ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Business: ఇది యాపారం.. 18రోజుల్లో 48లక్షల పెళ్లిళ్లు.. వీటి బిజినెస్ లెక్క తెలిస్తే..

ABN, Publish Date - Nov 12 , 2024 | 03:12 PM

భారతదేశంలో ఈ రోజు నుండి పెళ్లిళ్ళ హడావిడి మొదలు కాబోతోంది. దేశ వ్యాప్తంగా సుమారు 48లక్షల పెళ్లిళ్ళు జరుగుతాయని అంటున్నారు. ఈ పెళ్లిళ్ళ కారణంగా జరిగే మార్కెట్ విలువ అక్షరాలా

Marriage season

పెళ్లి.. భారతీయులు ఎంతో గొప్పగా చేసే కార్యం. చాలామంది పెళ్లిని తమ తాహతుకు మించి చేస్తుంటారు. లక్షలాది రూపాయల నుండి కోట్లాది రూపాయలు మంచి నీళ్లలా ఖర్చై పోతుంది. పెళ్లి బట్టలు, బంగారం కొనుగోలు, వంటలు.. అతిథులకు కానుకలు.. ఫంక్షన్ హాల్ అద్దె.. ఇవి కాకుండా కట్నం, ఆడపడుచు లాంఛనాలు.. ఓయబ్బో.. పెళ్లి జరిగే ప్రతి ఇల్లు ఓ ఉత్సవాన్ని తలపిస్తుంది. అయితే ఇవన్నీ కూడా డబ్బు మీదనే ఆధారపడి ఉంటాయి. భారతదేశంలో ఈ రోజు నుండి పెళ్లిళ్ళ హడావిడి మొదలు కాబోతోంది. దేశ వ్యాప్తంగా సుమారు 48లక్షల పెళ్లిళ్ళు జరుగుతాయని అంటున్నారు. ఈ పెళ్లిళ్ళ కారణంగా జరిగే మార్కెట్ విలువ అక్షరాలా రూ.6లక్షల కోట్లు.. దీని గురించి మరింత వివరంగా తెలుసుకుంటే..

ఈ ఒక్క పండు తింటుంటే చాలు.. కంటి శుక్లానికి చెక్ పెట్టవచ్చట..


భారతదేశంలో వివాహాల ఖర్చు చాలా ఎక్కువగా ఉంటుంది. పెళ్లిళ్ల సీజన్ లో మార్కెట్లు చాలా సందడిగా ఉంటాయి. నవంబర్ 12 వ తేదీ నుండి పెళ్లిళ్ల సందడి మొదలు కానుంది. ఈ రోజు నుండి 35రోజులలో దేశవ్యాప్తంగా 48లక్షల జంటలు వివాహం పేరుతో ఒకటి కానున్నారు. అదే సమయంలో ఈ పెళ్ళిళ్ల కారణంగా రూ.6లక్షల కోట్ల వ్యాపారం జరుగుతుందని వ్యాపర నిపుణులు అంచనా వేస్తున్నారు. ఏ సెక్టార్ లో ఎంత ఖర్చు జరుగుతుంది? దేనికి ఎంత ఖర్చవుతుందంటే..

నవంబర్ 12వ తేదీ నుండి డిసెంబర్ 16వ తేదీ వరకు పెళ్లిళ్ల సీజన్ నడుస్తుంది. ఈ ఒకటిన్నర నెలలో పెళ్ళి ముహూర్తాలు ఉన్న రోజులు 18. నవంబర్ లో.. 12, 13, 17, 18, 22,23,25, 26, 28, 29 తేదీలలో పెళ్లి ముహూర్తాలు ఉన్నాయి. ఇక డిసెంబర్ నెలలో 4, 5, 9, 10, 11, 14, 15, 16 వరకు పెళ్లి ముహూర్తాలు ఉన్నాయి.

కార్తీక పౌర్ణమి రోజు ఈ పనులు చేస్తే దైవ కృప ఖాయం..


గత ఏడాది కంటే ఈ ఏడాది పెళ్లిళ్ల సీజనల్ లో వ్యాపారం ఎక్కువ కానుందట. గత సీజన్ లో 35లక్షల పెళ్లిళ్లు జరగగా.. వీటి నిర్వాహణకు గానూ రూ. 4.25లక్షల కోట్ల ఆదాయం వచ్చిందట. ఈ సారి ఒక్క ఢిల్లీ లోనే 4.5లక్షల పెళ్లిళ్లు జరగనున్నాయట. ఈ పెళ్లిళ్ల నిర్వహణకు రూ. 1.5లక్షల కోట్ల వ్యాపారం జరుగుతుందని అంటున్నారు.

పెళ్ళి ఖర్చులో 10శాతం దుస్తుల కొనుగోలుకు, 15శాతం ఆభరణాలకు, 5శాతం ఎలక్ట్రానిక్స్ ఉపకరణాలకు, కిరాణా సామాగ్రి కి 5శాతం, కూరగాయలకు 4శాతం, ఇతర వస్తువులపై 6శాతం ఖర్చు ఉంటుందట. ఇవి కాకుండా ఫంక్షన్ హాల్, హోటల్ కి 5శాతం, ఈవెంట్ మేనేజ్మెంట్ కు 3శాతం, టెంట్ డెకరేషన్ కు 10శాతం, క్యాటరింగ్ సర్వీస్ కు 10శాతం, ట్రాన్స్ఫోర్ట్, టాక్సీ సర్వీస్ వంటివి 3శాతం, ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీ కోసం 2శాతం ఖర్తులు ఉంటాయని అంటున్నారు. ఇన్ని ఖర్చుల మధ్య భారతీయ పెళ్లిళ్లు 18 రోజులలో రూ.6లక్షల కోట్ల వ్యాపారాన్ని కలిగి ఉంటాయి.

ఇవి కూడా చదవండి..

Ayurveda Vs Korean: ఆయుర్వేద చర్మ సంరక్షణ, కొరియన్ చర్మ సంరక్షణ.. రెండింటిలో ఏది ఎఫెక్ట్ అంటే..

Health Tips: వంటల్లో పచ్చ కర్పూరం ఎందుకు జోడిస్తారు? ఇది ఆరోగ్యానికి ఎంతవరకు మంచిదంటే..

మరిన్ని బిజినెస్ వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Nov 12 , 2024 | 03:22 PM