New Telecommunications Act: మరికొన్ని రోజుల్లో కొత్త టెలికమ్యూనికేషన్స్ చట్టం అమలు.. మార్పులివే..
ABN, Publish Date - Jun 22 , 2024 | 09:16 AM
దేశంలో టెలికాం చట్టం 2023, జూన్ 26, 2024 నుంచి పాక్షికంగా అమల్లోకి వస్తుందని శుక్రవారం విడుదల చేసిన ప్రభుత్వ నోటిఫికేషన్ తెలిపింది. పాక్షికంగా అంటే ఈ చట్టంలోని పలు సెక్షన్ల నియమాలు అమల్లోకి వస్తాయి. అయితే ఈ కొత్త చట్టం అమలుతో ఎలాంటి నిబంధనలు అమల్లోకి వస్తాయనే విషయాలను ఇప్పుడు చుద్దాం.
దేశంలో టెలికాం చట్టం 2023, జూన్ 26, 2024 నుంచి పాక్షికంగా అమల్లోకి వస్తుందని శుక్రవారం విడుదల చేసిన ప్రభుత్వ నోటిఫికేషన్ తెలిపింది. పాక్షికంగా అంటే ఈ చట్టంలోని పలు సెక్షన్ల నియమాలు అమల్లోకి వస్తాయి. టెలికమ్యూనికేషన్స్ చట్టం 2023 (new Telecommunications Act) ప్రస్తుతం ఉన్న పురాతన ఇండియన్ టెలిగ్రాఫ్ చట్టం (1885), వైర్‌లెస్ టెలిగ్రాఫీ చట్టం (1993), టెలిగ్రాఫ్ వైర్ (అక్రమ ఆక్యుపెన్సీ) చట్టం (1950) ప్లేస్‌లో వస్తుంది.
ఈ నిబంధనలు..
జూన్ 26 నుంచి అమల్లోకి రానున్న ఈ చట్టం ప్రకారం జాతీయ భద్రత, విదేశీ రాష్ట్రాలతో స్నేహపూర్వక సంబంధాలు లేదా యుద్ధం జరిగినప్పుడు ఏదైనా లేదా అన్ని టెలికమ్యూనికేషన్ సేవలు, నెట్‌వర్క్‌లను ప్రభుత్వం నియంత్రించవచ్చు. ఈ కొత్త నిబంధనల అమలుతో యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్ ఫండ్ 'డిజిటల్ ఇండియా ఫండ్'గా మారుతుంది. దీంతోపాటు గ్రామీణ ప్రాంతాల్లో టెలికాం సేవల (Telecom Services) స్థాపన, పరిశోధన, అభివృద్ధి పైలట్ ప్రాజెక్టుల స్థాపనకు దోహదం చేస్తుంది.
ఆదేశాలు కూడా..
కొత్త రూల్స్ స్పామ్, ఇతర కమ్యూనికేషన్ సేవల నుంచి వినియోగదారులను రక్షించడానికి కూడా ఆదేశాలు జారీ చేస్తాయి. ఈ విభాగాల అమలు టెలికాం నెట్‌వర్క్‌లకు (Telecom Network) వివక్షత లేని, గుత్తాధిపత్య రహిత మార్గాన్ని కట్టడి చేస్తుంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి ఛానెల్‌లు, కేబుల్ కారిడార్‌లను రూపొందించడానికి కేంద్ర ప్రభుత్వానికి అధికారం లభిస్తుంది. టెలికమ్యూనికేషన్స్ బిల్లు 2023ని 18 డిసెంబర్ 2023న లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఈ చట్టాన్ని 20 డిసెంబర్ 2023న లోక్‌సభ ఆమోదించింది. ఆ తర్వాత డిసెంబర్ 21న రాజ్యసభలో ప్రవేశపెట్టబడింది. అదే రోజున రాజ్యసభ కూడా ఆమోదించింది.
ఇది కూడా చదవండి:
T20 World Cup 2024: నేడు ఇండియా vs బంగ్లాదేశ్ మ్యాచ్.. పిచ్, విన్ ప్రిడిక్షన్ ఎలా ఉందంటే..
Grocery Store: కిరాణా షాపులో కాల్పులు.. ముగ్గురు మృతి, 10 మందికి గాయాలు
For Latest News and Business News click here
Updated Date - Jun 22 , 2024 | 09:21 AM