Alert: మే 1 నుంచి ఈ క్రెడిట్ కార్డులపై బాదుడే బాదుడు
ABN, Publish Date - Apr 30 , 2024 | 01:06 PM
ఈరోజు ఏప్రిల్ నెల చివరి రోజు. రేపటి నుంచి కొత్త మే నెల ప్రారంభం కానుంది. ప్రతి నెల 1వ తేదీన కొన్ని మార్పులు ఉంటాయి. ఈ క్రమంలోనే మే నెలలో కూడా పలు మార్పులు వచ్చాయి. అవేంటో ఇప్పుడు చుద్దాం. మే 1 నుంచి క్రెడిట్ కార్డుల(credit cards) యుటిలిటీ బిల్లు చెల్లింపులపై బ్యాంకులు 1% అదనపు ఛార్జీని విధించనున్నాయి.
ఈరోజు ఏప్రిల్ నెల చివరి రోజు. రేపటి నుంచి కొత్త మే నెల ప్రారంభం కానుంది. ప్రతి నెల 1వ తేదీన కొన్ని మార్పులు ఉంటాయి. ఈ క్రమంలోనే మే నెలలో కూడా పలు మార్పులు వచ్చాయి. అవేంటో ఇప్పుడు చుద్దాం. మే 1 నుంచి క్రెడిట్ కార్డుల(credit cards) యుటిలిటీ బిల్లు చెల్లింపులపై బ్యాంకులు 1% అదనపు ఛార్జీని విధించనున్నాయి. వాటిలో యెస్ బ్యాంక్, IDFC ఫస్ట్ బ్యాంక్ ఉన్నాయి.
ఇవి మే 1, 2024 నుంచి తమ క్రెడిట్ కార్డ్‌ల ద్వారా యుటిలిటీ బిల్లు చెల్లింపులపై అదనంగా 1 శాతం వసూలు చేయనున్నట్లు ప్రకటించాయి. ఈ నేపథ్యంలో మీకు యెస్ బ్యాంక్(yes bank) క్రెడిట్ కార్డ్ ఉంటే రూ. 15,000 వరకు ఉచిత వినియోగ పరిమితి ఉంటుంది. ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్‌కు అయితే ఇది రూ. 20,000 వరకు పరిమితి ఉంది.
ఈ అదనపు ఛార్జీ FIRST ప్రైవేట్ క్రెడిట్ కార్డ్, LIC క్లాసిక్ క్రెడిట్ కార్డ్, LIC సెలెక్ట్ క్రెడిట్ కార్డ్‌కి వర్తించదు. కాబట్టి స్టేట్‌మెంట్ సైకిల్‌లో మీ సంయుక్త యుటిలిటీ బిల్లు చెల్లింపులు రూ. 20,000 లేదా అంతకంటే తక్కువ ఉంటే మీరు ఈ అదనపు ఛార్జీని తప్పించుకోవచ్చు. అంతేకాదు రూ. 20,000 దాటితే మీరు 1% సర్‌ఛార్జ్‌తో పాటు అదనంగా 18% GSTని చెల్లించే అవకాశం ఉంటుంది.
మరోవైపు ప్రైవేట్ రంగ బ్యాంకు ఐసీఐసీఐ(ICICI) కూడా మే 1 నుంచి తమ కస్టమర్‌ల నుంచి ప్రత్యేక చార్జీలను వసూలు చేయనున్నట్లు ప్రకటించింది. ఇందులో చెక్ బుక్, IMPS, ECS/NACH డెబిట్ రిటర్న్, స్టాప్ పేమెంట్ ఛార్జీలు మొదలైన సేవలు ఉన్నాయి. ఇది కాకుండా డెబిట్ కార్డ్ సర్వీస్ చార్జ్ వార్షిక రుసుము 200 రూపాయలకు పెంచారు. ఇది గ్రామీణ ప్రాంతాలకు ఇది సంవత్సరానికి రూ.99 ఉంటుంది. ICICI బ్యాంక్ సేవింగ్స్ ఖాతాకు సంబంధించి 17 ఛార్జీలను సవరించింది.
ఇది కూడా చదవండి:
తెలంగాణ పదో తరగతి ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
IRCTC: 8 రోజులు, 7 రాత్రుల స్పెషల్ టూర్ ప్యాకేజీ.. శ్రీకృష్ణుడి ద్వారకా నగరం సహా ఇవి కూడా
Read Latest Business News and Telugu News
Updated Date - Apr 30 , 2024 | 01:08 PM