Bank Holidays 2025: జనవరి 2025లో బ్యాంక్ సెలవులు.. ఈసారి ఎన్ని రోజులంటే
ABN, Publish Date - Dec 26 , 2024 | 01:53 PM
కొత్త సంవత్సరం రాబోతుంది. ఈ నేపథ్యంలో వచ్చే జనవరి 2025 బ్యాంకు సెలవుల జాబితాను ఆర్బీఐ విడుదల చేసింది. అయితే 2025 జనవరిలో ఎన్ని రోజులు సెలవులు ఉన్నాయనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
ఈ ఏడాది మరికొన్ని రోజుల్లో పూర్తి కానుంది. ఈ నేపథ్యంలో మీరు వచ్చే నెలలో బ్యాంకింగ్ కార్యకలాపాల కోసం సిద్ధం అవుతున్నారా. అయితే ఈ వార్త మీ కోసమే. ఎందుకంటే జనవరి 2025లో బ్యాంక్ సెలవులు (bank holidays) ఎన్ని రోజులు ఉన్నాయి. ఎన్ని రోజులు బ్యాంకులు పనిచేయనున్నాయనేది ఇప్పుడు చూద్దాం.
జనవరి 2025లో బ్యాంక్ సెలవుల జాబితా..
1 జనవరి 2025 బుధవారం - అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, గోవా, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, ఒడిశా, రాజస్థాన్, సిక్కిం, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల్లో సెలవు
2 జనవరి 2025, గురువారం - న్యూ ఇయర్ సెలవు
(ఈ సెలవు మిజోరాం, కేరళలో మన్నం జయంతి సందర్భంగా ప్రత్యేకంగా సెలవు)
5 జనవరి 2025, ఆదివారం - వారాంతపు సెలవు
6 జనవరి 2025, సోమవారం - గురు గోబింద్ సింగ్ జయంతి సెలవు
గురు గోబింద్ సింగ్ జయంతి హర్యానా, పంజాబ్ రాష్ట్రాలలో నిర్వహించబడుతుంది. ఇది సిక్కులు తమ గురు గోబింద్ సింగ్ జీని స్మరించుకునే పర్వదినం
11 జనవరి 2025, శనివారం - మిషనరీ డే హాలిడే, రెండో శనివారం దేశవ్యాప్తంగా సెలవు
ఈరోజు మిజోరాం రాష్ట్రంలో మిషనరీ డే గా సెలవుగా ఉంటుంది. ఈ రోజు మిజోరాంలోని క్రైస్తవ పాఠశాలలు, సంఘాలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తాయి
12 జనవరి 2025, ఆదివారం - వారాంతపు సెలవు, గాన్ నాగై పండుగ, స్వామి వివేకానంద జయంతి హాలిడే
మణిపూర్ రాష్ట్రంలో ఈరోజు గాన్ నాగై పండుగ జరుపుకుంటారు. దీంతోపాటు పశ్చిమ బెంగాల్, జమ్మూ కశ్మీర్, ఢిల్లీలో వివేకానంద జయంతి సెలవు
14 జనవరి 2025, మంగళవారం - మకర సంక్రాంతి సెలవు
ఈ పండుగ అనేక రాష్ట్రాలలో ఉత్సవంగా జరుపుకుంటారు. ముఖ్యంగా తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, గుజరాత్, కర్ణాటక, కేరళ, ఒడిశా, పంజాబ్, సిక్కింలో ప్రజలు ఈ పండుగను ఘనంగా జరుపుకుంటారు.
15 జనవరి 2025, బుధవారం - మఘ బిహూ హాలిడే
అసోంలో మఘ బిహూ పండుగ ఘనంగా జరుపుకుంటారు. దీంతోపాటు ఆంధ్రప్రదేశ్, సిక్కిం, తెలంగాణ, తమిళనాడులో మకర సంక్రాంతి పండుగ సెలవు ఉంటుంది
16 జనవరి 2025, గురువారం - కనుమ పండుగ సెలవు
ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో కనుమ పండుగ హాలిడే
23 జనవరి 2025, గురువారం - నేతాజీ సుభాష్ చంద్ర జయంతి హాలిడే
ఈరోజు భారతదేశంలో ముఖ్యంగా త్రిపుర, ఒడిశా, పంజాబ్, సిక్కిం, పశ్చిమ బెంగాల్, జమ్మూ కశ్మీర్, ఢిల్లీలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని స్మరించుకుంటారు.
25 జనవరి 2025, శనివారం - దేశవ్యాప్తంగా నాలుగో శనివారం సెలవు
26 జనవరి 2025, ఆదివారం - గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా సెలవు
30 జనవరి 2025, గురువారం - సోనామ్ లోసార్ సెలవు
సిక్కింలో సోనామ్ లోసార్ సందర్భంగా ప్రత్యేకంగా సెలవు ఉంటుంది
జనవరి 2025లో జరగనున్న ఈ ముఖ్యమైన పండుగల సెలవులు భారతదేశంలో వివిధ ప్రాంతాల్లో ప్రత్యేకంగా ఉంటాయి. ఈ రోజుల్లో బ్యాంకు సెలవుల నేపథ్యంలో ఆన్‌లైన్ లావాదేవీలు మాత్రం నిర్వహించుకోవచ్చు. దీంతోపాటు ఏటీఎం కేంద్రాల నుంచి కూడా డబ్బులు విత్ డ్రా, డిపాజిట్ సౌకర్యాలను వినియోగించుకోవచ్చు.
ఇవి కూడా చదవండి:
Top Mutual Funds: గత ఐదేళ్లలో టాప్ 7 మ్యూచువల్ ఫండ్స్.. ఎంత రిటర్న్స్ ఇచ్చాయంటే..
Personal Finance: జస్ట్ నెలకు రూ. 3500 సేవ్ చేస్తే.. రూ. 2 కోట్లు మీ సొంతం..
Personal Finance: మీ అప్పులను ఈ 7 మార్గాల ద్వారా ఈజీగా తీర్చుకోండి..
Personal Finance: రూ. 10 వేల పొదుపుతో రూ. 7 కోట్ల సంపాదన.. ఎలాగో తెలుసా..
Read More Business News and Latest Telugu News
Updated Date - Dec 26 , 2024 | 01:56 PM