ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Narayanan Vaghul: ఐసీఐసీఐకి పునాది వేసిన ప్రముఖ బ్యాంకర్ కన్నుమూత

ABN, Publish Date - May 18 , 2024 | 05:00 PM

ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ ఛైర్మన్, ఐసీఐసీఐ(ICICI) ఫైనాన్షియల్ గ్రూప్‌కు పునాది వేసిన ప్రముఖ బ్యాంకర్ నారాయణన్ వాఘుల్(Narayanan Vaghul) ఈరోజు(మే 18న) కన్నుముశారు. 88 ఏళ్ల వయస్సులో చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో గత రెండు రోజులుగా అనారోగ్యంతో చికిత్స పొందుతూ మరణించారు.

Narayanan Vaghul no more

ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ ఛైర్మన్, ఐసీఐసీఐ(ICICI) ఫైనాన్షియల్ గ్రూప్‌కు పునాది వేసిన ప్రముఖ బ్యాంకర్ నారాయణన్ వాఘుల్(Narayanan Vaghul) ఈరోజు(మే 18న) కన్నుముశారు. 88 ఏళ్ల వయస్సులో చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో గత రెండు రోజులుగా అనారోగ్యంతో చికిత్స పొందుతూ మరణించారు. పద్మభూషణ్ నారాయణన్ ఈరోజు మధ్యాహ్నం కన్నుమూశారని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. వఘుల్‌కు భార్య, ఓ కుమార్తె, ఓ కుమారుడు ఉన్నారు.


ఆధునిక భారతీయ బ్యాంకింగ్ పితామహుడిగా పేరొందిన వాఘుల్, ఐసీఐసీఐ బ్యాంక్‌కు పునాది వేయడంలో కీలక పాత్ర పోషించారు. ఆయన కెరీర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో ప్రారంభమైంది. అక్కడి నుంచి బొంబాయిలోని కేంద్ర కార్యాలయం వరకు వెళ్లారు. 39 సంవత్సరాల వయస్సులో ఆయన సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా నియమించబడ్డారు. 1981లో 44 సంవత్సరాల వయస్సులో అతను బ్యాంక్ ఆఫ్ ఇండియా అతి పిన్న వయస్కుడైన ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అయ్యారు.


1985లో వఘుల్ ఐసీఐసీఐ బ్యాంక్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అయ్యారు. ఐసీఐసీఐ బ్యాంకును ఆర్థిక సంస్థ నుంచి దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ బ్యాంకుల జాబితాలోకి తీసుకెళ్లేందుకు ఆయన ఎంతో కృషి చేశారు. ఆ క్రమంలోనే 2009లో వఘుల్‌కు పద్మభూషణ్ అవార్డు లభించింది. ఎకనామిక్ టైమ్స్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డుతో కూడా సత్కరించారు.

ఇది కాకుండా వఘుల్ విప్రో, మహీంద్రా & మహీంద్రా, అపోలో హాస్పిటల్స్, మిట్టల్ స్టీల్‌తో సహా అనేక భారతీయ కంపెనీలలో డైరెక్టర్‌గా కూడా పనిచేశారు. నారాయణ్ వాఘుల్ రచించిన 'రిఫ్లెక్షన్స్' పుస్తకం గత సంవత్సరం ప్రచురించబడింది. ఈ పుస్తకాన్ని 28 ఏప్రిల్ 2023న ముంబైలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ విడుదల చేశారు.


ఇది కూడా చదవండి:

Electric Bike: ఎలక్ట్రిక్ బైక్ తీసుకుంటున్నారా..ఈ విషయాలు తప్పక తెలుసుకోండి

Credit Card: క్రెడిట్ కార్డు వాడుతున్నారా..ఈ మోసాల పట్ల జాగ్రత్త

Read Latest Business News and Telugu News

Updated Date - May 18 , 2024 | 05:02 PM

Advertising
Advertising