాత్తుగా అస్వస్థతకు గురయ్యారని ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ప్రతినిధి తెలిపారు. దీంతో కొన్ని విమానాలు ఆలస్యంగా రాగా, కొన్నింటిని రద్దు చేయాల్సి వచ్చిందన్నారు. ఇది ఎందుకు జరిగిందో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నామని వెల్లడించారు. అయితే ఇదే సమయంలో ప్రయాణికులకు అకస్మాత్తుగా కలిగిన అసౌకర్యానికి ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ క్షమాపణలు చెప్పింది. విమానాలు రద్దు చేయబడిన ప్రయాణీకులకు పూర్తి వాపసు ఇవ్వబడుతుందని లేదా వారి విమానాన్ని వేరే తేదీకి ఉచితంగా మార్చబడుతుందని కూడా ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ తెలిపింది. ఈ నేపథ్యంలో అనేక మంది ప్రయాణికులు(passengers) సోషల్ మీడియా వేదికగా నిరసన వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలో విమానాశ్రయానికి చేరుకోవడానికి ముందు తమ ఫ్లైట్ రద్దు చేయబడిందో లేదో తనిఖీ చేయాలని ఎయిర్‌లైన్ ప్రతినిధి ప్రయాణీకులకు(passengers) సూచించారు. గత ఏడాది డిసెంబర్ 2023లో టాటా గ్రూప్ ఎయిర్‌లైన్, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌కు కార్మిక మంత్రిత్వ శాఖ నోటీసు జారీ చేసింది. ఎయిర్‌లైన్ మేనేజ్‌మెంట్, క్యాబిన్ సిబ్బంది మధ్య వివాదాలకు సంబంధించి కొన్ని నిబంధనలను ఉల్లంఘించిన తర్వాత ఈ నోటీసు జారీ చేయబడింది.
అంతకుముందు ఏప్రిల్ ప్రారంభంలో సిబ్బంది అకస్మాత్తుగా సెలవుపై వెళ్లడంతో విస్తారా ఎయిర్‌లైన్ 100కి పైగా విమానాలను రద్దు చేసింది. కొత్త కాంట్రాక్ట్‌లో వేతన సవరణ చేయాలని డిమాండ్ చేస్తూ విస్తారా ఎయిర్‌లైన్ సిబ్బంది నిరసన చేపట్టారు. వాస్తవానికి ఎయిర్ ఇండియాతో విలీనానికి ముందు ఎయిర్‌లైన్ ప్రారంభించిన కొత్త కాంట్రాక్ట్ నిబంధనలపై విస్తారా పైలట్లు నిరసన వ్యక్తం చేశారు. కొత్త ఒప్పందం ప్రకారం టాటా గ్రూప్ ఎయిర్‌లైన్స్‌లో జీతాల నిర్మాణం ప్రకారం విస్తారా పైలట్‌లకు 70 గంటలకు బదులుగా 40 గంటలపాటు స్థిర జీతం లభిస్తుంది.
ఇది కూడా చదవండి:
Gold and Silver Rates: పసిడి ప్రియులకు షాక్..మళ్లీ పెరిగిన బంగారం, వెండి
IRCTC: 8 రోజులు, 7 రాత్రుల స్పెషల్ టూర్ ప్యాకేజీ.. శ్రీకృష్ణుడి ద్వారకా నగరం సహా ఇవి కూడా
Read Latest Business News and Telugu News
Updated Date - May 08 , 2024 | 11:41 AM