ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

7th Pay Commission: ఉద్యోగులు, పెన్షనర్లకు త్వరలో గుడ్ న్యూస్.. ఇకపై జీతాలు ఏకంగా..

ABN, Publish Date - Aug 24 , 2024 | 01:33 PM

పండుగ సీజన్‌లకు ముందు ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు కేంద్ర ప్రభుత్వం నుంచి శుభవార్త అందుకోనున్నారు. మరికొన్ని రోజుల్లో 7వ వేతన సంఘం డియర్‌నెస్ అలవెన్స్(dearness allowance), డియర్‌నెస్ రిలీఫ్‌ల(DR) పెంపు గురించి కీలక ప్రకటన చేయనుంది. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.

7th Pay Commission wages

రానున్న పండుగ సీజన్‌లలో ఉద్యోగులకు(employees), పెన్షనర్లకు కేంద్ర ప్రభుత్వం(central government) శుభవార్త అందించనుంది. అవును మీరు విన్నది నిజమే. ఇకపై ఉద్యోగుల జీతాలతోపాటు పెన్షనర్ల మొత్తం కూడా పెరగనుంది. అయితే మరికొన్ని రోజుల్లో 7వ వేతన సంఘం(7th pay commission) డియర్‌నెస్ అలవెన్స్(dearness allowance), డియర్‌నెస్ రిలీఫ్‌ల(DR) పెంపును ప్రకటించనుండటమే అందుకు కారణమని ఆర్థిక వర్గాలు అంటున్నాయి. దీని ద్వారా ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రయోజనం చేకూరనుంది. కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా జనవరి, జులైలో సంవత్సరానికి రెండుసార్లు DAలో సవరణలను ప్రకటిస్తుంది.


ఈసారి

ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం(central government) కరువు భత్యాన్ని ఈసారి 3 శాతం పెంచనున్నట్లు తెలుస్తోంది. జులై 2024 నుంచి అమల్లోకి వచ్చే ఏడవ వేతన సంఘం కింద ఉద్యోగులు, పెన్షనర్లకు ఈ పెంపుదల వర్తించనుంది. ఈ నేపథ్యంలో కోటి మంది ఉద్యోగులు ప్రయోజనం పొందనున్నారు. గత సంవత్సరం జులై 1, 2023 నుంచి అమలులోకి వచ్చే DA పెంపుదల అక్టోబర్ 18, 2023న ప్రకటించబడింది. డీఏ సవరణకు ప్రభుత్వం విధించిన గడువును పరిగణనలోకి తీసుకుంటే తదుపరి పెంపు గురించి త్వరలో ప్రకటన వెలువడే అవకాశం ఉందని అంటున్నారు. చివరిసారిగా మార్చి 7, 2024న డీఏను పెంచారు. ఈ పెంపు జనవరి 1, 2024 నుంచి అమలులోకి వచ్చింది.


డియర్‌నెస్ అలవెన్స్ సూత్రం ఏంటి?

డియర్‌నెస్ అలవెన్స్ అనేది పారిశ్రామిక కార్మికులకు (CPI-IW) వినియోగదారుల ధరల సూచిక ఆధారంగా లెక్కించబడుతుంది. అంటే పారిశ్రామిక కార్మికులకు ద్రవ్యోల్బణం రేటును ప్రతి నెలా లేబర్ బ్యూరో విడుదల చేస్తుంది. ఏడవ వేతన సంఘం కింద కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డియర్‌నెస్ అలవెన్స్‌ని గణించే ఫార్ములా - 7వ CPC DA% = [గత 12 నెలలలో AICPI-IW (బేస్ ఇయర్ 2001=100) {12 నెలల సగటు – 261.42}/ 261.42x100] . ఈ ఫార్ములా ప్రకారం బేసిక్ జీతంలో డీఏ 53.35 శాతం.


3 శాతం పెరిగే ఛాన్స్

ఈ నేపథ్యంలో ప్రభుత్వం డీఏను 53 శాతానికి పెంచవచ్చని ఆర్థిక వర్గాలు అంటున్నాయి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ప్రస్తుతం 50 శాతం డీఏ, డీఆర్‌లు పొందుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈసారి డీఏ 3 శాతం పెరగవచ్చని అంచనా. 3 శాతం డీఏ పెంపుతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతం పెరుగుతుంది. ప్రస్తుతం ఒక ఉద్యోగి ప్రాథమిక వేతనం రూ. 55,200 అనుకుంటే, వారికి రూ.27,600 డీఏ వస్తుంది. డీఏ 53 శాతానికి చేరుకున్న తర్వాత, ఆ ఉద్యోగికి డీఏగా రూ.29,256 లభిస్తుంది.


ఇవి కూడా చదవండి:

Lowest Interest Car Loans: తక్కువ రేటుకే లక్షల రూపాయల కార్ లోన్స్.. ఈ వివరాలు తెలుసా మీకు..


Bank Holidays: సెప్టెంబర్ 2024లో బ్యాంకు సెలవులు ఎన్నంటే.. గణేష్ చతుర్థి సహా..

Tourist Place: వీకెండ్ విజిట్‌కు బెస్ట్ ప్లేస్ .. ట్రేక్కింగ్, కాఫీ తోటలతోపాటు..


Read More Business News and Latest Telugu News

Updated Date - Aug 24 , 2024 | 01:36 PM

Advertising
Advertising
<