ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Credit Cards: క్రెడిట్ కార్డు బిల్లు సకాలంలో కట్టకపోతే ఏమవుతుంది.. భారీ జరిమానాలు చెల్లించాలా..!

ABN, Publish Date - Jun 10 , 2024 | 10:14 AM

నేడు క్రెడిట్ కార్డు వాడటం సర్వసాధారణమైంది. ఆర్థిక అవసరాలు తీర్చుకోవడానికి అత్యవసర సమయాల్లో క్రెడిట్ కార్డు ఉపయోగపడుతుంది. క్రెడిట్ కార్డు ఉంది కదా అని అవసరం లేకపోయినా మొత్తం లిమిట్ ఉపయోగించుకుంటే, నెల అయ్యే సరికి వాయిదా కట్టే సమయంలో ఎన్నో ఇబ్బందులు పడాల్సి వస్తుంది.

Credit Cards

నేడు క్రెడిట్ కార్డు వాడటం సర్వసాధారణమైంది. ఆర్థిక అవసరాలు తీర్చుకోవడానికి అత్యవసర సమయాల్లో క్రెడిట్ కార్డు ఉపయోగపడుతుంది. క్రెడిట్ కార్డు ఉంది కదా అని అవసరం లేకపోయినా మొత్తం లిమిట్ ఉపయోగించుకుంటే, నెల అయ్యే సరికి వాయిదా కట్టే సమయంలో ఎన్నో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. నెలసరి వాయిదాలు (Monthly EMI) సక్రమంగా చెల్లించకపోతే సదరు బ్యాంకులు లేదా సంస్థలు జరిమానా విధిస్తాయి. కొన్ని సందర్భాల్లో భారీ పెనాల్టీలు విధించడంతో అవి చెల్లించలేక క్రెడిట్ కార్డు వినియోగదారులు ఇబ్బందులు పడుతుంటారు. ఒకోసారి కట్టేందుకు డబ్బులున్నా క్రెడిట్ కార్డు బిల్లు కట్టాల్సిన తేదీని మర్చిపోతుంటారు. దానివల్ల కూడా వారి క్రెడిట్ స్కోర్ దెబ్బతినంతో పాటు, జరిమానాలు కట్టాల్సి ఉంటుంది. ఒకవేళ ఎవరైనా క్రెడిట్ కార్డు బిల్లు నిర్ణీత గడువులో కట్టడం మర్చిపోతే జరిమానాలు ఎలా ఉంటాయి. రిజర్వు బ్యాంకు నిబంధనలు ఏం చెబుతున్నాయో తెలుసుకుందాం.


నెలాఖరులో నగదు కొరత ఏర్పడటం, ఏదైనా అత్యవసర పరిస్థితుల కారణంగా లేదా బిల్లు కట్టే తేదీ మర్చిపోవడం వల్ల సకాలంలో క్రెడిట్ కార్డు వాయిదాలు చెల్లించలేకపోతారు. రిజర్వు బ్యాంకు నిబంధనల ప్రకారం వాయిదా చెల్లించడం మూడు రోజుల కంటే ఆలస్యమైతేనే సదరు బ్యాంకులు లేదా సంస్థలు ఆలస్య రుసుమును విధిస్తాయి. క్రెడిట్ కార్డ్ స్టేట్‌మెంట్‌లో పేర్కొన్న విధంగా, చెల్లింపు గడువు దాటిన తరువాత నుండి మాత్రమే అపరాధ రుసుము విధించాలని రిజర్వు బ్యాంకు నిబంధనలు చెబుతున్నాయి. చాలా మందిలో ఓ అనుమానం ఉంటుంది. క్రెడిట్ కార్డుకు సంబంధించిన వాయిదా ఏదైనా ఒక నెల కట్టకపోతే మనం తీసుకున్న రుణం మొత్తానికి ఫెనాల్టీ పడుతుందా.. కేవలం ఒకనెల ఈఎంఐకు మాత్రమే పడుతుందా అనే అనుమానం వస్తుంది. రిజర్వు బ్యాంకు నిబంధనల ప్రకారం క్రెడిట్ కార్డు వినియోగదారుడు ఆ నెలలో కట్టాల్సిన వాయిదా మొత్తం ఎంత అయితే ఉంటుందో దానికి మాత్రమే అపరాధ రుసుము లేదా లేట్ ఫీజు విధించాల్సి ఉంటుంది.

అప్రమత్తతే మేలు !


ఆర్బీఐ రూల్స్..

రిజర్వు బ్యాంకు నిబంధనల ప్రకారం బ్యాంకులు, సంస్థలు ఓ వ్యక్తి చెల్లించకపోయిన నెల వాయిదా మొత్తం మీద మాత్రమే అపరాధ రుసుమును విధిస్తాయి. లేట్ ఫీజు విషయంలోనూ కొన్ని నిబంధనలు ఉన్నాయి. క్రెడిట్ కార్డు జారీ చేసిన సమయంలోనే వాయిదా కట్టడంలో విఫలమైతే ఎంత ఆలస్య రుసుము విధిస్తారనేది స్పష్టం చేస్తారు. ఆ విధంగా మాత్రమే ఛార్జీలు వసూలు చేయాల్సి ఉంటుంది. అయితే ఈ లేట్ ఫీజు లేదా వడ్డీల్లో ఏవైనా మార్పులు చేసినా, రేట్లను పెంచినా క్రెడిట్ కార్డు వినియోగదారుడుకి ఒక నెల రోజుల ముందు నోటీసు ఇవ్వాల్సి ఉంటుంది. నోటీసు ఇచ్చిన తర్వాత మాత్రమే ఛార్జీలను మార్చాల్సి ఉంటుంది. ఒక వేళ బ్యాంకులు లేదా ఏవైనా సంస్థలు విధించిన ఛార్జీలు ఎక్కువుగా ఉన్నాయని, రీజన్‌బుల్ గా లేవని భావిస్తే అన్ని బకాయిలు చెల్లించిన తర్వాత క్రెడిట్ కార్డ్‌ని సరెండర్ చేయవచ్చు. అలా క్రెడిట్ కార్డును వదులుకున్నప్పుడు ఎటువంటి అదనపు ఛార్జీని విధించకూడదు. విధిస్తే రిజర్వు బ్యాంకు నిబంధనలను ఉల్లంఘించినట్లే అవుతుంది.


భారత పౌర విమానయానం అదుర్స్‌

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read More Business News and Latest Telugu News

Read more!

Updated Date - Jun 10 , 2024 | 10:14 AM

Advertising
Advertising