Share News

Bank Holidays: సెప్టెంబర్ 2024లో బ్యాంకు సెలవులు ఎన్నంటే.. గణేష్ చతుర్థి సహా..

ABN , Publish Date - Aug 21 , 2024 | 10:45 AM

సెప్టెంబర్ నెల మరికొన్ని రోజుల్లో రాబోతుంది. అయితే ప్రభుత్వ, ప్రయివేటు బ్యాంకుల్లో లావాదేవీలు, చెక్కులు విత్ డ్రా, ఇతర బ్యాంకు సంబంధిత పనుల కోసం వెళ్లే వారు సెప్టెంబర్ నెలలో బ్యాంకులకు ఎన్ని రోజులు సెలవులు ఉంటాయో తప్పక తెలుసుకోవాలి. లేదంటే ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఈ నెలలో ఎన్ని రోజులు సెలవులు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

Bank Holidays: సెప్టెంబర్ 2024లో బ్యాంకు సెలవులు ఎన్నంటే.. గణేష్ చతుర్థి సహా..
bank holidays in September 2024

ఆగస్టు నెల మరో 10 రోజుల్లో పూర్తి కాబోతుంది. సెప్టెంబర్ 2024 నెల(september 2024) రాబోతుంది. అయితే ప్రభుత్వ, ప్రయివేటు బ్యాంకుల్లో లావాదేవీలు, చెక్కులు విత్ డ్రా, ఇతర బ్యాంకు సంబంధిత పనుల కోసం వెళ్లే వారు సెప్టెంబర్ నెలలో బ్యాంకులకు ఎన్ని రోజులు సెలవులు(bank holidays) తప్పకుండా ఉంటాయో తెలుసుకోవాలి. లేదంటే ఇబ్బందులు ఎదుర్కొనే ఛాన్స్ ఉంటుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం దేశంలోని ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకుల్లో 2024 సెప్టెంబర్‌లో మొత్తం 11 రోజులు సెలవులు ఉంటాయి. ఈ సెలవుల్లో ప్రాంతీయ సెలవులు, ప్రత్యేక రాష్ట్ర సెలవులు, రెండో, నాల్గవ శనివారంతో పాటు ఆదివారం వారపు సెలవులు కూడా ఉన్నాయి. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.


సెప్టెంబర్ 2024 బ్యాంక్ సెలవుల జాబితా:

  • సెప్టెంబర్ 1, 2024 - ఆదివారం - వారంతపు సెలవు

  • సెప్టెంబర్ 7, 2024 - శనివారం - గణేష్ చతుర్థి సందర్భంగా దేశవ్యాప్తంగా హాలిడే

  • సెప్టెంబర్ 8, 2024 - ఆదివారం - వారంతపు సెలవు

  • సెప్టెంబర్ 13, 2024 - శుక్రవారం - రామ్‌దేవ్ జయంతి, తేజ దశమి సందర్భంగా రాజస్థాన్‌లో బ్యాంకులకు హాలిడే

  • సెప్టెంబర్ 14, 2024 - శనివారం - రెండో శనివారం సందర్భంగా దేశమంతటా సెలవు

  • సెప్టెంబర్ 15, 2024 - ఆదివారం - వారంతపు హాలిడే


  • సెప్టెంబర్ 16, 2024 - సోమవారం - ఈద్ ఇ మిలాద్ సందర్భంగా దేశవ్యాప్తంగా హాలిడే

  • సెప్టెంబర్ 17, 2024 - మంగళవారం - ఇంద్ర జాత్ర నేపథ్యంలో సిక్కింలో బ్యాంకులకు సెలవు

  • సెప్టెంబర్ 18, 2024 - శనివారం - శ్రీనారాయణ గురు జయంతి నేపథ్యంలో కేరళలో సెలవు

  • సెప్టెంబర్ 21, 2024 - శనివారం - శ్రీనారాయణ గురు సమాధి నేపథ్యంలో కేరళ హాలిడే


  • సెప్టెంబర్ 23, 2024 - సోమవారం - అమరవీరుల దినోత్సవం నేపథ్యంలో హర్యానాలో సెలవు

  • సెప్టెంబర్ 28, 2024 - శనివారం - నాల్గో శనివారం సందర్భంగా దేశవ్యాప్తంగా హాలిడే

ఈ రోజుల్లో బ్యాంకులు మూసివేయబడతాయి కానీ ఆన్ లైన్ బ్యాంకింగ్ కార్యకలపాలు మాత్రం యాథావిధిగా కొనసాగుతాయి. దీంతోపాటు మీరు ఏటీఎంలో క్యాష్ డిపాజిట్, విడ్ డ్రా వంటి సౌకర్యాలను కూడా ఉపయోగించుకోవచ్చు. అయితే బ్యాంకు పనుల కోసం మాత్రం వెళ్లే వారు ఈ సెలవులను దృష్టిలో ఉంచుకుని మీ పనులను నిర్వహించుకోవాల్సి ఉంటుంది.


ఇవి కూడా చదవండి:

Stock Market: భారీ నష్టాలతో మొదలైన స్టాక్ మార్కెట్లు.. టాప్ 5 లాసింగ్ స్టాక్స్


Multibagger Stock: ఒకప్పుడు ఈ స్టాక్ ధర రూ.1.80.. ఇప్పుడు రూ.357.. ఇన్వెస్టర్లకు కోట్లలో లాభం

Multibagger Stock: రూ.1,113 నుంచి రూ.10,310కి చేరిన షేర్ ప్రైస్.. ఐదేళ్లలోనే మల్టీబ్యాగర్‌ లిస్ట్‌లోకి..


Read More Business News and Latest Telugu News

Updated Date - Aug 30 , 2024 | 07:12 PM