ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

FLY91: రూ.1991కే హైదరాబాద్ టూ గోవా విమాన ప్రయాణం!

ABN, Publish Date - Mar 20 , 2024 | 12:03 PM

దేశంలోని విమానయాన రంగంలోకి మరో కొత్త ఫ్లైట్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. అంతేకాదు ఇవి ఏకంగా అత్యంత తక్కువ ధరల్లో ఉండటం విశేషం. ఇటివల హైదరాబాద్ టూ గోవా ఫ్లైట్ సేవలు కూడా ప్రారంభమయ్యాయి. ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.

దేశంలోని విమానయాన రంగంలోకి మరో కొత్త ఫ్లైట్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. అంతేకాదు ఇవి ఏకంగా అత్యంత తక్కువ ధరల్లో ఉండటం విశేషం. ఇటివల గోవా కేంద్రంగా FLY91 అనే విమానయాన సంస్థ తన వాణిజ్య కార్యకలాపాలను(commercial operations) ప్రారంభించింది. ఈ నేపథ్యంలో గోవా నుంచి బెంగళూరుకు ఫ్లైట్ సేవలను సోమవారం ఆరంభించగా, ఈ సందర్భంగా కేవలం రూ.1,991 (అన్నీ కలుపుకొని)కే టికెట్ ధరను నిర్ణయించింది. ఇదేరోజు FLY91 బెంగళూరు నుంచి సింధుదుర్గ్‌కు తన ప్రారంభ విమానాన్ని మొదలుపెట్టింది.

దీంతోపాటు మంగళవారం హైదరాబాద్ టూ గోవా(Hyderabad to Goa) ఫ్లైట్ సేవలను కూడా ప్రారంభించింది. ఈ నేపథ్యంలో సింధుదుర్గ్, గోవా ప్రాంతాలకు ఇక్కడి నుంచి వారానికి రెండు సార్లు సేవలను కొనసాగించనున్నట్లు FLY91 మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మనోజ్ చాకో తెలిపారు. ప్రస్తుతం సోమ, శుక్ర, శనివారాల్లో గోవా నుంచి బెంగళూరు మధ్య విమాన సర్వీసులు కొనసాగుతున్నాయని అన్నారు. ఆ తర్వాత క్రమంగా ఏప్రిల్ నాటికి అగట్టి, జల్గావ్, పూణే వంటి ప్రాంతాలకు కూడా తమ కార్యకలాపాలను విస్తరించడానికి ప్లాన్ చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.


అయితే అందిరికీ విమానయాన సేవలు(flight services) అందుబాటులో ఉండేందుకు తక్కువ ధరను నిర్ణయించినట్లు ఫ్లై91(FLY91) ఎండీ స్పష్టం చేశారు. ఈ నిర్ణయం తర్వాత విమానయాన సేవల్లో మరింత పోటీ ఉంటుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. అంతేకాదు దేశంలో ఎవ్వరూ అమలు చేయని విధంగా తాము ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేర్చడానికి సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: World Happiness Report 2024: వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్‌లో మళ్లీ అదే దేశం..వరుసగా ఏడోసారి

Updated Date - Mar 20 , 2024 | 12:03 PM

Advertising
Advertising