ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Budget 2024: బడ్జెట్ బ్రీఫ్‌కేస్ ఎందుకు రెడ్ కలర్లో ఉంటుంది?

ABN, Publish Date - Jan 26 , 2024 | 11:21 AM

కేంద్ర బడ్జెట్ అనగానే మనకు కేంద్ర ఆర్థిక మంత్రి, ఆ తర్వాత బ్రీఫ్‌కేస్ గుర్తుకొస్తుంది. దేశ ఆర్థిక వ్యవస్థ బడ్జెట్ మొత్తం ఆ బ్రీఫ్‌కేసులోనే ఉందని చెబుతుంటారు. అయితే గతంలో బడ్జెట్ ప్రవేశపెట్టిన బ్రీఫ్‌కేస్ విధానం నుంచి ప్రస్తుతం ట్యాబ్ స్థాయికి ఎలా వచ్చింది. దాని సంగతులేంటనేది ఇప్పుడు చుద్దాం.

కేంద్ర బడ్జెట్ అనగానే మనకు కేంద్ర ఆర్థిక మంత్రి, ఆ తర్వాత బ్రీఫ్‌కేస్ గుర్తుకొస్తుంది. దేశ ఆర్థిక వ్యవస్థ బడ్జెట్ మొత్తం ఆ బ్రీఫ్‌కేసులోనే ఉందని చెబుతుంటారు. అయితే గతంలో బడ్జెట్ ప్రవేశపెట్టిన బ్రీఫ్‌కేస్ విధానం నుంచి ప్రస్తుతం ట్యాబ్ స్థాయికి ఎలా వచ్చింది. దాని సంగతులేంటనేది ఇప్పుడు చుద్దాం. కేంద్ర బడ్జెట్ 2024 సంవత్సరానికి ఫిబ్రవరి 1న సమర్పించనున్నారు. ప్రతి సంవత్సరం దేశ ఆర్థిక మంత్రి ఈ బడ్జెట్‌ను సమర్పిస్తారు. ప్రస్తుతం మన దేశ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ ఏడాది ఆరోసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ బడ్జెట్(Budget 2024) ద్వారా దేశ ఆర్థిక మంత్రి ఒక ఆర్థిక సంవత్సరపు లెక్కలు, అంచనాలను ప్రకటిస్తారు. అయితే స్వాతంత్య్రానికి పూర్వం నుంచే బడ్జెట్‌ను ప్రవేశపెట్టే సంప్రదాయం నేటికీ కొనసాగుతోంది.


అయితే బడ్జెట్ పత్రాలను ఉంచడానికి బ్రీఫ్‌కేస్‌తో ఎప్పటికప్పుడు అనేక రకాల ప్రయోగాలు జరిగాయి. ఇది బ్రీఫ్‌కేస్ నుంచి క్రమంగా బ్యాగ్‌కి తర్వాత బ్యాగ్ నుంచి లెడ్జర్‌కి లెడ్జర్ నుంచి ట్యాబ్‌కు రూపాంతరం చెందింది. దీని డిజైన్ మారింది. కానీ రంగు మాత్రం ఎరుపు రంగులోనే ఉంటుంది. అసలు బడ్జెట్ బ్రీఫ్‌కేస్ బ్యాగ్ లేదా లెడ్జర్‌కి ఎరుపు రంగుకు మధ్య సంబంధం ఏమిటో ఇప్పుడు చుద్దాం. 1860లో బడ్జెట్ బ్రీఫ్‌కేస్‌ను మొదటిసారిగా ఎరుపు రంగును ఉపయోగించారు.

ఆ సమయంలో బ్రిటీష్ ఛాన్స్‌లర్ గ్లాడ్‌స్టన్ ఆర్థిక పత్రాలను తీసుకెళ్లడానికి ఒక ప్రత్యేక బ్యాగ్‌ను సిద్ధం చేశారు. ఆయన చెక్క పెట్టెకు ఎర్రటి తోలును ఉపయోగించారు. దానిపై బ్రిటిష్ రాణి మోనోగ్రామ్ చెక్కి ఉంది. ఆ లెదర్ బ్యాగ్‌కి గ్లాడ్‌స్టన్ బాక్స్ అని పేరు పెట్టారు. ఆ సమయంలో ఎరుపు రంగు పెట్టె ప్రజల దృష్టిని ఆకర్షించింది. ఆ తర్వాత అతని ప్రయోగం చాలా మందికి నచ్చింది. దీని తర్వాత క్రమంగా బడ్జెట్ బ్రీఫ్‌కేస్‌లు లేదా బ్యాగ్‌లకు ఎరుపు రంగును ఉపయోగించడం ప్రారంభించారు. ఎరుపు రంగును ఇష్టపడటానికి ఒక కారణం ఏమిటంటే ఈ రంగు ప్రజల దృష్టిని దూరం నుంచి ఆకర్షిస్తుంది. దీంతోపాటు ఆ బ్యాగ్‌లో ముఖ్యమైన పత్రాలు ఉంటాయని కూడా సూచికగా ఉంటుందని ఎక్కువగా వినియోగిస్తున్నారు.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: Budget 2024: బడ్జెట్‌‌ను ప్రధాన మంత్రులు కూడా ప్రవేశపెట్టారు..మీకు ఈ విషయాలు తెలుసా?

ఇక బడ్జెట్ బ్రీఫ్‌కేస్ లేదా బ్యాగ్ ఎప్పుడూ ఎరుపు రంగులో ఉండేదని కాదు. స్వాతంత్ర్యం తర్వాత దానిలో ఎప్పటికప్పుడు అనేక ప్రయోగాలు జరిగాయి. స్వాతంత్య్రానంతరం తొలి బడ్జెట్‌ను మొదటి ఆర్థిక మంత్రి షణ్ముఖం శెట్టి 26 నవంబర్ 1947న సమర్పించారు. బ్రిటీష్ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ అతను ఎర్రటి తోలు బ్రీఫ్‌కేస్‌ను ఉపయోగించాడు. 1958లో దేశ ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ ఎరుపు రంగు బ్రీఫ్‌కేస్‌లో కాకుండా నల్లటి బ్రీఫ్‌కేస్‌లో కూడా బడ్జెట్‌ను సమర్పించారు.

దీని తర్వాత 1991లో మన్మోహన్‌సింగ్‌ బడ్జెట్‌ ప్రవేశపెట్టినప్పుడు బ్యాగ్‌ రంగును ఎరుపు రంగులోకి మార్చారు. దీని తరువాత 1998-99 సమయంలో యశ్వంత్ సింగ్ నల్లటి బకిల్స్, పట్టీలతో కూడిన బ్యాగ్‌లో బడ్జెట్‌ను సమర్పించారు. మోదీ ప్రభుత్వం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తొలి బడ్జెట్‌ను ప్రవేశపెట్టినప్పుడు ఆమె లెదర్ బ్రీఫ్‌కేస్ లేదా బ్యాగ్ సంప్రదాయాన్ని పక్కనపెట్టి బడ్జెట్ పత్రాలను ఎరుపు రంగు లెడ్జర్‌లో తీసుకువచ్చారు. ఆ తర్వాత నిర్మలా సీతారామన్ 2021 బడ్జెట్‌ను పేపర్‌లెస్‌లో మొదటిసారిగా ఎరుపు రంగు స్లీవ్‌లో టాబ్లెట్‌ని తీసుకువెళ్లి చదివి వినిపించారు. అయితే ఆ టాబ్లెట్ మేడ్ ఇన్ ఇండియా డివైజ్ కావడం విశేషం.

Updated Date - Jan 26 , 2024 | 01:46 PM

Advertising
Advertising