ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Business Idea: ఏ కాలమైనా ఈ వ్యాపారానికి డోకా ఉండదు.. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం

ABN, Publish Date - May 05 , 2024 | 10:28 AM

ఏ వ్యాపారమైనా కూడా మీరు అనుకున్న ప్లాన్ అమలు చేసి కొన్ని రోజులు ఓపిక పడితే చాలు లాభాలు తప్పక వస్తాయి. అంతేకానీ వ్యాపారం ప్రారంభించిన కొన్ని రోజులకే లాభాలు రావడం లేదని నిరాశ చెందకూడదు. అయితే అన్ని సీజన్లలో చేసుకునే ఓ వ్యాపారం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

pickle business idea

ఏ వ్యాపారమైనా కూడా మీరు అనుకున్న ప్లాన్ అమలు చేసి కొన్ని రోజులు ఓపిక పడితే చాలు లాభాలు తప్పక వస్తాయి. అంతేకానీ వ్యాపారం ప్రారంభించిన కొన్ని రోజులకే లాభాలు రావడం లేదని నిరాశ చెందకూడదు. అయితే అన్ని సీజన్లలో చేసుకునే ఓ వ్యాపారం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అదే పికిల్స్ బిజినెస్(pickle business). ప్రస్తుత వేసవి సీజన్లో మామిడి(mango), నిమ్మకాయ, టమాటా, ఉసిరికాయ వంటి అనేక రకాల పచ్చళ్లకు మార్కెట్లో ఫుల్ డిమాండ్ ఉంటుంది. ఈ నేపథ్యంలో మీరు ఈ వ్యాపారాన్ని ప్రారంభించి మంచి లాభాలను పొందవచ్చు. అయితే ఈ వ్యాపారాన్ని ఎలా ప్రారంభించాలి, ఎంత పెట్టుబడి అవుతుందనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.


ఎలా ప్రారంభించాలి

మీరు తక్కువ పెట్టుబడి(investment)తో ఈ వ్యాపారాన్ని ఇంటి నుంచే చాలా సులభంగా ప్రారంభించవచ్చు. వ్యాపారం వృద్ధి చెందడం ప్రారంభించినప్పుడు మీరు ప్రత్యేక స్థలాన్ని తీసుకొని ఈ వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లవచ్చు. ఊరగాయలు తయారుచేయడం, ఊరగాయలు ఎండబెట్టడం, పచ్చళ్లు ప్యాకింగ్ చేయడం మొదలైన వాటికి ఖాళీ స్థలం అవసరం. ఊరగాయలు ఎక్కువ కాలం చెడిపోకుండా ఉండాలంటే పచ్చళ్లు తయారుచేసే పద్ధతిలో అత్యంత శుభ్రత అవసరం.

అప్పుడే పచ్చళ్లు ఎక్కువ కాలం చెక్కుచెదరకుండా ఉంటాయి. దీని కోసం 900 చదరపు అడుగుల విస్తీర్ణం అవసరం. వ్యాపారాన్ని ప్రారంభించడానికి మీరు ఆన్‌లైన్(online) విధానంలో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ (FSSAI) నుంచి లైసెన్స్ పొందాలి. మీరు ఈ వ్యాపారం ప్రారంభించాలనుకుంటే ప్రభుత్వ పథకాలను కూడా సద్వినియోగం చేసుకోవచ్చు.


పెట్టుబడి ఎంత

పచ్చళ్ల తయారీ వ్యాపారం(business)లో రూ.15 వేలు పెట్టుబడి పెడితే మీకు నాలుగింతల లాభం వస్తుంది. ఎలా అంటే మీరు ముందుగా మామిడి కాయ పచ్చడి పెట్టాలని అనుకుంటే ఆ మొత్తంతో 2 వేల ప్యాకెట్ల (250 గ్రాములు) పచ్చడిని తయారు చేసుకోవాలి. అలా తయారు చేసిన ప్యాకెట్లను ప్రతి షాపుకు 40 చొప్పున 50 దుకాణాలకు ఇచ్చినా కూడా మీ ప్యాకెట్లు పూర్తవుతాయి. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ధరల ప్రకారం చూస్తే మీరు కనీసం ప్రతి ప్యాకెట్‌కు రూ.30 నుంచి 40 రూపాయల వరకు లాభం పొందవచ్చు.


లాభం ఎంత

ఆ విధంగా రెండు వేల ప్యాకెట్లకు 30 రూపాయల లాభం వేసుకుంటే నెలకు రూ. 60 వేల వరకు సంపాదించుకునే(income) అవకాశం ఉంటుంది. ఇలా మీరు ప్రతి నెలా సేల్ చేసే ఉత్పత్తుల మొత్తాన్ని బట్టి మీ లాభం ఉంటుంది. ఎక్కువ మొత్తంలో పికిల్స్ ప్యాకెట్లు(pickle packets) సేల్ చేస్తే ఎక్కువ లాభం వస్తుంది. ఈ సంపాదన మీ ఉత్పత్తి, డిమాండ్, ప్యాకింగ్, ప్రాంతాలపై కూడా ఆధారపడి ఉంటుంది. ఊరగాయలను ఆన్‌లైన్, హోల్‌సేల్, రిటైల్ మార్కెట్, రిటైల్ చైన్‌ల ద్వారా కూడా విక్రయించుకోవచ్చు. అంతేకాదు డిమాండ్‌ను బట్టి విదేశాలకు కూడా పంపించవచ్చు.


ఇది కూడా చదవండి:

IRCTC: కాశ్మీర్ టూర్ ప్యాకేజీ.. అందాలు మిస్ అవ్వకండి

IRCTC: 8 రోజులు, 7 రాత్రుల స్పెషల్ టూర్ ప్యాకేజీ.. శ్రీకృష్ణుడి ద్వారకా నగరం సహా ఇవి కూడా


Read Latest Business News and Telugu News

Updated Date - May 05 , 2024 | 10:32 AM

Advertising
Advertising