ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

GSTR-9: GST వార్షిక రిటర్నులు..కొన్ని జాగ్రత్తలు !

ABN, Publish Date - Dec 22 , 2024 | 02:01 AM

గడచిన ఆర్థిక సంవత్సరాని (2023-24)కి సంబంధించి వార్షిక రిటర్నులు జీఎ్‌సటీఆర్‌-9 దాఖలు చేయటానికి చివరి తేదీ 2024 డిసెంబరు 31.

డచిన ఆర్థిక సంవత్సరాని (2023-24)కి సంబంధించి వార్షిక రిటర్నులు జీఎ్‌సటీఆర్‌-9 దాఖలు చేయటానికి చివరి తేదీ 2024 డిసెంబరు 31. ఈ జీఎ్‌సటీఆర్‌-9 అనే రిటర్న్‌ ఒక ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన సమగ్ర రిటర్న్‌. అంటే ఆ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన అమ్మకాలు, కొనుగోళ్లు, తీసుకున్న ఇన్‌పుట్‌ ట్యాక్స్‌, చెల్లించిన పన్నులు.. మొదలైన విషయాలను ఈ రిటర్న్‌ ద్వారా తెలుసుకోవచ్చు. అలాగే సంబంధిత ఆర్థిక సంవత్సరంలో జరిగిన పొరపాట్లను ఈ రిటర్న్‌ ద్వారా సరి చేసుకోవచ్చు. ఉదాహరణకు, తీసుకోవాల్సిన ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ కంటే ఎక్కువ తీసుకున్నా, కట్టాల్సిన పన్ను కంటే తక్కువ కట్టినా, రివర్స్‌ చేయాల్సిన ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ కంటే తక్కువ చేసినా ఈ రిటర్న్‌ ద్వారా సవరణ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఈ రిటర్న్‌ దాఖలు చేసినప్పుడు అత్యంత జాగ్రత్త అవసరం.

అలాగే ఈ రిటర్న్‌లో కొన్ని కొన్ని ఫీల్డ్స్‌ అనేవి ఆ సంవత్సరానికి సంబంధించిన ఇతర రిటర్నులు అంటే జీఎస్‌టీఆర్‌-3బీ, జీఎ్‌సటీఆర్‌-2ఏ, జీఎ్‌సటీఆర్‌-2బీ నుంచి స్వయంగా కనిపిస్తాయి. దీన్నే ‘ఆటో పాపులేట్‌’ అంటారు. అంటే, ఈ ఫీల్డ్స్‌ను సిస్టమ్‌ ఆటోమేటిక్‌గా నింపుతుంది. ఇకపోతే మిగతా ఫీల్డ్స్‌ను స్వయంగా నింపాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఆటో పాపులేట్‌ ఫీల్డ్స్‌కు, మాన్యువల్‌ ఫీల్డ్స్‌కు మధ్య వ్యత్యాసం లేకుండా చూసుకోవాలి. అయితే ఇటీవలి కాలంలో ఈ జీఎ్‌సటీఆర్‌-9కు సంబంధించి కొన్ని మార్పులు చోటు చేసుకున్నాయి.


ఉదాహరణకు 2022-23 ఆర్థిక సంవత్సరం ఇన్‌పుట్‌ ట్యాక్స్‌కు సంబంధించిన ఆటో పాపులేట్‌ అనేది సిస్టమ్‌.. జీఎ్‌సటీఆర్‌-2ఏ నుంచి తీసుకోగా ఇప్పుడు అదే విషయాలు జీఎ్‌సటీఆర్‌-2బీ నుంచి తీసుకుంటుంది. అలాగే ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ విషయానికి వస్తే ఇది మూడు రకాలుగా ఉంటుంది. మొదటిది.. ఈ ఆర్థిక సంవత్సరపు క్రెడిట్‌ను ఇదే సంవత్సరం తీసుకోవటం. రెండోది.. గడచిన ఆర్థిక సంవత్సరపు క్రెడిట్‌ను ఈ ఆర్థిక సంవత్సరంలో తీసుకోవటం, మూడోది.. ఈ ఆర్థిక సంవత్సరం క్రెడిట్‌ను తదుపరి ఆర్థిక సంవత్సరంలో తీసుకోవటం. దీనికి కారణాలు అనేకం.. ఇన్వాయిస్‌ ఒక ఆర్థిక సంవత్సరంలో వచ్చి సరఫరా తదుపరి ఆర్థిక సంవత్సరంలో వచ్చి ఉండొచ్చు. సరఫరాదారుడు జీఎ్‌సటీఆర్‌-1 ఆలస్యంగా దాఖలు చేయవచ్చు లేదా క్రెడిట్‌ తీసుకోవటం మర్చిపోవచ్చు. జీఎ్‌సటీ నిబంధన ప్రకారం ఒక ఆర్థిక సంవత్సరంలో వచ్చిన ఇన్వాయి్‌సలకు సంబంధించిన క్రెడిట్‌ను తదుపరి ఆర్థిక సంవత్సరం నవంబరు 30 వరకు తీసుకునే వెసులుబాటు ఉంది. కాబట్టి, ఇలా ఒక ఆర్థిక సంవత్సరపు క్రెడిట్‌ తదుపరి ఆర్థిక సంవత్సరంలో తీసుకోవటం (గడువు లోపు) చట్ట ఉల్లంఘన కానప్పటికీ, తీసుకున్న క్రెడిట్‌కు.. ఆటో పాపులేట్‌ వివరాలకు మధ్య వ్యత్యాసం ఉండే అవకాశం ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం జీఎ్‌సటీఆర్‌-9 దాఖలుకు సంబంధించి ఇటీవల కొన్ని సూచనలు (అడ్వైజరీ) విడుదల చేసింది. ఆ వివరాలు...

సరఫరాదారుడు ఇన్వాయిస్‌ 2023-24లో ఇచ్చి ఆ వివరాలను 2024-25 జీఎ్‌సటీఆర్‌-1లో చూపి ఉంటే, ఈ వివరాలు 2023-24 జీఎ్‌సటీఆర్‌-9లో ఆటో పాపులేట్‌ కావు. అలాగే దీనికి సంబంధించిన ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ (ఐటీసీ) కూడా 2024-25లో తీసుకుని ఉంటారు (ఇన్వాయిస్‌ 2023-24కు చెందినప్పటికీ). అలాంటప్పుడు ఈ క్రెడిట్‌కు సంబంధించిన విషయాలను జీఎ్‌సటీఆర్‌-9లోని టేబుల్‌ 8ఏ, 13లో చూపాలి.


అలాగే కొనుగోలు 2023-24లో జరిగి సంబంధించిన వివరాలు జీఎ్‌సటీఆర్‌-2బీలో కనిపించినప్పటికీ, సరఫరా అనేది 2024-25లో పొంది ఉండవచ్చు. ఇలాంటప్పుడు ఈ వివరాలు 2023-24 జీఎ్‌సటీఆర్‌-9లో ఆటో పాపులేట్‌ అయినప్పటికీ క్రెడిట్‌ను 2024-25లో తీసుకోవాల్సి ఉంటుంది. ఈ వివరాలను కూడా టేబుల్‌ 8ఏ, 13లో చూపాలి.

అలాగే 2023-24లో క్రెడిట్‌ రివర్స్‌ చేసి తిరిగి 2024-25లో తీసుకుని ఉంటే.. అంటే రీక్లెయిమ్‌ చేసి ఉంటే ఆ వివరాలను టేబుల్‌ 6హెచ్‌లో చూపాలి.

పైన చెప్పినవి కొన్ని ముఖ్య సూచనలు అయినప్పటికీ, ముందు చెప్పినట్లు జీఎ్‌సటీఆర్‌-9 రిటర్న్‌ చాలా ముఖ్యమైన రిటర్న్‌ కాబట్టి ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలి.

Updated Date - Dec 22 , 2024 | 02:01 AM