Gold Rate: ఒక్కరోజులోనే భారీగా పెరిగిన గోల్డ్ రేట్.. కొనాలంటే ఆలోచించాల్సిందే
ABN, Publish Date - Dec 11 , 2024 | 07:54 AM
Gold Rate: గోల్డ్ కొనాలనుకుంటే ఆలోచించాల్సిందే. ఒక్క రోజులోనే బంగారం ధర భారీగా పెరిగింది. బుధవారం నాడు తులం పసిడి ఎంత ఉందనేది ఇప్పుడు చూద్దాం..
Today Gold Rate: మన దేశంలో ఆభరణాలు అంటే బంగారమే. దాన్ని మించింది మరొకటి లేదనే చెప్పాలి. గోల్డ్‌ను స్టేటస్ సింబల్‌గా భావిస్తారు. ఎంత పసిడి ఉంటే అంత ధనవంతులుగా చూస్తుంటారు. అందుకే కాస్త డబ్బు ఉన్నా అందరూ బంగారం కొనేందుకు ఇష్టపడతారు. పసిడిని ఆభరణంగానే గాక మంచి ఇన్వెస్ట్‌మెంట్‌గానూ చెప్పొచ్చు. అవసరమైతే తనఖా పెట్టడానికి దీన్ని మించింది లేదు. అందుకే ధనవంతులే కాదు.. మధ్యతరగతి ప్రజలు కూడా బంగారం కొని దాచుకునేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. అయితే ఇప్పుడు గోల్డ్ కొనాలంటే ఆలోచించక తప్పదు.
తులం ఎంతంటే..
నిన్నమొన్నటి వరకు బంగారాన్ని కొనేందుకు అందరూ ఎగబడ్డారు. గోల్డ్ రేట్స్ పడిపోతుండటంతో డిమాండ్ మరింత పెరిగింది. అయితే ఒక్క రోజులోనే పసిడి ధరలు అమాంతం పెరిగాయి. డిసెంబర్ 11, బుధవారం నాడు బంగారం ధరలు పెరిగాయి. మంగళవారంతో పోలిస్తే గోల్డ్ రేట్ ఏకంగా రూ.1,000 పెరిగింది. తులం పసిడి ధర ఇంకోసారి 80 వేల మార్క్‌ను టచ్ చేసింది. ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ.80,060 పలుకుతోంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారమైతే రూ.79,470గా ఉంది. ఒక్క రోజులోనే పసిడి ధరల్లో ఇంత మార్పు రావడానికి అంతర్జాతీయంగా నెలకొన్న ఆర్థిక పరిస్థితులు ప్రధాన కారణమని చెబుతున్నారు.
యూఎస్-చైనాల వల్లే..
అగ్రరాజ్యం అమెరికాలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. అక్కడ గత రెండు వారాల కంటే ఇప్పుడు గరిష్ట స్థాయికి చేరుకొని ఒక ఔన్స్ పసిడి 50 డాలర్లు పెరిగి 2,718 డాలర్ల దగ్గరకు చేరింది. యూఎస్‌లోని ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్లను తగ్గిస్తుందని వార్తలు వస్తున్నాయి. దీంతో ట్రెజరీ బాండ్ల మీద పెట్టుబడి పెట్టిన వారికి వచ్చే రాబడి తగ్గుతుంది. అలా ఇన్వెస్ట్‌మెంట్స్ చేసిన వారు తమ పెట్టుబడులను ముందుగానే బంగారం వైపు తరలిస్తున్నారని తెలుస్తోంది. దీని వల్లే అనూహ్యంగా గోల్డ్‌కు డిమాండ్ ఏర్పడి ధర పెరుగుతోందని అనలిస్టులు అంటున్నారు. కాగా, చైనాలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ స్టార్ట్ అయ్యాయి. దీంతో అక్కడి జనం ఎగబడి బంగారం కొంటున్నారు. గోల్డ్ రేట్ పెరగడానికి ఇది కూడా ఒక కారణమని వినిపిస్తోంది.
Also Read:
మెహుల్ చోక్సీ ఆస్తుల వేలం..
హైదరాబాద్ సీఓఈలో ఐసీఏఐ రీసెర్చ్ హబ్
ఉద్యోగ మార్కెట్‌కు మళ్లీ మంచి రోజులు
For More Business And Telugu News
Updated Date - Dec 11 , 2024 | 07:59 AM