Budget 2024: అసలు బడ్జెట్ ఎలా తయారు చేస్తారు, దీని లక్ష్యం ఏమిటి?
ABN, Publish Date - Jan 26 , 2024 | 11:43 AM
మన దేశ బడ్జెట్‌ను ఎలా తయారు చేస్తారు. దాని ఉద్దేశం ఏమిటి, దీనిని ఎందుకోసం తయారు చేస్తారనే విషయాలు అనేక మందికి తెలియదు. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం. ఫిబ్రవరి 1న దేశ బడ్జెట్‌ను పార్లమెంటులో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమర్పించనున్నారు. అయితే ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అస్థిరత పరిస్థితులు, దేశంలో ద్రవ్యోల్బణం కొనసాగుతున్న వేళ అందరి దృష్టి ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టే బడ్జెట్‌పైనే ఉంది.
మన దేశ బడ్జెట్‌ను ఎలా తయారు చేస్తారు. దాని ఉద్దేశం ఏమిటి, దీనిని ఎందుకోసం తయారు చేస్తారనే విషయాలు అనేక మందికి తెలియదు. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం. ఫిబ్రవరి 1న దేశ బడ్జెట్‌ను పార్లమెంటులో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమర్పించనున్నారు. అయితే ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అస్థిరత పరిస్థితులు, దేశంలో ద్రవ్యోల్బణం కొనసాగుతున్న వేళ అందరి దృష్టి ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టే బడ్జెట్(Budget 2024)పైనే ఉంది.
ఖర్చుల అంచనా ఎలా ?
అయితే ప్రతి ఏటా బడ్జెట్ రూపకల్పనలో భాగంగా అసలు ఖర్చులను ఎలా అంచనా వేస్తారో ఇప్పుడు చుద్దాం. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలతో ప్రీ బడ్జెట్ సమావేశాలు ఇప్పటికే నిర్వహించారు. బడ్జెట్ సన్నాహాల్లో భాగంగా ఈ సమావేశాలు జరిపారు. బడ్జెట్ తయారీలో భాగంగా రెవెన్యూ శాఖ, పరిశ్రమల సంఘాలు, వాణిజ్య సంఘాలు, రైతు సంఘాలు, కార్మిక సంఘాలు, ఆర్థికవేత్తలు మొదలైన వివిధ రంగాలకు చెందిన వారు దీనిలో ఉన్నారు.
బడ్జెట్ తయారీలో మొదటి భాగంలో, ఆర్థిక వ్యవహారాల శాఖ బడ్జెట్ విభాగం అన్ని మంత్రిత్వ శాఖలు, రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాలు, స్వయం ప్రతిపత్త సంస్థలు, రక్షణ దళాలకు సర్క్యూలర్‌లను జారీ చేస్తుంది. సర్క్యూలర్‌లో ఆర్థిక సంవత్సరానికి ఖర్చులను అంచనా వేయాలని, అవసరమైన మొత్తాన్ని అందించాలని కోరతారు. ఆ తర్వాత వివిధ శాఖల మధ్య మొత్తానికి సంబంధించి చర్చలు జరుగుతాయి. దీని తర్వాత ఏ శాఖకు ఎంత మొత్తం కేటాయించాలనే దానిపై చర్చ సాగుతోంది. దీన్ని నిర్ణయించేందుకు ఆర్థిక శాఖ ఇతర మంత్రిత్వ శాఖలతో సమావేశమై బ్లూప్రింట్‌ను సిద్ధం చేస్తుంది. అనంతరం సమావేశంలో నిధుల కేటాయింపు కోసం అన్ని మంత్రిత్వ శాఖల ఉన్నతాధికారులు ఆర్థిక శాఖతో చర్చిస్తారు.
ప్రభుత్వానికి ఆదాయమెలా వస్తుంది?
ప్రభుత్వానికి ఐదు ప్రధాన అంశాల ద్వారా ఆదాయం సమకూరుతుంది. వాటిలో వస్తు సేవల పన్ను (GST), ఆదాయపు పన్ను, కార్పొరేషన్ పన్ను, పన్నుయేతర ఆదాయాలు, ఎక్సైజ్ సుంకాలు, జరిమానాలు, డివిడెండ్ ఆదాయం, ఇచ్చిన రుణాలపై వడ్డీ మొదలైనవి ఉంటాయి. అయితే ప్రభుత్వానికి వచ్చే ఆదాయంలో దాదాపు 90 శాతం జీఎస్టీ, ఆదాయపు పన్ను నుంచే లభిస్తుంది. 2021-22లో మొత్తం పన్ను రాబడిలో 57 శాతం GST నుంచే వచ్చింది.
బడ్జెట్ లక్ష్యం ఏమిటి?
-ఆదాయ వనరులను పెంచుకుంటూ వివిధ పథకాలకు నిధులు విడుదల చేయడం
-దేశ ఆర్థిక వృద్ధి రేటును వేగవంతం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయడం
-దేశ పౌరుల ఆర్థిక స్థితిని మెరుగుపరచడంతోపాటు పేదరికం, నిరుద్యోగాన్ని తగ్గించడానికి ప్రణాళికలు రూపొందించడం
-దేశంలో మౌలిక సదుపాయాల కల్పనకు నిధుల విడుదల, ఇందులో రైలు, విద్యుత్, రోడ్లు మొదలైన రంగాలు ఉంటాయి
-ద్రవ్యలోటును తగ్గించేందుకు ఆర్థిక ప్రణాళికలు సిద్ధం చేయడం
దేశ మొదటి బడ్జెట్ ఎప్పుడు?
స్వాతంత్ర్యం తర్వాత భారతదేశం మొదటి బడ్జెట్ నవంబర్ 26, 1947న సమర్పించబడింది. దీనిని దేశ మొదటి ఆర్థిక మంత్రి షణ్ముఖం చెట్టి ప్రవేశపెట్టారు. దేశంలో రిపబ్లిక్ ఏర్పాటైన తర్వాత 1950 ఫిబ్రవరి 28న తొలి కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. బ్రిటీష్ పాలనలో భారతదేశం మొదటి బడ్జెట్ ఏప్రిల్ 7, 1860న సమర్పించబడింది. ఈ బడ్జెట్‌ను బ్రిటిష్ ప్రభుత్వ ఆర్థిక మంత్రి జేమ్స్ విల్సన్ సమర్పించారు.
Updated Date - Jan 26 , 2024 | 01:45 PM