Financial Deadline: ఈ లావాదేవీలకు ఈ నెల 30 చివరి తేదీ.. లేదంటే మీకే నష్టం..
ABN, Publish Date - Sep 27 , 2024 | 12:32 PM
ప్రతి నెలలో FDల వడ్డీ రేట్లతోపాటు అనేక ఆర్థిక లావాదేవీలు జరుగుతుంటాయి. ఈ క్రమంలో ఈ నెలలో ముగియనున్న కీలక వడ్డీ రేట్ల స్కీంలతోపాటు అనేక అంశాలు ఉన్నాయి. ఆ వివరాలేంటో ఇక్కడ చుద్దాం.
దేశంలో ప్రతి నెల ఆర్థిక లావాదేవీలు, బ్యాంకుల క్రెడిట్ కార్డు చెల్లింపులు, నిబంధనల మార్పు వంటి అంశాలు అనేకం ఉంటాయి. ఈ క్రమంలోనే ఆదాయపు పన్ను శాఖ సెప్టెంబర్ 2024కి సంబంధించిన కీలక గడువులు ఈనెల 30తో పూర్తి కానున్నాయి. అయితే కొత్తగా ఎలాంటి నిబంధల గడువు ముగియనుంది. ఏ స్కీమ్స్ గడువు పూర్తి కానుందనే వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
ఇండియన్ బ్యాంక్
ఇండియన్ బ్యాంక్ ప్రస్తుతం ఈ నెలలో ప్రత్యేక FD వడ్డీ రేట్లను అందిస్తుంది. ఈ వడ్డీ రేట్లు ఈనెల చివరి వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. వాటిలో 300 రోజులలో సాధారణ ప్రజలకు 7.05%, సీనియర్‌లకు 7.55%, సూపర్ సీనియర్ సిటిజన్‌లకు 7.80% వడ్డీ రేట్లను అందిస్తున్నారు. ఇక 400 రోజుల పాటు FDలో సాధారణ ప్రజలకు 7.25%, సీనియర్‌లకు 7.75%, సూపర్ సీనియర్ సిటిజన్‌లకు 8.00% వడ్డీ రేట్లను అందిస్తున్నారు. వీటి చివరి తేదీ సెప్టెంబర్ 30, 2024. అంతకుముందు తేదీ జూన్ 30, 2024.
IDBI బ్యాంక్
ఇక IDBI బ్యాంక్ 300 రోజులు, 375 రోజులు, 444 రోజుల ప్రత్యేక కాలపరిమితి ఉత్సవ్ FDలను అందిస్తున్నారు. సాధారణ పౌరులకు 300 రోజులలో మెచ్యూర్ అయ్యే ఉత్సవ్ FDలపై బ్యాంక్ 7.05% అందిస్తుంది. దీనిలో సీనియర్ సిటిజన్లు 7.55% పొందుతారు. ఇక 375 రోజులలో మెచ్యూర్ అయ్యే ఉత్సవ్ FDలపై 7.15% వడ్డీ రేటును అందిస్తుండగా, సీనియర్ సిటిజన్లు 7.65% పొందుతారు. వీటి గడువు జూన్ 30 వరకు ఉండగా, ఇటివల సెప్టెంబర్ 30 వరకు పొడిగించారు.
ఫైనాన్షియల్ డెడ్ లైన్
మరోవైపు ఆగస్టు, 2024 నెలలో సెక్షన్ 194-IA కింద మినహాయించబడిన పన్నుకు సంబంధించి చలాన్ కమ్ స్టేట్‌మెంట్‌ను అందించడానికి గడువు తేదీ సెప్టెంబర్ 30, 2024
ఆగస్టు, 2024 నెలలో సెక్షన్ 194-IB కింద మినహాయించబడిన పన్నుకు సంబంధించి చలాన్-కమ్-స్టేట్‌మెంట్‌ను అందించడానికి గడువు తేదీ సెప్టెంబర్ 30, 2024
ఆగస్టు, 2024 నెలలో సెక్షన్ 194M కింద మినహాయించబడిన పన్నుకు సంబంధించి చలాన్-కమ్-స్టేట్‌మెంట్‌ను అందించడానికి గడువు తేదీ సెప్టెంబర్ 30, 2024
ఆగస్టు, 2024 నెలలో సెక్షన్ 194S (నిర్దిష్ట వ్యక్తి ద్వారా) కింద మినహాయించబడిన పన్నుకు సంబంధించి చలాన్-కమ్-స్టేట్‌మెంట్‌ను అందించడానికి గడువు తేదీ సెప్టెంబర్ 30, 2024
కార్పొరేట్ అసెస్సీ లేదా నాన్ కార్పొరేట్ మదింపుదారుల విషయంలో 2024-25 అసెస్‌మెంట్ సంవత్సరానికి సెక్షన్ 44AB కింద ఆడిట్ నివేదికను దాఖలు చేయడానికి కూడా గడువు తేదీ ఈ నెలనే లాస్ట్
గత సంవత్సరం ఆదాయాన్ని వచ్చే ఏడాది లేదా భవిష్యత్తులో వర్తింపజేయడానికి సెక్షన్ 11(1)కి వివరణ కింద అందుబాటులో ఉన్న ఎంపికను అమలు చేయడానికి ఫారమ్ 9Aలో దరఖాస్తు ఈ నెలలోనే సమర్పించాలి
సెక్షన్ 10(21) లేదా సెక్షన్ 11(1) (నవంబర్ 30, 2024లోపు రిటర్న్ చెల్లించాల్సి ఉంటే) భవిష్యత్తులో దరఖాస్తు కోసం ఆదాయాన్ని సేకరించేందుకు ఫారమ్ 10లోని స్టేట్‌మెంట్ ప్రకారం ట్రస్టులు, సంస్థలు, విశ్వవిద్యాలయాలు లేదా ఆసుపత్రులు ఫారమ్ 10B/10BBలో ఆడిట్ నివేదికను ఈనెలలోనే అందించాలి.
ఇవి కూడా చదవండి:
Bank Holidays: అక్టోబర్‌లో బ్యాంకు సెలవులు ఎన్నిరోజులంటే.. పనిచేసేది మాత్రం..
Online Shopping Tips: పండుగల సీజన్‌లో ఆన్‌లైన్ షాపింగ్ చేస్తున్నారా.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి
Read More Business News and Latest Telugu News
Updated Date - Sep 27 , 2024 | 12:37 PM