Airport: ఇకపై ఈ విమానాశ్రయంలో 24×7 మద్యం దుకాణం ఓపెన్
ABN, Publish Date - Jul 15 , 2024 | 10:35 AM
ఢిల్లీ(Delhi)లోని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ (IGI) విమానాశ్రయంలోని టెర్మినల్ 3 వద్ద కొత్త మద్యం దుకాణాన్ని(liquor store) ప్రారంభించారు. ఈ దుకాణంలో దేశీయ ప్రయాణికులు, విమానాశ్రయ ఉద్యోగులకు 24x7 మద్యం లభించడం విశేషం.
ఢిల్లీ(Delhi)లోని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ (IGI) విమానాశ్రయంలోని టెర్మినల్ 3 వద్ద కొత్త మద్యం దుకాణాన్ని(liquor store) ప్రారంభించారు. ఈ దుకాణంలో దేశీయ ప్రయాణికులు, విమానాశ్రయ ఉద్యోగులకు 24x7 మద్యం లభించడం విశేషం. అయితే ఢిల్లీలోని మద్యం దుకాణాలు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే పనిచేస్తాయి. కానీ ఢిల్లీ ఎయిర్ పోర్టులో మొదలైన దుకాణం 24x7 తెరిచి ఉంటుంది. ఈ దుకాణం 750 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. ఇక్కడ కస్టమర్లు స్వీయ సేవను ఆస్వాదించగలరు. దీని ద్వారా కస్టమర్‌లు తమకు నచ్చిన బ్రాండ్‌కు చెందిన మద్యాన్ని ఎంచుకోవచ్చు.
ఢిల్లీలో మద్యం విక్రయిస్తున్న నాలుగు ప్రభుత్వ దుకాణాలలో ఒకటైన ఢిల్లీ(delhi) కన్స్యూమర్ కో ఆపరేటివ్ హోల్‌సేల్ స్టోర్స్ లిమిటెడ్ (DCCWS)కి ఎక్సైజ్ శాఖ ఎల్ 10 మద్యం లైసెన్స్‌ను జారీ చేసింది. DCCWS రాజధాని ఢిల్లీలో దాదాపు 140 L6, L10 రిటైల్ మద్యం దుకాణాలను నిర్వహిస్తోంది. అంతర్జాతీయ ప్రయాణీకులకు సౌకర్యాన్ని కల్పిస్తున్న ఢిల్లీ విమానాశ్రయంలోని టెర్మినల్ 3 అరైవల్, డిపార్చర్ ఏరియాలో ప్రస్తుతం డ్యూటీ ఫ్రీ మద్యం దుకాణాలు మాత్రమే పనిచేస్తున్నాయి.
అయితే దేశీయ ప్రయాణికులకు ఈ మూడింటిలో మద్యం(liquor) అందుబాటులో లేదు. కానీ ఇప్పుడు కొత్తగా ప్రారంభించిన మద్యం దుకాణం దేశీయ ప్రయాణీకులు, విమానాశ్రయంలో పనిచేసే సిబ్బందికి అందుబాటులోకి రానుంది. GNCTD ఎక్సైజ్ శాఖలో నమోదు చేయబడిన అన్ని జాతీయ, అంతర్జాతీయ విస్కీ, బీర్, జిన్, వోడ్కా మొదలైన బ్రాండ్‌లు ఈ స్టోర్‌లో అందుబాటులో ఉంటాయి. సాధారణ కస్టమర్ల సౌలభ్యం కోసం ఇతర ప్రాంతాల్లో విక్రయించబడుతున్న వివిధ మద్యం ధరల చార్ట్‌లు కూడా ప్రదర్శించనున్నారు. UPI, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ వంటి అన్ని రకాల చెల్లింపు సౌకర్యాలను ఈ స్టోర్‌లో అందుబాటులో ఉంచారు.
ఇవి కూడా చదవండి:
Investment Plan: నెలకు రూ.16 వేలు కడితే కోటీశ్వరులవ్వొచ్చు.. ఎలాగంటే..?
Warranty vs Guarantee: మీకు వారంటీ, గ్యారెంటీ మధ్య తేడా తెలుసా.. లేదంటే నష్టపోతారు జాగ్రత్త..!
For Latest News and Business News click here
Updated Date - Jul 15 , 2024 | 10:37 AM