ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Jeff Bezos: అమెజాన్ జెఫ్ బెజోస్‌కు భారీ దెబ్బ.. ఎలాన్ మస్క్, అంబానీ మనీ కూడా..

ABN, Publish Date - Aug 03 , 2024 | 07:05 PM

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా(world wide) మార్కెట్లలో గందరగోళం నెలకొంది. భారత మార్కెట్‌లోనే కాదు. అమెరికా మార్కెట్‌(american stock market) కూడా పతనాన్ని చవిచూస్తోంది. ఈ క్రమంలో శుక్రవారం రోజు ప్రపంచంలోని అత్యంత సంపన్నులలో ఒకరైన జెఫ్ బెజోస్(Jeff Bezos) 21 బిలియన్ డాలర్లు (రూ. 17,59,74,54,00,000 లక్షల కోట్లు) నష్టపోయారు.

Amazon Jeff Bezos

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా(world wide) మార్కెట్లలో గందరగోళం నెలకొంది. భారత మార్కెట్‌లోనే కాదు. అమెరికా మార్కెట్‌(american stock market) కూడా పతనాన్ని చవిచూస్తోంది. ఈ క్రమంలో శుక్రవారం రోజు ప్రపంచంలోని అత్యంత సంపన్నులలో ఒకరైన జెఫ్ బెజోస్(Jeff Bezos) 21 బిలియన్ డాలర్లు (రూ. 17,59,74,54,00,000 లక్షల కోట్లు) నష్టపోయారు. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ నివేదిక ప్రకారం జెఫ్ బెజోస్ నికర విలువ కేవలం ఒక్క రోజులోనే 21 బిలియన్ డాలర్లు తగ్గింది.

దీని తర్వాత ఆయన మొత్తం నికర విలువ 185.3 బిలియన్ డాలర్లకు పడిపోయింది. Amazon ఆన్‌లైన్ రిటైలర్ షేర్లు శుక్రవారం 13% పడిపోవడంతో బెజోస్ సంపద(net worth) తగ్గిపోయింది. అమెజాన్ రెండో త్రైమాసిక ఆదాయాన్ని గురువారం విశ్లేషకుల అంచనాల కంటే తక్కువగా నివేదించింది. ఆ క్రమంలో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆండీ జాస్సీ కంపెనీ మూలధన వ్యయ భారం లాభాలను తగ్గించగలదన్నారు. దీంతోపాటు AI భయాందోళనలు కూడా మార్కెట్‌పై ప్రభావం చూపినట్లు తెలుస్తోంది.


భారీ నష్టం

అయితే జెఫ్ బెజోస్ సంపద(net worth) ఒక్కరోజులో ఇంతగా క్షీణించడం ఇదే మొదటిసారి కాదు. ఒకేసారి ఆయన సంపద ఒక్కరోజులో రూ.36 బిలియన్లు పడిపోయింది. 2019 సంవత్సరంలో బెజోస్ విడాకులు ప్రకటించిన తర్వాత ఈ సంఘటన జరిగింది. ఏప్రిల్ 2022లో అమెజాన్ షేర్లు 14 శాతం పడిపోయాయి. దీంతో జెఫ్ బెజోస్ భారీ నష్టాన్ని చవిచూడాల్సి వచ్చింది. ఏప్రిల్ 4, 2019న విడాకుల పరిష్కారం తర్వాత అమెజాన్ సహ వ్యవస్థాపకుని నికర విలువ $36 బిలియన్లకు పడిపోగా, తాజాగా జరిగిన నష్టం రెండో స్థానంలో ఉంది. ఒక రోజులో $21 బిలియన్లకు పైగా నష్టపోయినప్పటికీ అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ ప్రపంచంలో రెండో అత్యంత సంపన్న వ్యక్తిగా కొనసాగుతున్నారు.


పతనం కారణంగా

శుక్రవారం అమెరికా మార్కెట్ పతనం కారణంగా జెఫ్ బెజోస్(Jeff Bezos) నష్టపోవడమే కాకుండా టెక్ స్టాక్స్ పతనం కారణంగా ప్రపంచంలోని 10 మంది ధనవంతుల సంపదలో కూడా భారీ క్షీణత చోటు చేసుకోవడం విశేషం. ఆగస్టు 2న ప్రపంచంలోని అత్యంత సంపన్నుడైన ఎలాన్ మస్క్(elon musk) నికర విలువలో $6.6 బిలియన్ల క్షీణత నమోదైంది. లారీ ఎల్లిసన్ ఒక్కరోజులో 4.4 బిలియన్ డాలర్లను కోల్పోయారు. మెటా వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్ నికర విలువ $3.39 బిలియన్లు తగ్గి $174 బిలియన్లకు చేరుకుంది. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ నికర విలువ $3.39 బిలియన్లకు తగ్గింది. 1.95 బిలియన్ డాలర్లు తగ్గి 155 బిలియన్ డాలర్లకు చేరుకుంది.


ముఖేష్ అంబానీ సహా

బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్‌లో 11వ స్థానంలో ఉన్న ఆసియాలోని అత్యంత సంపన్న పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ(mukesh ambani) $1.20 బిలియన్ల నష్టాన్ని చవిచూడగా, ఆయన నికర విలువ $113 బిలియన్లకు పడిపోయింది. 12వ ధనిక పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ సంపద కూడా 1.34 బిలియన్ డాలర్లు తగ్గి 110 బిలియన్ డాలర్లకు చేరుకుంది. నష్టాల విషయంలో జెఫ్ బెజోస్ ముందంజలో ఉన్నారని అయితే ప్రపంచంలోని 500 మంది ధనవంతుల సంపదను కూడా కలుపుకుంటే 134 బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లిందని బ్లూమ్‌బెర్గ్ తెలిపింది.


ఇవి కూడా చదవండి:

ITR Filing: జరిమానాతో ఐటీఆర్ ఫైల్ చేయడం వల్ల ఇన్ని నష్టాలున్నాయా..!


Saving Tips: SBI Fd Vs KVP.. రూ. 5 లక్షలు 10 ఏళ్ల పెట్టుబడికి ఏది బెస్ట్

Saving Scheme: రోజూ ఇలా రూ.200 సేవ్ చేయండి.. రూ.28 లక్షలు పొందండి..

Read More Business News and Latest Telugu News

Updated Date - Aug 03 , 2024 | 07:08 PM

Advertising
Advertising
<