BSNL Subscriber Growth: బీఎస్ఎన్ఎల్కు కొత్తగా 55 లక్షల సబ్‌స్క్రైబర్లు.. ఈ సంస్థలకు మాత్రం షాకింగ్..
ABN, Publish Date - Dec 05 , 2024 | 01:44 PM
ప్రైవేట్ టెలికాం కంపెనీల టారిఫ్‌ల పెంపు తర్వాత ఆయా సంస్థలకు పెద్ద షాక్ తగిలిందని చెప్పవచ్చు. ఎందుకంటే దాదాపు 55 లక్షల మంది మొబైల్ వినియోగదారులు తమ నంబర్‌లను ప్రభుత్వ టెలికాం కంపెనీ అయిన BSNLకి మార్చుకున్నారు. ఆ విశేషాలేంటో ఇక్కడ చుద్దాం.
జియో, ఎయిర్ టెల్, వీఐ చేసిన పెద్ద పొరపాటు వల్ల ప్రస్తుతం ప్రభుత్వ టెలికాం సంస్థ అయిన BSNL భారీగా ప్రయోజనం పొందుతోంది. ఎందుకంటే జూలై 2024 నుంచి ఈ ప్రైవేట్ టెలికాం కంపెనీలు నెలవారీ రీఛార్జ్ ప్లాన్‌లు భారీగా పెంచేశాయి. దీంతో అనేక మంది వినియోగదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తూ... భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) వైపు మొగ్గు చూపారు. డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (DoT) తాజా డేటా ప్రకారం అక్టోబర్ 2024 నాటికి దాదాపు 55 లక్షల మొబైల్ వినియోగదారులు తమ నంబర్‌లను ప్రభుత్వ టెలికాం సంస్థ BSNLకి పోర్ట్ చేసుకున్నారు.
ఈ కంపెనీకి భారీ నష్టం
ఈ తాజా TRAI రిపోర్ట్ చూసిన ప్రైవేట్ టెలికాం కంపెనీలు షాక్ అయ్యాయని చెప్పవచ్చు. BSNL తన నెట్‌వర్క్‌కు గత 4 నెలల్లో ఈ రికార్డు వినియోగదారులను దక్కించుకుంది. ఇదే సమయంలో భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ మినహా మరే ఇతర టెలికాం ఆపరేటర్ల వినియోగదారుల సంఖ్య పెరుగకపోవడం విశేషం. మరోవైపు ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో అత్యధిక నష్టాన్ని చవిచూసింది. దేశంలోని అతిపెద్ద టెలికాం కంపెనీగా ఉన్న ఈ సంస్థ ఏకంగా 1 కోటి మందికి పైగా వినియోగదారులను కోల్పోయింది.
65 లక్షల మందిలో
ప్రభుత్వ టెలికాం సంస్థ ఈ నాలుగు నెలల్లో మొత్తం 6.5 మిలియన్లు అంటే 65 లక్షల మంది కొత్త వినియోగదారులను చేర్చుకుంది. వీరిలో 55 లక్షల మంది వినియోగదారులు MNP ద్వారా BSNL నెట్‌వర్క్‌కు కనెక్ట్ అయ్యారని BSNL తెలుపడం విశేషం. ఈ ప్రైవేట్ టెలికాం కంపెనీలు జూలైలో తమ మొబైల్ రీఛార్జ్ ప్లాన్‌లను పెంచాయి. ప్రైవేట్ కంపెనీలు ఒక్కో యూజర్‌కు సగటు ఛార్జీలను (ARPU) పెంచడానికి మొబైల్ టారిఫ్‌లను 25% వరకు పెంచేశాయి. అప్పటికే ద్రవ్యోల్బణంతో సతమతమవుతున్న ప్రజానీకం, రేట్లను పెంచడంతో చిర్రెత్తిపోయారు. దీంతో అనేక మంది ప్రత్యమ్నాయ మార్గమైన బీఎస్‌ఎన్‌ఎల్‌కు పోర్ట్ అయ్యారు.
త్వరలో 5జీ కూడా..
పూర్తిగా 4జీ కనెక్టివిటీ లేకపోయినా కూడా లక్షల మంది వినియోగదారులు BSNL వైపు మొగ్గు చూపడం విశేషం. ఇదే సమయంలో BSNL కూడా తన నెట్‌వర్క్ విస్తరణను వేగంగా చేయాలని భావిస్తోంది. భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ భారతదేశం అంతటా వచ్చే ఏడాది జూన్ నాటికి ఏకకాలంలో 4G సేవలను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. కంపెనీ ఇటీవల దాదాపు 51 వేల కొత్త 4జీ మొబైల్ టవర్లను ఇన్‌స్టాల్ చేసింది.
భారతదేశం అంతటా
వచ్చే ఏడాది జూన్ నాటికి మరో లక్ష 4జీ మొబైల్ టవర్లను ఏర్పాటు చేయాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. వచ్చే ఏడాది జూన్ నాటికి భారతదేశం అంతటా వాణిజ్యపరంగా BSNL 4G సేవలను ప్రారంభించనున్నట్లు కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఇటీవల తెలిపారు. BSNL ఇప్పుడు 5G సేవను కూడా పరీక్షిస్తోందని, ఇది కూడా త్వరలోనే అందుబాటులోకి వస్తుందని కేంద్ర మంత్రి అన్నారు.
ఇవి కూడా చదవండి:
Bitcoin Investment: ఇది కదా లక్కంటే.. అప్పటి 100 రూపాయల పెట్టుబడి, ఇప్పుడు 1.7 కోట్లు
Bitcoin: మొదటిసారి లక్ష డాలర్లు దాటిన బిట్‌కాయిన్.. కారణమిదేనా..
Personal Finance: మీ అప్పులను ఈ 7 మార్గాల ద్వారా ఈజీగా తీర్చుకోండి..
Recharge Plans: 5 నెలల చౌక ప్లాన్ ప్రకటించిన BSNL.. మిగతా వాటితో పోలిస్తే ధర..
Bank Holidays: ఈ నెలలో 17 రోజులు బ్యాంకులు క్లోజ్.. ఎప్పుడెప్పుడంటే..
Personal Finance: నెలకు రూ. 5 వేలు సేవ్ చేస్తే.. రూ. 2 కోట్ల కోసం ఎన్నేళ్లు కట్టాలి..
Read More Business News and Latest Telugu News
Updated Date - Dec 05 , 2024 | 01:47 PM