Gold Prices: బిగ్ షాక్.. బంగారం తులానికి ఎంత పెరిగిందంటే..
ABN, Publish Date - Oct 27 , 2024 | 08:49 AM
హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. నిన్న (అక్టోబర్ 26న) పసిడి రేట్లు భారీగా పెరిగాయి. 22 క్యారెట్ల గోల్డ్ ధర తులానికి రూ.650 పెరిగి రూ.73,600లకు చేరింది. నేడూ (అక్టోబర్ 27న) అదే రేటు కొనసాగుతోంది.
హైదరాబాద్: దీపావళి సందర్భంగా బంగారం కొనాలనుకునేవారికి ధరలు షాక్ ఇస్తున్నాయి. బంగారం రేట్లు రోజురోజుకూ పెరుగుతూ కొనుగోలు దారులను ఆందోళనలకు గురి చేస్తున్నాయి. కొన్ని రోజులుగా రేట్లు పైకి ఎగబాకుతూ పసిడి కొనాలా, వద్దా? అనే ఆలోచనలో పడేస్తున్నాయి. దీపావళి ముందు వచ్చే దంతేరాస్‌ను దేశ ప్రజలు ఘనంగా జరుపుకుంటారు. అయితే ఆ రోజు బంగారం కొనుగోలు చేయడం సంప్రదాయంగా భావిస్తారు. దంతేరాస్ రోజున పసిడి కొంటే సకల శుభాలు కలుగుతాయని భావిస్తారు. అయితే ఈసారి మాత్రం పేద, మధ్య తరగతి ప్రజలకు ధరలు షాక్ ఇస్తున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు..
హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. నిన్న (అక్టోబర్ 26న) పసిడి రేట్లు భారీగా పెరిగాయి. 22 క్యారెట్ల గోల్డ్ ధర తులానికి రూ.650 పెరిగి రూ.73,600లకు చేరింది. నేడూ (అక్టోబర్ 27న) అదే రేటు కొనసాగుతోంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల ధర నిన్న రూ.710 పెరిగి రూ.80,290కి చేరగా.. నేడూ ఇదే రేటు వద్ద కొనసాగుతోంది. మరోవైపు విజయవాడ, విశాఖపట్నం నగరాల్లోనూ 22 క్యారెట్ల పసిడి ధర రూ.73,600 కాగా.. 24 క్యారెట్ల ధర రూ.80,290లుగా ఉంది. అలాగే హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ.1,07,00లకు చేరింది. దీపావళి నాటికి బంగారం ధరలు రూ.80వేలకు చేరుతాయని మెుదట ట్రేడ్ పండితులు అంచనా వేశారు. అయితే వారి అంచనాలను తలకిందులు చేస్తూ ముందుగానే పసిడి ధర రూ.80వేలు దాటింది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.73,750 కాగా.. 24 క్యారెట్ల ధర రూ. 80,440కు చేరింది.
30 శాతం మేర తగ్గిన కొనుగోళ్లు..
మరోవైపు ధరలు బాగా పెరగడంతో బిజినెస్ బాగా తగ్గిపోయిందని వ్యాపారాలు వాపోతున్నారు. గతంతో పోలిస్తే 30శాతం మేర కొనుగోళ్లు తగ్గాయని చెబుతున్నారు. పసిడి ధర రూ.80వేల మార్క్ దాటడంతో కొనేందుకు ప్రజలు ఆసక్తి కనబరచడం లేదని అంటున్నారు. వివాహాలు వంటి కార్యక్రమాలు ఉంటే తప్ప షాపులకు రావడం లేదని చెబుతున్నారు. కొనే వారు కూడా పరిస్థితుల బట్టి కొనాల్సిన దాని కంటే తక్కువగానే కొంటున్నారని వాపోతున్నారు. ఇలాగే ధరలు పెరుగుతూ పోతే రానున్న రోజుల్లో వ్యాపారం మరింత దిగజారుతుందని ఆందోళనకు గురవుతున్నారు.
Updated Date - Oct 27 , 2024 | 09:01 AM