ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

BSNL: బీఎస్ఎన్ఎల్ నుంచి కొత్త అప్‌డేట్.. స్పామ్ కాల్స్ వచ్చాయనుకో

ABN, Publish Date - Oct 06 , 2024 | 02:22 PM

ఇటివల మీరు BSNL నెట్‌వర్క్‌కు మారిన తర్వాత మీకు స్పామ్ కాల్స్ ఎక్కువయ్యాయా. అయినా కూడా టెంన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ అంశంపై మీరు సంస్థకు ఫిర్యాదు చేయవచ్చు. అది ఎలా అనేది ఇక్కడ తెలుసుకుందాం.

BSNL updates

ఇటీవల Jio, Airtel, Vi వంటి ప్రైవేట్ టెలికాం కంపెనీలు తమ టారిఫ్‌లను పెంచినట్లు ప్రకటించాయి. జూలై 3న ఈ కంపెనీలు తమ రీఛార్జ్ ప్లాన్‌ల ధరలను 15 శాతం వరకు పెంచుతున్నట్లు తెలిపాయి. ఈ క్రమంలోనే చాలా మంది వినియోగదారులు తమ నెట్‌వర్క్‌ని మార్చుకుంటున్నారు. ప్రతి నెలా వేలాది మంది వినియోగదారులు BSNL వైపు మొగ్గు చూపుతున్నారు. బీఎస్‌ఎన్‌ఎల్‌లో తక్కువ ఛార్జీలు ఉన్న క్రమంలో దీనివైపు అనేక మంది ఆసక్తి చూపిస్తున్నారు. అంతేకాదు ఇదే సమయంలో దేశవ్యాప్తంగా BSNL 4G సేవలను త్వరగా తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తుంది. దీంతోపాటు 5G రోల్‌అవుట్‌ కోసం నిరంతరం సిద్ధమవుతోంది.


స్పామ్ కాల్స్

ఈ నేపథ్యంలోనే BSNL స్పామ్ కాల్‌ల నుంచి వినియోగదారులను రక్షించడానికి కంపెనీ ఇప్పుడు ప్రత్యేక సన్నాహాలు చేసింది. మీరు మీ BSNL నంబర్‌కు స్పామ్ కాల్స్, మెసేజ్‌లను పొందుతున్నట్లయితే చింతించాల్సిన అవసరం లేదు. ఈ క్రమంలో మీ కోసం కంపెనీ ఒక సులభమైన మార్గాన్ని ప్రవేశపెట్టింది. దీని ద్వారా మీరు ఇబ్బంది పడే సందేశాల నుంచి దూరంగా ఉండవచ్చు. కొత్త, ఇప్పటికే ఉన్న వినియోగదారులు ఈ ప్రభుత్వ సంస్థ సేవలను వినియోగించుకోవచ్చు.


రక్షించుకోవచ్చు

ఈ క్రమంలో మీరు స్పామ్‌ కాల్స్ ఆపడానికి, మెరుగైన సేవలను పొందడానికి BSNLకి ఫిర్యాదు చేయవచ్చు. ప్రస్తుత కాలంలో అనేక ఫేక్ మెసేజ్‌ల వల్ల పలువురు మోసపోతున్న కేసులు వెలుగులోకి వస్తున్నాయి. ప్రతి రోజు కూడా సైబర్ మోసాల బారిన పడే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో మీకు కూడా ఇలాంటి ఇబ్బందులు తలెత్తితే ఫిర్యాదు చేయడం ద్వారా మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు. ఎలా ఫిర్యాదు చేయాలో ఇక్కడ తెలుసుకుందాం.


BSNL సెల్ఫ్‌కేర్ యాప్ ద్వారా ఎలా ఫిర్యాదు చేయాలంటే

  • ముందుగా మీ ఫోన్‌లో BSNL సెల్ఫ్‌కేర్ యాప్‌ని ఇన్ స్టాల్ చేయండి

  • ఆ తర్వాత హోమ్ స్క్రీన్ ఎగువన ఎడమ మూలలో మూడు పంక్తులతో ఉన్న మెను చిహ్నాంపై క్లిక్ చేయండి

  • తర్వాత క్రిందికి స్క్రోల్ చేసి "ఫిర్యాదు, ప్రాధాన్యత" ఎంపికను ఎంచుకోండి

  • ఆపై కుడి వైపున ఉన్న మూడు-లైన్ మెనుని నొక్కండి

  • ఆ క్రమంలో కొత్త ఫిర్యాదుపై క్లిక్ చేయండి

  • మీరు SMS లేదా వాయిస్ కాల్ మధ్య దేనినైనా ఎంచుకోవాలి

  • ఫిర్యాదు గురించి అన్ని వివరాలను అందించాలి

  • మొత్తం సమాచారాన్ని పూరించిన తర్వాత మీరు "సమర్పించు" బటన్‌పై క్లిక్ చేయండి

  • అంతే! ఇప్పుడు మీ ఫిర్యాదు నమోదు చేయబడింది. BSNL దీనిపై త్వరలో చర్యలు తీసుకుంటుంది


ఇవి కూడా చదవండి:

IRCTC: నవరాత్రుల సందర్భంగా స్పెషల్ టూర్ ప్యాకేజీ.. తక్కువ ధరల్లో సందర్శించండి


Online Shopping Tips: పండుగల సీజన్‌లో ఆన్‌లైన్‌ షాపింగ్ చేస్తున్నారా.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి

SIP Investment: చిరు ఉద్యోగస్తులకు గుడ్‌ న్యూస్.. రూ.99 నుంచే మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు

IRCTC: పండుగల సందర్భంగా స్పెషల్ టూర్ ప్యాకేజీ.. తక్కువ ధరకే ప్రసిద్ధ ఆలయాల సందర్శన


Read More Business News and Latest Telugu News

Updated Date - Oct 06 , 2024 | 02:30 PM