ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

BSNL: బీఎస్ఎన్ఎల్ బంపరాఫర్.. జియో, ఎయిర్‌టెల్‌కు చుక్కలే..

ABN, Publish Date - Aug 10 , 2024 | 12:22 PM

జులైలో ప్రముఖ టెలికాం కంపెనీలు రీఛార్జ్ ప్లాన్ల ధరలను అమాంతం పెంచేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే జియోపై పెద్ద ఎత్తున మీమ్స్, ట్రోల్స్ వెల్లువెత్తాయి. అంబానీ తన కుమారుడి వివాహ ఖర్చంతా తమ నెత్తిపై వేస్తే ఎలాగని యూజర్లు మొత్తుకున్నారు.

న్యూఢిల్లీ: జూలైలో ప్రముఖ టెలికాం కంపెనీలు రీఛార్జ్ ప్లాన్ల ధరలను అమాంతం పెంచేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే జియోపై పెద్ద ఎత్తున మీమ్స్, ట్రోల్స్ వెల్లువెత్తాయి. అంబానీ తన కుమారుడి వివాహ ఖర్చంతా తమ నెత్తిపై వేస్తే ఎలాగని యూజర్లు మొత్తుకున్నారు. ఇక జియో బాటలోనే ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా కూడా టారిఫ్ ధరలు పెంచేశాయి. దీంతో జనాలంతా బీఎస్ఎన్‌ఎలే బెటర్ అనుకుంటున్నారు. ఈ క్రమంలోనే పోర్ట్ ఆప్షన్ ఎంచుకుని దేశవ్యాప్తంగా 2.75 మిలియన్ల మంది బీఎస్ఎన్ఎల్కు మారిపోయారు. మంచి తరుణం మించిన దొరకదనుకున్న బీఎస్ఎన్ఎల్ మరింత మంది యూజర్లను ఆకర్షించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. అతి తక్కువ ధరలకే రిచార్జ్ ప్లాన్లను అందిస్తూ జియో, ఎయిర్‌టెల్, వీఐ వంటి సంస్థలకు చుక్కలు చూపిస్తోంది.


ప్రస్తుతం రూ.100 కంటే తక్కువ ధరతో అనేక రీచార్జ్ ఆప్షన్స్‌ను బీఎస్ఎన్ఎల్ అందుబాటులోకి తీసుకొచ్చింది. దేశ వ్యాప్తంగా ఉన్న మిలియన్ల మంది వినియోగదారులకు అతి తక్కువ ధరలకు లాంగ్ వేలిడిటీని అందిస్తోంది. వాస్తవానికి ప్రైవేట్ టెలికాం కంపెనీలతో పోలిస్తే బీఎస్ఎన్ఎల్‌కు వినియోగదారులు చాలా తక్కువ మంది ఉన్నారు. అయినా కూడా బీఎస్ఎన్ఎల్ ఏమాత్రం తగ్గడం లేదు. షార్ట్ టర్మ్ నుంచి అధిక ధరల ఆప్షన్స్‌ను అందిస్తూ ప్రైవేటు సంస్థలతో పోటీ పడుతూనే ఉంది. కేవలం రూ.91 తో రీచార్జ్ చేయించుకుంటే చాలు 90 రోజుల పాటు వేలిడిటీ వచ్చేస్తుంది. ఇది వాస్తవానికి బీఎస్ఎన్ఎల్ అందిస్తున్న బంపర్ ఆఫర్ అనే చెప్పాలి. ఇంత తక్కువ ధరకు 90 రోజుల వ్యాలిడిటీని ఏ సంస్థ కూడా అందించడం లేదు. దీంతో ఈ రూ.91 ప్లాన్ ప్రతి ఒక్కరినీ ఆకర్షిస్తోంది.


తక్కువ ఖర్చుతో ఎక్కువ కాలం పాటు తమ సిమ్‌ను యాక్టివ్‌గా ఉంచాలనుకునే వినియోగదారులు ఈ ప్లాన్ పట్ల బాగా ఆకర్షితులవుతున్నారు. ఇది మాత్రమే కాకుండా నిమిషానికి 15 పైసలకే వాయిస్ కాల్స్, ఒక పైసాకే ఒక ఎంబీ డేటా, 25 పైసలకే ఎస్ఎమ్మెస్ వంటివి బీఎస్ఎన్ఎల్ ఆఫర్ చేస్తోంది. కాల్స్ మాత్రమే లేదంటే డేటా లేదంటే ఎస్ఎమ్మెస్ కోసం టాక్ టైమ్ వోచర్ లేదా డేటా వోచర్‌ను విడివిడిగా కొనుగోలు చేయాలి. ఇవి చాలా సరసమైన ధరలకు కూడా అందుబాటులో ఉంటాయి. ఇక తాజాగా107 రూపాయల ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ను సైతం బీఎస్ఎన్ఎల్ అందుబాటులోకి తీసుకొచ్చింది. 107 రూపాయలతో రీఛార్జ్ చేసుకుంటే 35 రోజుల వేలిడిటీతో 3జీబీ 4జీ డేటాతో పాటు రోజుకు 200 నిమిషాల వాయిస్ కాల్స్ ఫ్రీగా చేసుకోవచ్చు.

Updated Date - Aug 10 , 2024 | 12:22 PM

Advertising
Advertising
<