ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Savings: ఈ స్కీమ్‌లో పొదుపు చేస్తే.. మీ పిల్లల భవిష్యత్తు బంగారు మయమే..

ABN, Publish Date - Nov 12 , 2024 | 08:57 AM

మీరు కూడా మీ పిల్లల ఉన్నత విద్య కోసం ప్రస్తుతం డబ్బు ఆదా చేయాలని ఆలోచిస్తున్నట్లయితే, మీరు ఈ క్రింది పథకాలలో పెట్టుబడి పెట్టవచ్చు.

Savings: ఈ మధ్య కాలంలో పిల్లల చదువు అంత సులువు కాదు. ఎల్‌కెజి, యుకెజె నుండే లక్షల రూపాయల డొనేషన్ ఫీజు చెల్లించాల్సి ఉండటంతో తల్లిదండ్రులకు పిల్లల చదువు సవాలుగా మారింది. అయితే, ఎంత కష్టమైనా తల్లిదండ్రులు తమ పిల్లలకు మంచి చదువులు చెప్పించాలనే చూస్తారు. కానీ కాలేజీ, ఉన్నత విద్య, ప్రొఫెషనల్ కోర్సులకు అధిక ఫీజులు చెల్లించడం కష్టం అవుతుంది. ఇలాంటప్పుడు చిన్న చిన్న పొదుపు పథకం ద్వారా పెట్టుబడి పెడితే పిల్లల భవిష్యత్తుకు సురక్షితంగా ఉంటుంది.

PPF:

మీరు PPF సేవింగ్స్ ప్లాన్ ద్వారా ఇన్వెస్ట్ చేస్తే, మీ పిల్లలు పెద్దయ్యాక కాలేజీకి వెళ్లినప్పుడు మీకు పెద్ద మొత్తంలో వస్తుంది. PPF అనేది 15 సంవత్సరాల దీర్ఘకాలిక పెట్టుబడి ప్రణాళిక. నెలకు 500 రూపాయలతో పెట్టుబడిని ప్రారంభించడం సాధ్యమవుతుంది. ఉదాహరణకు, నెలకు మీరు 2,000 రూపాయల పెట్టుబడిని కొనసాగిస్తే, పెట్టుబడి మొత్తం 3,60,000 రూపాయలు, వడ్డీ మొత్తం 2,90,913 రూపాయలు అవుతుంది. 15 ఏళ్లలో రూ. 6,50,913 సేవ్ అవుతాయి.

అధిక రాబడిని ఇచ్చే పెట్టుబడులు..

అనేక పొదుపు పథకాలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. SIP ప్లాన్ ద్వారా పెట్టుబడి పెడితే గరిష్ట రాబడిని పొందవచ్చు. సిప్ ద్వారా ప్రతి నెలా రూ.5,000 ఇన్వెస్ట్ చేస్తే 12% వడ్డీ లభిస్తుంది. పెట్టుబడి మొత్తం 6 లక్షల రూపాయలు అయితే వడ్డీ 5.62 లక్షల రూపాయలు వస్తుంది. దీని ద్వారా మొత్తం 11.62 లక్షల రూపాయలు లభిస్తాయి. వాలంటరీ ప్రావిడెంట్ ఫండ్ (VPF), యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్ (ULIPలు), నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (NSC), మహిళా సమ్మాన్ యోజన వంటి అనేక పొదుపు పథకాలు అందుబాటులో ఉన్నాయి.

బాలికల కోసం సుకన్య సమృద్ధి యోజనతో సహా అనేక పథకాలు అందుబాటులో ఉన్నాయి. పిల్లల పేరిట జీవిత బీమా సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. చిన్నప్పటి నుంచే పిల్లల పేరిట పొదుపు చేయడం ప్రారంభిస్తే.. తక్కువ మొత్తంతో పెద్ద మొత్తంలో పొందవచ్చు. ఇది పిల్లల చదువుకు ఉపకరిస్తుంది.

కిసాన్ వికాస్ పత్రతో సహా అనేక పథకాల ద్వారా పెట్టుబడి పెట్టడం వల్ల పిల్లల భవిష్యత్తుకు భద్రత ఉంటుంది. అలాగే, పెన్షన్, ఇతర పథకాల ద్వారా పెట్టుబడి పెట్టడం మీ పదవీ విరమణలో మీకు సహాయం చేస్తుంది. ఇలా పిల్లల ఉన్నత విద్య కోసం ముందుగానే సేవింగ్స్ చేసుకున్నట్లయితే విద్యను పూర్తి చేయడం తల్లిదండ్రులకు సాధ్యమవుతుంది.

Updated Date - Nov 12 , 2024 | 09:06 AM