ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Personal Finance: రూ. 2 కోట్లు సంపాదించాలంటే రోజు ఎంత పొదుపు చేయాలి..

ABN, Publish Date - Nov 09 , 2024 | 11:39 AM

మీరు ప్రస్తుతం సాధారణ జీవనశైలిలో జీవించాలనుకున్నప్పటికీ, ద్రవ్యోల్బణాన్ని అధిగమించడానికి మీరు ప్రతినెల కూడా కొంత మొత్తాన్ని సేవ్ చేయాలి. ఇలా ప్రతి రోజు కొంత మొత్తాన్ని సేవ్ చేసుకోవడం అలవాటు చేసుకుంటే, మీరు దీర్ఘకాలంలో రెండు కోట్ల రూపాయలను సంపాదించవచ్చు. అది ఎలా అనే విషయాలను ఇక్కడ చుద్దాం.

Personal Finance tips

పెట్టుబడి ప్రాథమిక మంత్రం ఏమిటంటే, మీరు ఎంత చిన్న వయస్సులో పొదుపు(savings) చేయడం ప్రారంభిస్తే.. మీకు భవిష్యత్తులో అన్ని ఎక్కువ ప్రయోజనాలు లభిస్తాయి. ఇలా చేయడం ద్వారా మీరు దీర్ఘకాలంలో పొదుపుపై భారీ రాబడిని పొందవచ్చు. అదే సమయంలో ఇది భవిష్యత్తులో డబ్బు ఒత్తిడి నుంచి కూడా మిమ్మల్ని దూరం చేస్తుంది. అందుకోసం మీకు మ్యూచువల్ ఫండ్ సిప్ అనేది మంచి ఎంపిక. దీనిలో మీరు క్రమశిక్షణతో పెట్టుబడులు (investments) చేయడం ద్వారా మీ లక్ష్యాలను సులభంగా సాధించుకోవచ్చు. అయితే మీరు భవిష్యత్తులో ఒక రెండు కోట్ల రూపాయలు పొందాలని అనుకుంటే రోజు ఎంత పెట్టుబడి చేయాలి. ఎన్ని రోజులు చేయాలనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.


తక్కువ మొత్తంలో

మ్యూచువల్ ఫండ్ సిప్ విధానంలో మీ మొత్తం డబ్బును ఒకేసారి పెట్టుబడి పెట్టడానికి బదులుగా ప్రతి నెలా కొద్ది కొద్దిగా పెట్టుబడి చేసుకోవడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. ఇందులో మీరు పెట్టుబడిని ప్రారంభించేటప్పుడు ప్రతి నెల ఎంత పెట్టుబడి పెట్టాలో నిర్ణయించుకోవచ్చు. SIPని 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం పాటు కూడా అమలు చేసుకోవచ్చు. దీర్ఘకాలంలో ప్రతి ఏటా 12 నుంచి 20 శాతం రాబడిని ఇస్తున్న అనేక మ్యూచువల్ ఫండ్‌లు మార్కెట్లో అమల్లో ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మీరు దీర్ఘకాలిక పెట్టుబడి ద్వారా మంచి ఫండ్‌ను సృష్టించుకోవచ్చు.


దీర్ఘకాలంలో మంచి రాబడులు

ప్రస్తుతం మీరు దీర్ఘకాలంలో రూ. 2 కోట్ల నిధిని సమీకరించాలని అనుకుంటే ప్రతి రోజు 700 రూపాయలు పొదుపు చేయాలి. అంటే నెలకు రూ. 21 వేలు సిప్ విధానంలో ఇన్వెస్ట్ చేయాలి. ఉదాహరణకు మీకు 30 ఏళ్లు ఉన్నప్పుడు ఈ పొదుపు చేయడం ప్రారంభిస్తే, మీ వయస్సు 50 ఏళ్లు వచ్చే నాటికి మీకు రెండు కోట్ల రూపాయలు లభిస్తాయి. అంచనా వేసిన రాబడి 12 శాతంగా పరిగణించబడుతుంది. అంటే మీరు 20 ఏళ్ల పాటు ప్రతి నెలకు రూ. 21 వేలు సేవ్ చేయాల్సి ఉంటుంది.

10 వేలు చెల్లిస్తే..

ఆ క్రమంలో మీరు చేసిన పెట్టుబడి మొత్తం రూ. 50,40,000 కాగా, మీకు లభించేది మాత్రం రూ. 2,09,82,106. ఒక వేళ మీరు తక్కువ మొత్తంతో పెట్టుబడి చేయాలనుకుంటే మాత్రం చెల్లించే సమయం పెరుగుతుంది. ఉదాహరణకు ఇదే 2 కోట్ల మొత్తం కోసం మీరు ప్రతి నెల రూ. 10 వేలు చెల్లిస్తే చాలు. కానీ దీనికోసం మీరు 25 ఏళ్లపాటు చెల్లించాల్సి ఉంటుంది.


ఇవి కూడా చదవండి:

PPF Account: ఉపయోగించని మీ పీపీఎఫ్ ఖాతాను ఇలా యాక్టివేట్ చేసుకోండి..


Bank Holidays: నవంబర్ 2024లో బ్యాంక్ సెలవులు.. దాదాపు సగం రోజులు బంద్..


Investment Tips: ఒకేసారి రూ. 12 లక్షలు పెట్టుబడి చేసి మరచిపోండి.. ఆ తర్వాత ఎంతవుతుందంటే..

Read More Business News and Latest Telugu News


Updated Date - Nov 09 , 2024 | 11:40 AM