Time Magazine: టైమ్ మ్యాగజైన్ 100 AI జాబితా ప్రభావవంతమైన వ్యక్తుల్లో.. అశ్విని వైష్ణవ్, అనిల్ కపూర్ సహా
ABN, Publish Date - Sep 06 , 2024 | 03:22 PM
ప్రముఖ టైం మ్యాగజైన్ ప్రతిష్టాత్మక రెండో ప్రభావవంతమైన వ్యక్తుల 100 మంది వ్యక్తుల AI జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో ముగ్గురు భారతీయుల పేర్లు కూడా ఉన్నాయి. వారిలో కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్, బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్, ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకని చోటు దక్కించుకున్నారు. ఇంకా ఎవరెవరు చోటు దక్కించుకురనేది ఇక్కడ చుద్దాం.
ప్రసిద్ధ అమెరికన్(america) మ్యాగజైన్ టైం అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల రెండో వార్షిక AI 100 జాబితాను ఇటివల విడుదల చేసింది. టైమ్ 100 అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) అభివృద్ధికి సహకరించిన ప్రముఖ వ్యక్తులు ఉన్నారు. ఈ జాబితాలో ముగ్గురు భారతీయుల పేర్లు కూడా ఉన్నాయి. వారిలో కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్, బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్, ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకని చోటు దక్కించుకున్నారు.
అంతేకాదు ముగ్గురు భారతీయులతో పాటు ఈ 100 మంది ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో హాలీవుడ్ స్టార్ స్కార్లెట్ జాన్సన్, మార్క్ జుకర్‌బర్గ్, సుందర్ పిచాయ్, సత్య నాదెళ్ల వంటి సాంకేతిక రంగ ప్రముఖుల పేర్లు ఉన్నాయి. AI రంగంలో భారతదేశం ప్రయత్నాలకు నాయకత్వం వహించినందుకు గాను వైష్ణవ్‌ను గౌరవించారని తెలుస్తోంది.
AIకి సహకరించడానికి
టైమ్ మ్యాగజైన్ AI అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగంలో విశేష కృషి చేసిన 100 మంది ప్రభావవంతమైన వ్యక్తుల పేర్ల జాబితాను విడుదల చేసింది. ఈ ప్రముఖులు AI అభివృద్ధికి సహకరించారు. అందుకే ఈ జాబితాలో అనిల్ కపూర్ కూడా చేరిపోయారు. భవిష్యత్తులో AI సాంకేతికత పరిధి గురించి TIME ఎడిటర్ ఇన్ చీఫ్ సామ్ జాకబ్స్ ప్రస్తావించారు. 2023లో AI OpenAI, Anthropic వంటి పోటీదారులచే ఆధిపత్యం చెలాయించింది. కాబట్టి ఈ సంవత్సరం మేము కొన్ని టెక్ దిగ్గజాలను చూశామని వెల్లడించారు. ఈ సంవత్సరం AI జాబితా చేసిన వారిలో టెక్ రంగానికి చెందిన అనేక ప్రముఖులు ఉన్నట్లు తెలిపారు.
ప్రయోజనం ఏంటి?
TIME వంటి మీడియా సంస్థలతో సహా అనేక పరిశ్రమలు ఇప్పుడు కొత్త వ్యాపార నమూనాలు, అవకాశాలను అన్వేషించడానికి AI కంపెనీలతో భాగస్వామ్యం కలిగి ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైపు దేశం అడుగులు వేయడంలో కేంద్ర మంత్రి కీలక పాత్ర పోషించారని ఈ జాబితాలో అశ్విని వైష్ణవ్ గురించి చెప్పకనే చెప్పారు. జులైలో గ్లోబల్ ఇండియా ఏఐ సమ్మిట్‌కు భారతదేశం ఆతిథ్యం ఇచ్చింది. ఆ క్రమంలో 2,000 మందికి పైగా AI నిపుణులు ఇందులో పాల్గొన్నారు. ఈ సమ్మిట్‌లో సాంకేతికతను పెంచుకోవాల్సిన అవసరాన్ని వైష్ణవ్ గుర్తు చేశారని టైమ్ పేర్కొంది. భారత ప్రభుత్వం తన AI రంగానికి మద్దతుగా 1.2 బిలియన్ డాలర్లకు పైగా కేటాయించిందని అప్పుడు వెల్లడించారు.
ఇవి కూడా చదవండి:
Fire Accident: స్కూల్ హాస్టల్లో భారీ అగ్నిప్రమాదం.. 17 మంది విద్యార్థులు సజీవ దహనం
BSNL: జియో, ఎయిర్‌టెల్ కట్టడికి బీఎస్ఎన్ఎల్ పెద్ద ప్లాన్.. టాటా సపోర్ట్‌తో ఇక..
Money Saving Tips: రోజు రూ.250 సేవ్ చేయండి.. ఇలా రూ.2 కోట్లు సంపాదించండి..
Read More Business News and Latest Telugu News
Updated Date - Sep 06 , 2024 | 03:26 PM