ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Flipkart Big Billion Days Sale: బిగ్ బిలియన్ డేస్ సేల్ వచ్చేస్తోంది

ABN, Publish Date - Sep 10 , 2024 | 06:46 PM

దసరా, దీపావళిని దృష్టిలో ఉంచుకొని ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డే సేల్‌ ప్రకటించింది. ఎలక్ట్రానిక్ వస్తువులు, యాక్సెసరీస్‌పై 50 నుంచి 80 శాతం వరకు డిస్కౌంట్ ఇస్తోంది. ల్యాప్ టాప్, హెడ్ ఫోన్స్, గేమింగ్, టెక్ యాక్సెసరీస్‌కు డిస్కౌంట్ ఉంటుంది. స్మార్ట్ టీవీ, హోం అప్లయెన్స్‌పై 80 శాతం వరకు డిస్కౌంట్ ఉంటుంది.

lipkart Big Billion Days Sale

దసరా, దీపావళి పండగలు వచ్చేస్తోన్నాయి. వచ్చే నెలలో రెండు పెద్ద పండగలు ఉన్నాయి. పండగలను పురస్కరించుకొని ప్రముఖ ఈ-కామర్స్ సైట్స్ ఆఫర్లకు తెరలేపాయి. ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ (Flipkart Big Billion Days Sale) నిర్వహిస్తోండగా.. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ అందుబాటులో ఉంచుతోంది. బిగ్ బిలియన్ డేస్‌కు సంబంధించి ఫ్లిప్ కార్ట్ అప్ డేట్ ఇచ్చింది. ఈ నెల 30వ తేదీ నుంచి సేల్ అందుబాటులో ఉంటుందని ప్రకటన చేసింది. ఫ్లిప్ కార్ట్ ఫ్లస్ కస్టమర్లకు ఒకరోజు ముందుగా అంటే 29వ తేదీన ఆఫర్ అందుబాటులోకి వస్తోంది.



డిస్కౌంట్స్ ఇలా

దసరా, దీపావళిని దృష్టిలో ఉంచుకొని ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డే సేల్‌ ప్రకటించింది. ఎలక్ట్రానిక్ వస్తువులు, యాక్సెసరీస్‌పై 50 నుంచి 80 శాతం వరకు డిస్కౌంట్ ఇస్తోంది. ల్యాప్ టాప్, హెడ్ ఫోన్స్, గేమింగ్, టెక్ యాక్సెసరీస్‌కు డిస్కౌంట్ ఉంటుంది. స్మార్ట్ టీవీ, హోం అప్లయెన్స్‌పై 80 శాతం వరకు డిస్కౌంట్ ఉంటుంది. కొన్ని ఎంపిక చేసిన ఫ్రీడ్జ్, 4కే స్మార్ట్ టీవీలకు 75 శాతం వరకు డిస్కౌంట్ ఉంటుంది. నాథింగ్, రియల్ మి, ఎంఐ, ఇన్‌ఫినిక్స్ కంపెనీకు చెందిన స్మార్ట్ ఫోన్లకు భారీ తగ్గింపు ఉంటుంది. ఐ ఫోన్లకు స్పెషల్ బ్యాంక్ ఆఫర్లు ఉంటాయి.



ఇన్‌స్టంట్ డిస్కౌంట్

కొన్ని క్రెడిట్, డెబిట్ కార్డు వినియోగదారులకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ ఆఫర్ ఉంది. స్మార్ట్ ఫోన్, టీవీ, ఇతర ప్రీమియం వస్తువులకు నో కాస్ట్ ఈఎంఐ ఆఫర్ ఉంది. క్యాష్ బ్యాక్ ఆఫర్స్, కూపన్ డిస్కౌంట్లు ఉన్నాయి. ఇతర వస్తువులకు బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్చేంజ్ డీల్స్, నో కాస్ట్ ఈఎంఐ అందుబాటులో ఉంది. క్యాష్ బ్యాక్ ఆఫర్లు పెట్టి వినియోగదారులను తమవైపునకు తిప్పుకునే ప్రయత్నం చేసింది ఫ్లిప్ కార్ట్. తర్వాత అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ కూడా రానుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Sep 10 , 2024 | 08:14 PM

Advertising
Advertising