ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Extension deadline: పన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్.. ఈ గడువు పొడిగింపు

ABN, Publish Date - Sep 30 , 2024 | 02:37 PM

వివిధ ఆడిట్ నివేదికలను ఆన్‌లైన్ విధానంలో ఫైల్ చేయడంలో పన్ను చెల్లింపుదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల దృష్ట్యా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ గడువు సెప్టెంబర్ 30తో ముగియనున్న నేపథ్యంలో గుడ్ న్యూస్ చెప్పింది.

income tax Tax Audit Report Extension

ఆదాయ పన్ను చెల్లింపుదారులకు(income tax payers) గుడ్ న్యూస్ వచ్చేసింది. 2023-24 సంవత్సరానికి సంబంధించి వివిధ ఆడిట్ నివేదికల దాఖలు తేదీని పొడిగించాలని నిర్ణయించినట్లు CBDT అధికారిక ప్రకటనలో తెలిపింది. దీని చివరి తేదీ సెప్టెంబర్ 30 ఉండగా, దీనిని అక్టోబరు 7, 2024 వరకు పొడిగిస్తున్నట్లు తెలిపింది. సర్క్యూలర్ ప్రకారం అవసరమైన నివేదికలను ఎలక్ట్రానిక్‌గా సమర్పించడంలో పన్ను చెల్లింపుదారులు, ఇతర సంస్థలు ఎదుర్కొంటున్న సవాళ్లను పరిగణనలోకి తీసుకున్న తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీబీడీటీ వెల్లడించింది.


ఈ క్లాజు ప్రకారం

ఈ క్రమంలో చాలా మంది వ్యక్తులు, సంస్థలు ఆదాయపు పన్ను చట్టం 1961లోని నిబంధనల ప్రకారం ఆడిట్ నివేదికలను సమయానికి దాఖలు చేయడానికి ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లు గుర్తు చేసింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) చట్టంలోని సెక్షన్ 139లోని సబ్ సెక్షన్ (1) కింద మునుపటి సంవత్సరం 2023-24కి సంబంధించిన వివిధ ఆడిట్ నివేదికల దాఖలు తేదీని పొడిగించాలని నిర్ణయించినట్లు CBDT తన ప్రకటనలో తెలిపింది. చట్టంలోని వివరణ 2లోని క్లాజ్ (a)లో పేర్కొన్న పన్ను చెల్లింపుదారుల కోసం ఆడిట్ నివేదికను దాఖలు చేయడానికి చివరి తేదీ 30 సెప్టెంబర్, 2024 కాగా ఇప్పుడు అక్టోబర్ 07, 2024 వరకు అవకాశం ఉన్నట్లు వెల్లడించింది.


ఉపయోగించుకోవాలి

CBDT ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 119 కింద తన అధికారాన్ని ఉపయోగించి ఈ పొడిగింపును చేసినట్లు తెలిపింది. ఈ విభాగం అసెస్‌మెంట్ సంవత్సరానికి ఆడిట్ నివేదికలను సమర్పించాల్సిన పన్ను చెల్లింపుదారుల నిర్దిష్ట వర్గాలను సూచిస్తుంది. ఆడిట్ దాఖలు చేయడానికి చివరి తేదీని పొడిగించడం వల్ల పన్ను చెల్లింపుదారులు తమ ఎలక్ట్రానిక్ ఫైలింగ్‌ను పూర్తి చేయడానికి అదనపు సమయం లభిస్తుంది. దీంతో అనేక మంది అనవసరమైన ఒత్తిడి లేకుండా వారి నివేదికలు సమర్పించుకోవచ్చు. ఈ నేపథ్యంలో పన్ను చెల్లింపుదారులు ఈ పొడిగించిన గడువును ఉపయోగించుకోవాలని, అక్టోబర్ 7, 2024 కొత్త గడువు తేదీలోపు వారి ఆడిట్ నివేదికలను సకాలంలో సమర్పించాలని సీబీడీటీ అధికారులు సూచించారు.


మళ్లీ నో ఛాన్స్

ట్యాక్స్ ఆడిట్ నివేదికల ఎలక్ట్రానిక్ ఫైలింగ్‌లో సాంకేతిక సమస్యల కారణంగా గడువును మరో ఏడు రోజులు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని అకౌంటింగ్, కన్సల్టింగ్ సంస్థ మూర్ సింఘి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రజత్ మోహన్ తెలిపారు. ఇప్పటివరకు 3 కోట్లకు పైగా ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలయ్యాయని ఈ సందర్భంగా వెల్లడించారు. గడువు పొడిగించిన నేపథ్యంలో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అన్నారు. అంతేకాదు గడువు మళ్లీ పొడిగించే ఛాన్స్ కూడా లేదన్నారు.


ఇవి కూడా చదవండి:

Business Idea: ఈ వ్యాపారం ఎవర్ గ్రీన్.. రూ.50 వేల పెట్టుబడి, 11 లక్షలకుపైగా లాభం..


Online Shopping Tips: పండుగల సీజన్‌లో ఆన్‌లైన్‌ షాపింగ్ చేస్తున్నారా.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి

Bank Holidays: అక్టోబర్‌లో బ్యాంకు సెలవులు ఎన్నిరోజులంటే.. పనిచేసేది మాత్రం..

Personal Finance: ఈ పోస్ట్ ఆఫీస్ స్కీంలో రూ.10 లక్షలు పెడితే.. మీకు వడ్డీనే రూ. 20 లక్షలొస్తుంది తెలుసా..

Read More Business News and Latest Telugu News

Updated Date - Sep 30 , 2024 | 02:39 PM