Gold Prices: బిగ్ షాక్.. బంగారం తులానికి ఎంత పెరిగిందంటే..
ABN, Publish Date - Oct 18 , 2024 | 07:57 AM
దీపావళి సందర్భంగా బంగారం కొనాలనుకునేవారికి ధరలు షాక్ ఇస్తున్నాయి. కొన్ని రోజులుగా తగ్గుతూ వస్తున్న పసిడి రేట్లు ప్రస్తుతం పెరుగుతూ కొనుగోలుదారులను ఆలోచనలో పడేస్తున్నాయి.
హైదరాబాద్: దీపావళి సందర్భంగా బంగారం కొనాలనుకునేవారికి ధరలు షాక్ ఇస్తున్నాయి. కొన్ని రోజులుగా తగ్గుతూ వస్తున్న పసిడి రేట్లు ప్రస్తుతం పెరుగుతూ కొనుగోలుదారులను ఆలోచనలో పడేస్తున్నాయి. దీపావళి ముందు వచ్చే ధంతేదాస్‌ను దేశ ప్రజలు ఘనంగా జరుపుకుంటారు. ఆ రోజు బంగారం కొనుగోలు చేస్తే సకల శుభాలు కలుగుతాయని భావిస్తారు. అయితే ఈసారి మాత్రం పేద, మధ్య తరగతి ప్రజలకు ధరలు షాక్ ఇస్తున్నాయి. పరిస్థితి చూస్తుంటే దీపావళి నాటికి తులం పసిడి ధర రూ.80వేలకు చేరే అవకాశం కనిపిస్తోంది. అలాగే కొన్ని రోజులుగా కిలో వెండి ధర స్థిరంగా రోజుకు రూ.100చొప్పున పెరుగుతూ రికార్డు స్థాయిలో దూసుకుపోతోంది. ప్రస్తుతం పసిడి ధరలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు..
హైదరాబాద్‌లో రెండ్రోజులుగా బంగారం ధరలు పెరుగుతూ వచ్చాయి. అక్టోబర్ 18న 22 క్యారెట్ల పసిడి తులానికి రూ.200 పెరిగి రూ.71,600 ఉండగా.. 24 క్యారెట్ల ధర తులానికి రూ.220 పెరిగి రూ.78,110కి చేరింది. అలాగే విజయవాడ, విశాఖపట్నంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.71,610 కాగా.. 24 క్యారెట్ల ధర రూ.78,120లుగా ఉంది. అలాగే హైదరాబాద్‌లో వెండి కేజీ ధర రూ.1,03,100 ఉండగా.. విజయవాడ, విశాఖపట్నంలో రూ.1,02,800లుగా ఉంది. అయితే నిన్నటి రేట్లతో పోలిస్తే వెండి ధర తెలుగు రాష్ట్రాల్లో కిలోకు రూ.100మేర తగ్గింది.
ప్రధాన నగరాల్లో పసిడి ధరలు..
దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.71,760ఉండగా.. 24 క్యారెట్ల రేటు రూ.78,270లుగా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.71,610 కాగా.. 24 క్యారెట్ల ధర రూ.78,120లుగా ఉంది. అలాగే చెన్నైలో 22 క్యారెట్ల ధర రూ.71,610 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.78,120లుగా ఉంది.
ఈ వార్తలు కూడా చదవండి:
Updated Date - Oct 18 , 2024 | 08:05 AM