ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Loans: గూగుల్ పే నుంచి క్షణాల్లోనే రూ. 50 లక్షల లోన్స్

ABN, Publish Date - Oct 03 , 2024 | 03:54 PM

మీకు కొన్ని కారణాల వల్ల డబ్బు అవసరమైందా. ఎలాంటి టెన్షన్ అక్కర్లేదు. ఎందుకంటే ఇప్పుడు మీరు Google Pay యాప్ ద్వారా కేవలం కొన్ని నిమిషాల్లోనే రూ. 50 వేల వరకు రుణాన్ని పొందవచ్చు. అందుకోసం ఏం చేయాలి, ఎలా అప్లై చేయాలనే వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.

Google Pay 50 lakh loans

మన దేశంలో చాలా మంది వ్యక్తులకు ఏదో ఒక కారణంతో డబ్బు అవసరం అవుతుంది. ఈ క్రమంలో ఎవరికైనా అకస్మాత్తుగా లోన్స్(loans) అవసరం అయితే ఇటివల కాలంలో అనేక మంది లోన్ యాప్స్ కోసం వెతుకుతున్నారు. మరికొంత మంది మాత్రం బ్యాంకు నుంచి రుణం పొందడానికి ఆసక్తి చూపిస్తున్నారు. బ్యాంక్ నుంచి లోన్ పొందాలంటే కనీసం 7 నుంచి 10 రోజుల వరకు పడుతుంది.

కానీ త్వరగా లోన్స్ ఇచ్చేందుకు ఇప్పుడు Google Pay కూడా సిద్ధమైంది. మీరు ఇంట్లోనే కూర్చుని Google Pay యాప్ ద్వారా ఆన్‌లైన్‌లో లోన్స్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అంతేకాదు మీరు ఏకంగా రూ. 50 లక్షల వరకు గూగుల్ పే నుంచి గోల్డ్ లోన్స్ తీసుకునే ఛాన్స్ ఉంది. అందుకోసం ముత్తూట్ ఫైనాన్స్ సంస్థతో డీల్ కుదుర్చుకున్నారు. ఇక పర్సనల్ లోన్స్ అయితే రూ. 5 లక్షల వరకు పొందవచ్చు.


అర్హత

అయితే Google Pay పర్సనల్ లోన్ తీసుకోవడానికి ఎలాంటి అర్హతలు ఉండాలి, అవసరమైన పత్రాలు ఏంటి, దరఖాస్తు ప్రక్రియ ఎలా అనే సమాచారాన్ని ఇక్కడ తెలుసుకుందాం. ఎవరైనా Google Pay నుంచి పర్సనల్ లోన్ కోసం అప్లై చేయాలనుకుంటే తప్పనిసరిగా కింది అర్హతలను కల్గి ఉండాలి.

  • ముందుగా, మీరు Google Payలో UPI IDని కలిగి ఉండాలి

  • ఈ లోన్ కోసం దరఖాస్తు చేసుకునే వ్యక్తికి కనీస వయస్సు 21 సంవత్సరాలు, గరిష్ట వయస్సు 57 సంవత్సరాలు ఉండటం తప్పనిసరి

  • Google Pay పర్సనల్ లోన్ కోసం దరఖాస్తు చేసుకునే వ్యక్తి CIBIL స్కోర్ కనీసం 600 ఉండాలి

  • మీరు మరే ఇతర బ్యాంక్ ద్వారా డిఫాల్ట్‌గా ప్రకటించబడి ఉండకూడదు


Google Pay పర్సనల్ లోన్ కోసం అవసరమైన పత్రాలు

1. ఆధార్ కార్డ్

2. పాన్ కార్డ్

3. ఆదాయ ధృవీకరణ పత్రం

4. మొబైల్ నంబర్

5. ఇ-మెయిల్ ID

6. గత 4 నెలల బ్యాంక్ స్టేట్‌మెంట్

7. పాస్‌పోర్ట్ సైజు ఫోటో


Google Pay పర్సనల్ లోన్ కోసం ఆన్‌లైన్‌లో ఎలా దరఖాస్తు చేయాలి?

  • మీరు ముందుగా Google Pay యాప్‌ను ప్లే స్టోర్ నుంచి ఇన్‌స్టాల్ చేయాలి

  • ఆ తర్వాత మీ ఫోన్ నంబర్ వంటి వివరాలను నమోదు చేయాలి

  • ఆ క్రమంలో జీపేలో బిజినెస్ ఫీచర్‌ను ఓపెన్ చేయాలి

  • తర్వాత దానిని క్రిందకు స్క్రోల్ చేస్తే మీకు ఫైనాన్స్ ఫీచర్ కనిపిస్తుంది

  • ఫైనాన్స్ ఫీచర్లో మీకు అనేక రకాల లోన్స్ యాప్స్ అందుబాటులో ఉంటాయి

  • వాటిలో మీకు నచ్చిన దానిని ఎంపిక చేసుకుని లోన్ కోసం దరఖాస్తు చేయవచ్చు

  • ఆ క్రమంలో మీ వివరాలను నమోదు చేసిన తర్వాత మీ అర్హతను బట్టి లోన్ ఇస్తారు

  • మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉంటే మీ లోన్ రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది

  • మీరు ఏదైనా ఇతర బ్యాంక్ నుంచి లోన్ తీసుకున్నట్లయితే ఆ రుణాన్ని తిరిగి చెల్లించే వరకు Google Pay ద్వారా మీకు లోన్ వచ్చే ఛాన్స్ తక్కువ


ఇవి కూడా చదవండి:

SIP Investment: చిరు ఉద్యోగస్తులకు గుడ్‌ న్యూస్.. రూ.99 నుంచే మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు

Cash Deposit Machine: క్యాష్ డిపాజిట్ మెషిన్ ద్వారా రోజు ఎంత డిపాజిట్ చేసుకోవచ్చు..


Online Shopping Tips: పండుగల సీజన్‌లో ఆన్‌లైన్‌ షాపింగ్ చేస్తున్నారా.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి

Bank Holidays: అక్టోబర్‌లో బ్యాంకు సెలవులు ఎన్నిరోజులంటే.. పనిచేసేది మాత్రం.

Read More Business News and Latest Telugu News

Updated Date - Oct 03 , 2024 | 04:17 PM