Banks Closed: మార్చిలో 14 రోజులు బ్యాంకులకు సెలవు.. ఎప్పుడెప్పుడు అంటే..?
ABN, Publish Date - Feb 29 , 2024 | 04:18 PM
మార్చి నెలలో 14 రోజులు బ్యాంకులు పనిచేయవు. ఆదివారం, రెండు, నాలుగో శనివారంతో పాటు పండుగల నేపథ్యంలో రెండు వారాలు బ్యాంకులు మూసి ఉంటాయి. ముఖ్యమైన పని ఉన్న వారు, లావాదేవీలు జరిపే వారు సెలవులకు అనుగుణంగా తమ బ్యాంక్ పనులను చేసుకోవాల్సి ఉంటుంది.
మార్చి (March) నెలలో 14 రోజులు బ్యాంకులు (Banks) పనిచేయవు. ఆదివారం, రెండు, నాలుగో శనివారంతో పాటు పండగల నేపథ్యంలో రెండు వారాలు బ్యాంకులు మూసి ఉంటాయి. ముఖ్యమైన పని ఉన్న వారు, లావాదేవీలు జరిపే వారు సెలవులకు అనుగుణంగా తమ బ్యాంక్ (Bank) పనులను పెట్టుకుంటే సరిపోతుంది. ఆ లిస్ట్ చుద్దాం పదండి.
14 రోజులు సెలవు
మార్చి (March) నెలలో 31 రోజులు ఉన్నాయి. 14 రోజులు సెలవు పోతే 17 రోజులు బ్యాంకులు పనిచేస్తాయి. శివరాత్రి, హోలీ, గుడ్ ఫ్రైడే లాంటి పండుగులు మార్చి నెలలో వచ్చాయి. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సెలవు ప్రకటించాయి. మార్చి 1వ తేదీన మిజోరంలో సెలవు ఉండనుంది. అక్కడ చాప్చర్ కట్ అనే పండగ జరుపుకుంటారు. 3వ తేదీ ఆదివారం ఉంది. 8వ తేదీన శివరాత్రి పండగ ఉంది. ఢిల్లీ, బీహర్, రాజస్థాన్, తమిళనాడు, త్రిపుర, పశ్చిమ బెంగాల్, మిజోరం, అసోం, మణిపూర్, మేఘాలయ, సిక్కిం, నాగాలాండ్, ఇటానగర్, గోవాలో తప్ప మిగిలిన చోట్ల బ్యాంకులు పనిచేస్తాయి.
ఆన్ లైన్ బ్యాంకింగ్ సేవలు
మార్చి 9వ తేదీన రెండో శనివారం, 10వ తేదీన ఆదివారం, 17వ తేదీన ఆదివారం. 22వ తేదీన బీహర్‌లో బీహార్ దివాస్ జరుపుకుంటారు. మార్చి 23వ తేదీ నాలుగో శనివారం 24వ తేదీన ఆదివారం. 25వ తేదీన హోళి పండగ జరుపుకుంటారు. కర్ణాటక, ఒడిశా, తమిళనాడు, మణిపూర్, కేరళ, నాగాల్యాండ్, బీహర్, శ్రీగనర్ తప్ప మిగిలిన చోట్ల బ్యాంకులు పనిచేస్తాయి. 26వ తేదీన ఒడిశా, మణిపూర్, బీహర్‌లో హోలి పండగ సెలబ్రేట్ చేసుకుంటారు. సెలవు ఉంటుంది. 27వ తేదీన కూడా బీహర్‌లో జరుపుకుంటారు. 29వ తేదీన గుడ్ ఫ్రైడ్. త్రిపుర, అసోం, రాజస్థాన్, జమ్ము కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ తప్ప మిగిలిన చోట్ల బ్యాంకులు పనిచేస్తాయి. మార్చి 31వ తేదీ ఆదివారం వచ్చింది. ఆ 14 రోజులు బ్యాంకులు మాత్రమే మూసి వేసి ఉంటాయి. ఆన్ లైన్ బ్యాంకింగ్ సర్వీస్ అందుబాటులో ఉంటాయి. ఏటీఎంలు పనిచేస్తాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.
Updated Date - Mar 01 , 2024 | 11:06 AM