ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Axis Bank: మీరు యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు వాడుతున్నారా? ఈ నెల 20 నుంచి ఈ ఛార్జీలు పెరుగుతున్నాయి..

ABN, Publish Date - Dec 18 , 2024 | 07:48 PM

ఇటీవలే ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ రూల్స్ మార్చగా.. ఇప్పుడు యాక్సిస్ బ్యాంక్ కూడా అదే బాటలో నడవనుంది. క్రెడిట్ కార్డులకు సంబంధించిన పలు నిబంధనలను మార్చింది. ఈ కొత్త రూల్స్ డిసెంబర్ 20, 2024 నుంచి అమలులోకి రాబోతున్నాయి

Axis Bank Credit Card Rules Changing From 20 December

ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్ అయిన యాక్సిస్ బ్యాంక్ (Axis Bank) ఈ నెల 20వ తేదీ నుంచి ఛార్జీలు పెంచి కస్టమర్లకు షాకివ్వబోతోంది. ఇటీవలే ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ రూల్స్ మార్చగా.. ఇప్పుడు యాక్సిస్ బ్యాంక్ కూడా అదే బాటలో నడవనుంది. ప్రముఖ ఎయిర్ లైన్స్, హోటల్ లయాల్టీ ప్రోగ్రామ్స్‌కి రివార్డ్ పాయింట్లను బదిలీ చేసుకునేందుకు ఇప్పటివరకు ఉచితంగా అవకాశం కల్పించిన యాక్సిస్ బ్యాంక్ ఇకపై ఛార్జీలు వసూలు చేయనుంది. దీంతో పాటు క్రెడిట్ కార్డులకు సంబంధించిన పలు నిబంధనలను మార్చింది. ఈ కొత్త రూల్స్ డిసెంబర్ 20, 2024 నుంచి అమలులోకి రాబోతున్నాయి (Axis Bank Credit Card).


1) క్రెడిట్ కార్డుల వడ్డీ రేట్లను 3.60 శాతం నుంచి 3.75 శాతానికి పెంచింది. అలాగే వార్షిక వడ్డీ రేట్లను 43.20 శాతం నుంచి 45 శాతానికి పెంచింది. కొన్ని ప్రత్యేక కార్డులు మినహా అన్ని రకాల క్రెడిట్ కార్డులకు కొత్త రేట్లు వర్తిస్తాయని తెలిపింది.

2) ఎన్ఏసీహెచ్ పేమెంట్ ఫెయిల్యూర్, ఆటో డెబిట్ రివర్సల్, చెక్ రిటర్న్ ఛార్జీలను పెంచనుంది. ప్రస్తుతం పేమెంట్ మొత్తంలో 2 శాతం లేదా కనిష్ఠంగా రూ.450, గరిష్టంగా రూ.1500 రుసుమును వసూలు చేస్తోంది. అయితే డిసెంబర్ 20 నుంచి కనీస మొత్తాన్ని రూ.500లకు పెంచింది. అలాగే గరిష్ఠ పరిమితిని ఎత్తేసింది. బుర్గుండి ప్రైవేట్ క్రెడిట్ కార్డు, ఒలంపస్ క్రెడిట్ కార్డ్, ప్రైమస్ క్రెడిట్ కార్డులు మినహా మిగిలిన కార్డులన్నింటికీ ఈ ఛార్జీలు వర్తిస్తాయి.

3) ఇప్పటివరకు క్రెడిట్ కార్డుల బిల్లులు ఆన్‌లైన్ చెల్లింపులతో పాటు బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లి కూడా చెల్లించవచ్చు. అయితే, బ్యాంక్‌కు వెళ్లి చెల్లిస్తే అదనంగా రూ.100 చెల్లించాలి. డిసెంబర్ 20 నుంచి బ్యాంకుకు వెళ్లి క్రెడిట్ కార్డుల ఛార్జీలు చెల్లిస్తే రూ.175 రసుము చెల్లించాల్సి వస్తుంది.

4)ఒక రోజులో గరిష్ఠంగా రూ.50 వేల క్యాష్ పేమెంట్స్ చేయవచ్చు. బుర్గుండీ ప్రైవేట్ క్రెడిట్ కార్డు, ప్రైమస్ క్రెడిట్ కార్డు, ఇన్‌స్టా ఈజీ క్రెడిట్ కార్డు మినహా మిగిలిన కార్డులన్నింటికీ ఈ ఛార్జీల పెంపు వర్తిస్తుంది.


5)క్రెడిట్ కార్డుల పేమెంట్ కట్టడంలో ఆలస్యమైతే బ్యాంకు లేట్ పేమెంట్ ఛార్జీలు వసూలు చేస్తుంది. రూ.500 వరకు అయితే ఎలాంటి లేట్ పేమెంట్ ఛార్జీలు ఉండవు. రూ.501 నుంచి రూ.5000 లోపు బిల్లుకు రూ.500 కట్టాలి. రూ.5001 నుంచి రూ.10 వేల వరకు రూ.750, రూ.10 వేల పైన అయితే రూ.1200 లేట్ పేమెంట్ ఫీ కట్టాలి. అలాగే వరుసగా రెండు నెలల పాటు పేమెంట్లు చేయకపోతే అదనంగా రూ.100 లేట్ ఫీ పడుతుంది.

6)డైనమిక్ కరెన్సీ కన్వర్షన్ (డీసీసీ) మార్కప్ ఫీజును ప్రస్తుతం ఉన్న 1 శాతం నుంచి 1.5 శాతానికి పెంచింది

7) రివార్డ్ పాయింట్ల ద్వారా గిఫ్ట్ వోచర్లు, ఫ్లైట్ టికెట్ బుకింగ్స్, హోటల్ అకామిడేషన్ వంటివి బుక్ చేసినప్పుడు ఫీజు చెల్లించాలి. రివార్డ్ పాయింట్లను కన్వర్ట్ చేయడం లేదా వివిధ ఎయిర్ లైన్స్, హోటల్ లాయల్టీ కార్యక్రమాలకు బదిలీ చేసినా రూ.199 ఛార్జీ చెల్లించాల్సి వస్తుంది.

8)ఎడ్యుకేషన్ ట్రాన్సాక్షన్లపై, ప్రత్యేక ట్రాన్సాక్షన్లపై, రెంట్ సర్ ఛార్జ్ కింద ఒక్కో శాతం ఛార్జీలు కట్టాల్సిందే.

మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Dec 18 , 2024 | 07:48 PM