Business Idea: రూ.60 వేలతో సీజనల్ బిజినెస్..నెలకు లక్షకుపైగా ఆదాయం
ABN, Publish Date - Apr 21 , 2024 | 11:55 AM
ఎడాకాలం వచ్చింది. మొదట్లోనే అనేక చోట్ల ఎండలు(summer) మండి పోతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుత సీజన్లో ఎక్కువగా డిమాండ్ ఉన్న ఓ వ్యాపారం గురించి తెలుసుకుందాం. అదే ఐస్ క్యూబ్ బిజినెస్. దీనిని అంత చీప్‌గా తీసుకోకండి. ఎందుకంటే ఈ వ్యాపారం(business) ద్వారా తక్కువ సమయంలోనే ఎక్కువ మొత్తంలో సంపాదించవచ్చు.
ఎడాకాలం వచ్చింది. మొదట్లోనే అనేక చోట్ల ఎండలు(summer) మండి పోతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుత సీజన్లో ఎక్కువగా డిమాండ్ ఉన్న ఓ వ్యాపారం గురించి తెలుసుకుందాం. అదే ఐస్ క్యూబ్ బిజినెస్. దీనిని అంత చీప్‌గా తీసుకోకండి. ఎందుకంటే ఈ వ్యాపారం(business) ద్వారా తక్కువ సమయంలోనే ఎక్కువ మొత్తంలో సంపాదించవచ్చు. అయితే ఈ బిజినెస్ ప్రారంభించాలంటే ఎంత పెట్టుబడి అవుతుంది, ఎంత మిగులుతుందనే వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.
ఎండాకాలంలో ఐస్ క్యూబ్(Ice Cube)లకు ఎంత డిమాండ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పెద్ద పెద్ద రెస్టారెంట్‌లు, పబ్బులు, ఐస్‌క్రీం షాపులు, జ్యూస్ సెంటర్లు, పెళ్లి వంటి ఫంక్షన్ల వరకు ప్రతిచోటా ఉపయోగిస్తారు. వేడి పెరిగేకొద్దీ, దీని డిమాండ్ కూడా అదే వేగంతో పెరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ వేసవి సీజన్‌లో మీరు ఐస్ క్యూబ్ వ్యాపారం ప్రారంభించడం ద్వారా పెద్ద ఎత్తున మనీ సంపాదించవచ్చు.
అయితే ఐస్ క్యూబ్(Ice Cube) తయారీ కోసం మీకు పెద్దగా స్థలం అవసరం లేదు. ఈ వ్యాపారాన్ని మంచి విద్యుత్ సరఫరా ఉన్న ప్రాంతంలో ఏర్పాటు చేసుకోవచ్చు. కానీ దీని కోసం మీకు పెద్ద ఫ్రీజర్ అవసరం. దాని ద్వారా మీరు ఐస్‌ను నిల్వ చేసుకోవచ్చు. మీరు వివిధ పరిమాణాలు, బరువులలో మంచును తయారు చేసుకోవచ్చు. కాబట్టి వినియోగదారులు వారి అవసరాలకు అనుగుణంగా మంచును కొనుగోలు చేయగలుగుతారు. మీరు ఏదైనా కొత్తగా చేయాలనుకుంటే, ఆకర్షణీయమైన డిజైన్లలో కూడా ఐస్‌ను తయారు చేసుకోవచ్చు.
ఈ ఐస్ క్యూబ్ వ్యాపారం కోసం ముందుగా మీరు డీప్ ఫ్రీజర్(deep freezer)ను కొనుగోలు చేయాలి. దీని అంచనా ధర సుమారు రూ. 50,000. ఇది కాకుండా మీరు ఈ వ్యాపారంలో ఉపయోగపడే కొన్ని ఇతర పరికరాలను కూడా తీసుకోవాలి. అయితే ఐస్ క్యూబ్స్ తయారీ వ్యాపారంలోకి ప్రవేశించే ముందు దీని గురించి కొంత పరిశోధన చేయాలి. మీరు మీ ఉత్పత్తిని సులభంగా విక్రయించగలిగే సమీప మార్కెట్ గురించి తెలుసుకోవాలి.
మంచును(ice) విక్రయించడానికి మొదట మీరు కొంతమంది కొనుగోలుదారులను సంప్రదించాలి. మార్కెట్‌లో ఉన్న మంచు ధర ఎంత ఉందో తెలుసుకోవాలి. దీంతో వ్యాపారం స్థాపించబడిన తర్వాత కొనుగోలుదారులు స్వంతంగా మిమ్మల్ని సంప్రదించడం ప్రారంభిస్తారు. మీరు మీ ఐస్‌ని ఐస్ క్రీం దుకాణాలు(shops), హోటళ్లు, రెస్టారెంట్లు, పండ్ల దుకాణాలు, కూరగాయల సహా ఇతర విక్రయదారులకు అమ్ముకోవచ్చు. ఇది కాకుండా ఆన్‌లైన్‌లో కూడా విక్రయించవచ్చు.
అయితే మీ ఉత్పత్తి అమ్మకాలు(sales), డిమాండ్(demand)ను బట్టి సంపాదన ఉంటుంది. సాధారణంగా మార్కెట్‌లో చిన్న ఐస్ క్యూబ్ ప్యాకెట్లను కనీసం రూ.50 నుంచి విక్రయిస్తున్నారు. ఈ ప్యాకెట్ విక్రయం ద్వారా మీరు 30 రూపాయల వరకు సంపాదించవచ్చు. ఈ విధంగా ప్రతి రోజు మీరు 200 ప్యాకెట్ల మొత్తం కోసం ఐస్ అమ్మితే 30x200 లెక్కన మీకు 6000 రూపాయలు వస్తుంది.
రోజుకు 6 వేల రూపాయలు వస్తే నెలకు లక్షా 80 వేల వరకు ఆదాయం(income) వస్తుంది. పెట్టుబడి 60 వేలు పోయినా కూడా లక్షా 20 వేలు నెలకు ఆదాయం వస్తుందని చెప్పవచ్చు. మీ వ్యాపారం బాగా పుంజుకుంటే లాభం మరింత పెరుగుతుంది. అయితే వ్యాపారం కొన్ని రోజులు జరగకపోయినా కూడా ఐస్ పాడవదు. మరిన్ని రోజులు స్టోర్ చేసి హోల్ సేల్‌గా అమ్ముకోవచ్చు.
ఇది కూడా చదవండి:
Alert: ఈ సేవింగ్ ఖాతాలపై మే 1 నుంచి ఛార్జీలు..ఈ కనీస మొత్తం లేకపోతే
Business Idea: ఉద్యోగానికి బై చెప్పేసి రూ.50,000తో వ్యాపారం.. ఇప్పుడు నెలకు లక్షల్లో ఆదాయం!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం
Updated Date - Apr 21 , 2024 | 11:58 AM