ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Anant-Radhika Wedding: అనంత్ అంబానీ, రాధిక మర్చంట్‌ పెళ్లి వేళ మరో కీలక నిర్ణయం

ABN, Publish Date - Jun 29 , 2024 | 10:26 AM

ముకేశ్ అంబానీ, నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ-రాధిక మర్చంట్‌ల వివాహం(Anant Ambani-Radhika Merchant wedding) జూలై 12న జరగనుంది. ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (BKC)లోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో ఈ పెళ్లి వేడుకను నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ వేడుకకు ముందు అంబానీ ఫ్యామిలీ మరో కీలక నిర్ణయం తీసుకుంది.

Anant Ambani and Radhika Merchant

ముకేశ్ అంబానీ(mukesh ambani), నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ-రాధిక మర్చంట్‌ల వివాహం(Anant Ambani-Radhika Merchant wedding) జూలై 12న జరగనుంది. ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (BKC)లోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో ఈ పెళ్లి వేడుకను నిర్వహించనున్నారు. ఇప్పటికే ఈ వేడుక గురించి చాలా రోజులుగా చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ వేడుకకు ముందు అంబానీ ఫ్యామిలీ మరో కీలక నిర్ణయం తీసుకుంది.


నిరుపేదల కోసం

అదేంటంటే నిరుపేద ప్రజల కోసం సామూహిక వివాహాన్ని(wedding) నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఓ కార్డ్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీన్ని బట్టి చూస్తుంటే ఈ ఈవెంట్ కూడా అనంత్-రాధిక ప్రీ వెడ్డింగ్ వేడుకలో భాగమేనని వెల్లడించారు. ఆహ్వానం ఫోటో ప్రకారం అంబానీ ఫ్యామిలీ మహారాష్ట్ర(maharashtra)లోని పాల్ఘర్‌(Palghar)లో నిరుపేదల సామూహిక వివాహాన్ని నిర్వహించనుంది. పాల్ఘర్‌లోని స్వామి వివేకానంద విద్యామందిర్‌లో జూలై 2న సాయంత్రం 4:30 గంటలకు ఈ వేడుక నిర్వహించనున్నట్లు ఆహ్వాన పత్రికలో పేర్కొన్నారు.


ఇప్పటికే రెండు చోట్ల..

నీతా(nita ambani), ముఖేష్ అంబానీ(mukesh ambani) ఈ ఉదాత్తమైన ప్రయత్నానికి సహకరిస్తున్నారు. ఈ సందర్భంగా వారు కుటుంబ సమేతంగా హాజరుకానున్నారు. ఈ వేడుకలో మీరు మాతో చేరాలని మేము కోరుకుంటున్నామని వెల్లడించారు. అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ పెళ్లికి ముందు అంబానీ ఫ్యామిలీ రెండు ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్లను ఏర్పాటు చేశారు. స్టార్లు, ప్రముఖ వ్యాపారవేత్తలతో జామ్‌నగర్‌లో తొలి వేడుక జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రపంచం నలుమూలల నుంచి ప్రముఖులు హాజరయ్యారు. రెండో కార్యక్రమాన్ని ఇటీవల క్రూయిజ్‌లో నిర్వహించారు.


ఇది కూడా చదవండి:

Gold and Silver Prices: తగ్గిన బంగారం, వెండి ధరలకు బ్రేక్..ఎంత పెరిగాయంటే


ఈ మార్చి చివరినాటికి వెల్లడించిన కేంద్ర ఆర్థిక శాఖ

చిన్న మొత్తాల పొదుపు రేట్లు యథాతథం


For Latest News and Business News click here

Updated Date - Jun 29 , 2024 | 10:32 AM

Advertising
Advertising