Bank Holidays: నవంబర్ 2024లో బ్యాంక్ సెలవులు.. దాదాపు సగం రోజులు బంద్..
ABN , Publish Date - Oct 25 , 2024 | 08:23 AM
ఇంకొన్ని రోజుల్లో నవంబర్ నెల రానుంది. అయితే ఈ నెలలో బ్యాంకులు ఎన్ని రోజులు పనిచేయనున్నాయి. ఎన్ని రోజులు హాలిడే ఉందనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం. ఈ సెలవుల గురించి తెలుసుకోకుంటే మీరు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది.
అక్టోబర్ నెల మరికొన్ని రోజుల్లో పూర్తి కానుండగా, ఇకపై నవంబర్ మాసం రానుంది. అయితే నవంబర్ 2024లో బ్యాంక్ సెలవులు(bank holidays) ఎన్ని రోజులు ఉన్నాయి. ఎన్ని రోజులు బ్యాంకులు పనిచేస్తాయనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం. అయితే బ్యాంక్ సెలవుల గురించి తెలుసుకుంటే మీకు వచ్చే శాలరీ, ఆఫ్‌లైన్ విధానంలో చెల్లింపులు లావాదేవీల ప్రక్రియను సులభతరం చేసుకోవచ్చు. లేదంటే సెలవుల రోజు బ్యాంకులకు వెళితే ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. అయితే ఈసారి ఎన్ని రోజులు బ్యాంకు ఉద్యోగులకు సెలవులు వచ్చాయనేది ఇక్కడ తెలుసుకుందాం.
నవంబర్ 2024లో బ్యాంక్ సెలవులు
నవంబర్ 1 - దీపావళి అమావాస్య (త్రిపుర, కర్ణాటక, ఉత్తరాఖండ్, జమ్మూ కశ్మీర్, మహారాష్ట్ర, మేఘాలయ, సిక్కిం, మణిపూర్‌లలో బ్యాంకులు బంద్)
నవంబర్ 2 - దీపావళి (గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, ఉత్తరాఖండ్, సిక్కిం, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్‌లలో బ్యాంకులు మూసివేయబడతాయి)
నవంబర్ 3 - ఆదివారం దేశవ్యాప్తంగా బంద్
నవంబర్ 7, 8 - ఛత్ పూజ ( అసోం, బీహార్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్ ప్రాంతాల్లో సెలవు)
నవంబర్ 8 - వంగల పండుగ (మేఘాలయలో సెలవు)
నవంబర్ 9 - రెండవ శనివారం దేశవ్యాప్తంగా బంద్
నవంబర్ 10 - ఆదివారం దేశవ్యాప్తంగా బంద్
నవంబర్ 12 - ఎగాస్ బగ్వాల్ (మేఘాలయలో సెలవు)
నవంబర్ 15 - గురునానక్ జయంతి, కార్తీక పూర్ణిమ (ఒడిశా, తెలంగాణ, చండీగఢ్, పంజాబ్, అండమాన్ నికోబార్ దీవులు, అరుణాచల్ ప్రదేశ్, అసోం, ఛత్తీస్‌గఢ్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, జార్ఖండ్, లడఖ్, లక్షద్వీప్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మిజోరం, నాగాలాండ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్)
నవంబర్ 17 - ఆదివారం దేశవ్యాప్తంగా బంద్
నవంబర్ 18 - కనకదాస జయంతి (కర్ణాటకలో హాలిడే)
నవంబర్ 22 - లబాబ్ డుచెన్ సందర్భంగా సిక్కింలో సెలవు
నవంబర్ 23 - నాల్గో శనివారం దేశవ్యాప్తంగా సెలవు
నవంబర్ 24 - ఆదివారం దేశవ్యాప్తంగా సెలవు
దాదాపు సగం రోజులు
నవంబర్‌లో మొత్తం 14 రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. 14 రోజులు సెలవులు ఉంటే ఇక బ్యాంకులు పనిచేసేది దాదాపు సగం రోజులే అని చెప్పవచ్చు. ఇందులో వారం వారం శనివారం, ఆదివారం సెలవులు కూడా ఉన్నాయి. అయితే ఈ బ్యాంకు సెలవులు ఆయా రాష్ట్రాలను బట్టి మారుతూ ఉంటాయి. అయితే బ్యాంకులు మూసివేయబడినప్పటికీ కస్టమర్ల ఆన్‌లైన్ బ్యాంకింగ్ సేవలు మాత్రం అందుబాటులో ఉంటాయి. దీంతోపాటు పలు చోట్ల ఏటీఏంల ద్వారా కూడా లావాదేవీల ప్రక్రియను నిర్వహించుకోవచ్చు.
ఇవి కూడా చదవండి:
Personal Finance: మహిళలకు గుడ్ న్యూస్.. రూ. 5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు..
Pension Plan: రోజూ రూ. 12 ఆదా చేస్తే.. 60 ఏళ్ల తర్వాత నెలకు ఎంత పెన్షన్ వస్తుందంటే..
Muhurat Trading 2024: ఈసారి దీపావళి ముహూరత్ ట్రేడింగ్ ఎప్పుడంటే.. అక్టోబర్ 31 లేదా నవంబర్ 1..
Investment Tips: ఒకేసారి రూ. 12 లక్షలు పెట్టుబడి చేసి మరచిపోండి.. ఆ తర్వాత ఎంతవుతుందంటే..
Read More Business News and Latest Telugu News