Gold Rates: మహిళలకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు
ABN, Publish Date - Dec 14 , 2024 | 07:58 AM
Gold Rates: నిన్న మొన్నటి వరకు మహిళలకు షాక్ ఇస్తూ వచ్చింది బంగారం. కొండెక్కి కూర్చున్న గోల్డ్‌ను కొనాలంటే అందరూ భయపడ్డారు. అయితే ఎట్టకేలకు ఊరటను ఇస్తూ పసిడి దిగొచ్చింది.
Today Gold Rates: నిన్న మొన్నటి వరకు మహిళలకు షాక్ ఇస్తూ వచ్చింది బంగారం. కొనడం సంగతి పక్కనబెడితే.. ముట్టుకుంటే షాక్ కొట్టింది. కొండెక్కి కూర్చున్న గోల్డ్‌ను కొనాలంటే అందరూ భయపడ్డారు. 80 వేల మార్క్‌కు చేరువలో ఉండటంతో పసిడి వైపు ఫోకస్ తగ్గించారు. వరుసగా బంగారం ధరలు పెరుగుతూ రావడంతో దాని మీద ఇన్వెస్ట్‌మెంట్స్ కాస్త తగ్గాయి. రేట్స్ తగ్గినప్పుడు చూద్దామనే భావన చాలా మంది కస్టమర్స్‌లో కనిపించింది. వాళ్లకు ఊరటను ఇస్తూ ఎట్టకేలకు దిగొచ్చింది పసిడి. ఒక్కరోజు గ్యాప్‌లోనే భారీగా తగ్గింది. మరి.. పసిడి ధరలు ఎలా ఉన్నాయి అనేది ఇప్పుడు చూద్దాం..
ఒక్కరోజులోనే..
డిసెంబర్ 13వ తేదీతో పోలిస్తే 14వ తేదీన బంగారం ధరలు భారీగా తగ్గాయి. నిన్నటితో కంపేర్ చేస్తే ఇవాళ గోల్డ్ రేట్‌లో భారీ మార్పు వచ్చింది. శనివారం నాడు 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.79,140గా ఉంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారమైతే రూ.73,100 పలుకుతోంది. ఒక్కరోజు వ్యవధిలోనే రూ.500 వరకు ధరలు తగ్గడాన్ని గమనించొచ్చు. గత కొన్ని రోజులుగా పెరుగుతున్న ధరల నుంచి ఎట్టకేలకు ఇవాళ్టితో ఉపశమనం లభించింది. రేట్లలో ఈ మార్పునకు అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులే కారణమని తెలుస్తోంది.
భారీగా పడిపోయిన వెండి రేటు
గోల్డ్‌తో పాటు సిల్వర్ రేట్స్ కూడా భారీగా పడిపోయాయి. ఇవాళ హైదరాబాద్ మార్కెట్‌లో కిలో వెండి ధర ఏకంగా రూ.3 వేల మేరకు పడిపోవడం గమనార్హం. కిలో వెండి ధర రూ.1,01,000 దగ్గరకు దిగొచ్చింది. పైన పేర్కొన్న గోల్డ్, సిల్వర్ రేట్స్ డిసెంబర్ 14వ తేదీ పొద్దున 7 గంటల వరకు ఉన్న ధరలు. రేట్స్ ఒక్కోసారి మధ్యాహ్నానికి కూడా మారిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి కొనుగోలు చేసే ముందు స్థానికంగా మరోసారి క్లియర్‌గా తెలుసుకోవడం మంచిది. పైన చెప్పిన రేట్లలో జీఎస్టీ సహా ఎలాంటి పన్నులు కూడా కలపలేదు. టాక్సులు కలిపితే ఇంకాస్త ఎక్కువే ఉంటాయి. ఏరియాలను బట్టి ధరల్లో మార్పులు ఉంటాయని గ్రహించాలి.
Also Read:
అశోక్ లేలాండ్ వాహన ధరలు పెంపు
చంచల్‌గూడ జైలు నుంచి అల్లు అర్జున్ విడుదల
అశోక్ లేలాండ్ వాహన ధరలు పెంపు
For More Business And Telugu News
Updated Date - Dec 14 , 2024 | 08:05 AM