Bank Holidays: అలర్ట్.. రేపటి నుంచి బ్యాంకులకు 4 రోజులు సెలవు
ABN, Publish Date - Dec 24 , 2024 | 09:24 AM
బ్యాంకు వినియోగదారులకు అలర్ట్. ఎందుకంటే ఈ వారంలో వచ్చే నాలుగు రోజులు బ్యాంకులకు హాలిడే ఉంది. అయితే హాలిడే ఏ రోజుల్లో ఉంది, ఎక్కడే అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
డిసెంబర్ ఈ వారం బ్యాంక్ సెలవులు 2024
చెక్ బుక్ పాస్ బుక్ వంటి అనేక పనులపై ప్రభావం
మీరు ఈ వారం ఏదైనా బ్యాంక్ పనికోసం వెళ్లాలని చూస్తున్నారా. అయితే ముందుగా ఈ వారం బ్యాంకు సెలవుల (bank holidays) గురించి తెలుసుకోండి మరి. ఎందుకంటే రేపటి నుంచి వచ్చే నాలుగు రోజులు బ్యాంకులకు సెలవులు ఉన్నాయి. అయితే ఏయే రోజుల్లో హాలిడే ఉంది. ఎన్ని రోజులు బ్యాంకులు బంద్ ఉంటాయనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం. రేపు అంటే డిసెంబర్ 25, 2024న క్రిస్మస్ పండుగ సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు. ఇక డిసెంబర్ 26న కూడా బాక్సింగ్ దినోత్సవం సందర్భంగా తెలుగు రాష్ట్రాలు కాకుండా పలు చోట్ల బ్యాంకులకు హాలిడే ఉంది.
ఈరోజు మాత్రమే వర్కింగ్
ఆ తర్వాత శుక్రవారం రోజు బ్యాంకులు యథావిధిగా పనిచేస్తాయి. కానీ తర్వాత డిసెంబర్ 28, 2024న నాల్గో శనివారం, డిసెంబర్ 29, 2024న ఆదివారం బ్యాంకులకు హాలిడే. దీంతో మొత్తం ఈ వారంలో నాలుగు రోజులు సెలవులు వచ్చాయి. మరోవైపు డిసెంబర్ 30న (సోమవారం): యు కియాంగ్ నంగ్‌బా పండుగ సందర్భంగా మేఘాలయలో బ్యాంకులు మూసివేయబడతాయి. డిసెంబర్ 31న (మంగళవారం): మిజోరం, సిక్కింలో నూతన సంవత్సర వేడుకలు/లాసాంగ్/నామ్‌సూంగ్ కారణంగా బ్యాంకులకు సెలవు ఉంటుంది.
ఏదైనా బ్యాంక్ పని ఉంటే
ఈ నేపథ్యంలో మీకు ఏదైనా బ్యాంక్ సంబంధిత పని ఉంటే, ఈరోజు లేదా శుక్రవారం పూర్తి చేసుకోండి. ఎందుకంటే డిసెంబర్ చివరిలో చాలా రోజులు బ్యాంకులు మూసివేయబడతాయి. కాబట్టి ఈ సెలవుల గురించి తెలుసుకుని మీ పనులను ప్లాన్ చేసుకోండి. భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) ప్రతి నెలా విడుదల చేసే బ్యాంకు సెలవుల జాబితాలో జాతీయ, ప్రాంతీయ సెలవు రోజులు ఉంటాయి. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాల వారీగా సెలవుల ప్రకారం దేశవ్యాప్తంగా బ్యాంకులు మూసివేయబడతాయి.
కానీ ఈ సేవలు మాత్రం..
అయితే ఒక రాష్ట్రంలో బ్యాంకులకు సెలవు ఉంటే మరోచోట అదే సెలవులు ఉంటాయని కాదు. అయితే బ్యాంకులకు సెలవులు ఉన్నా కూడా వినియోగదారులు ఆన్‌లైన్ సేవల సహాయం తీసుకోవచ్చు. UPI, మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ వంటి డిజిటల్ సేవలపై బ్యాంక్ సెలవులు ఎటువంటి ప్రభావం చూపవు. కాబట్టి బ్యాంక్ సెలవుల సమయంలో కస్టమర్‌లు ఆన్‌లైన్ సేవలను ఉపయోగించవచ్చు.
ఇవి కూడా చదవండి:
Top Mutual Funds: గత ఐదేళ్లలో టాప్ 7 మ్యూచువల్ ఫండ్స్.. ఎంత రిటర్న్స్ ఇచ్చాయంటే..
Cyber Protection: సైబర్ మోసాల నుంచి మీ డెబిట్, క్రెడిట్ కార్డ్‌లను ఇలా రక్షించుకోండి..
Public Holidays: 2025లో పబ్లిక్ హాలిడేస్ ఎన్ని రోజులో తెలుసా..
Personal Finance: జస్ట్ నెలకు రూ. 3500 సేవ్ చేస్తే.. రూ. 2 కోట్లు మీ సొంతం..
Personal Finance: మీ అప్పులను ఈ 7 మార్గాల ద్వారా ఈజీగా తీర్చుకోండి..
Personal Finance: రూ. 10 వేల పొదుపుతో రూ. 7 కోట్ల సంపాదన.. ఎలాగో తెలుసా..
Read More Business News and Latest Telugu News
Updated Date - Dec 24 , 2024 | 09:34 AM