Inflation: పండుగల వేళ భారీ షాక్.. మరింత పెరగనున్న వంటనూనె ధరలు
ABN, Publish Date - Oct 12 , 2024 | 04:49 PM
దేశవ్యాప్తంగా ద్రవ్యోల్బణం మరోసారి తారా స్థాయికి చేరింది. సెప్టెంబర్ నెలలో ఆహార నూనెల దిగుమతి వార్షిక ప్రాతిపదికన 29 శాతం తగ్గి 10 లక్షల 64 వేల 499 టన్నులకు చేరుకుంది.
ఇంటర్నెట్ డెస్క్: దేశవ్యాప్తంగా ద్రవ్యోల్బణం మరోసారి తారా స్థాయికి చేరింది. సెప్టెంబర్ నెలలో ఆహార నూనెల దిగుమతి వార్షిక ప్రాతిపదికన 29 శాతం తగ్గి 10 లక్షల 64 వేల 499 టన్నులకు చేరుకుంది. క్రూడ్, రిఫైన్డ్ పామాయిల్ దిగుమతులు తక్కువగా ఉండటం వల్ల ఎడిబుల్ ఆయిల్ దిగుమతులు భారీగా తగ్గిపోయాయి. గతేడాది ఇదే నెలలో వంటనూనెల దిగుమతి 14 లక్షల 94 వేల 086 టన్నులు ఉన్నట్లు తెలుస్తోంది. సాల్వెంట్ ఎక్స్‌ట్రాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (SEA).. కూకింగ్ ఆయిల్ దిగుమతి డేటాను శుక్రవారం విడుదల చేసింది.
నూనెల దిగుమతి గత నెలలో 15 లక్షల 52 వేల 026 టన్నులతో పోలిస్తే 30 శాతం తగ్గి 10 లక్షల 87 వేల 489 టన్నులకు చేరుకుంది. నాన్-ఎడిబుల్ ఆయిల్స్ దిగుమతి వార్షిక ప్రాతిపదికన 57 వేల 940 టన్నుల నుంచి 22 వేల 990 టన్నులకు తగ్గిపోయింది. తద్వారా మార్కెట్లో వంట నూనె ధరలు భారీగా పెరిగాయి. ఈ మధ్యకాలంలోనే ఆయిల్ ధరలు లీటరుపై రూ.25కుపైగా పెరిగిన విషయం తెలిసిందే.
తగ్గే అవకాశమే లేదు..
ఎడిబుల్ ఆయిల్ విభాగంలో ముడి పామాయిల్ దిగుమతులు గత నెలలో 4 లక్షల 32 వేల 510 టన్నులకు తగ్గాయని, గత ఏడాది సెప్టెంబర్‌లో 7లక్షల 05 వేల 643 టన్నులుగా ఉన్నట్టు నివేదిక వెల్లడించింది. మరోవైపు శుద్ధి చేసిన పామాయిల్ దిగుమతి 1లక్ష 28 వేల 954 టన్నుల నుంచి 84 వేల 279 టన్నులకు, సన్‌ఫ్లవర్ క్రూడ్ ఆయిల్ దిగుమతి 3 లక్షల టన్నుల నుంచి 1 లక్ష 52 వేల 803 టన్నులకు తగ్గింది. జులై-ఆగస్టు మధ్య కాలంలో అధిక దిగుమతులు, డిమాండ్ లేకపోవడం వల్ల దిగుమతులు తగ్గుముఖం పట్టాయని ఎస్ఈఏ నివేదిక వివరించింది.
అలాంటి పరిస్థితుల్లో పోర్టులలో స్టాక్ పెరిగిపోయింది. దీంతో దిగుమతిదారులు అప్రమత్తం అయ్యారు. రిటైల్ మార్కెట్‌లో చమురు ధర 10 శాతం మేరకు పెరిగింది. ఆవనూనె ధరలో పెరుగుదల అత్యధికంగా కనిపిస్తోంది. సన్‌ఫ్లవర్, సోయాబీన్ నూనెల ధరలు కూడా ఇటీవల భారీగా పెరిగాయి.ఇంకోవైపు దేశవ్యాప్తంగా ఎడిబుల్ ఆయిల్‌కు డిమాండ్ భారీగా పెరుగుతోంది. ఈ నెలలో పామాయిల్ దిగుమతి 7 లక్షల టన్నులు దాటవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే వంటనూనె ధరలు తగ్గే అవకాశమే లేదని, ఇంకా పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు.
ఇదికూడా చదవండి: Viral Video: విద్యార్థులతో మసాజ్.. వీళ్లు టీచర్లేనా
ఇదికూడా చదవండి: Gaddar: తూప్రాన్ లిఫ్టు ఇరిగేషన్‌కు గద్దర్ పేరు
ఇదికూడా చదవండి: సురేఖ అంశంపై అధిష్ఠానం వివరణ కోరలేదు
ఇదికూడా చదవండి: Uttam: డిసెంబరులో ఎన్డీఎస్‌ఏ తుది నివేదిక!?
Read Latest Telangana News and National News
Updated Date - Oct 12 , 2024 | 04:49 PM